'ఆర్వీ చారి కరెంటు బిల్లు ' ! - పతంజలి శాస్త్రి గారి కథ episode artwork

EPISODE · Dec 20, 2020 · 31 MIN

'ఆర్వీ చారి కరెంటు బిల్లు ' ! - పతంజలి శాస్త్రి గారి కథ

from Harshaneeyam

ఆర్వీ చారి కరెంటు బిల్లు అనే ఈ కథ, శాస్త్రి గారి 'నలుపెఱుపు' అనే కథా సంకలనం లోనిది.కథ చివరన మిత్రులు, నండూరి రాజగోపాల్ గారు , కథపై వారి అభిప్రాయాన్ని తెలియజెయ్యడం జరుగుతుంది.శాస్త్రి గారి రచనా ప్రక్రియ, రచనా జీవితం గురించి , హర్షణీయంలో ప్రసారమైన ఎపిసోడ్స్ లింకులు ఇదే పేజీ లో కింద ఇవ్వడం జరిగింది.ఆర్వీచారి కరెంటు బిల్లు:లిఫ్ట్ మూసుకోబోతూండగా రజనీదేశ్ పాండే ఒక్క గెంతులో లోపలికి దూకింది. చారి నవ్వేడు.“కనీసం మూడు నిముషాలు ఆదా అయ్యేయి" అందామె.“లేదా నీ ముక్కు బద్దలయ్యేది. ఏది నయమో నీకే తెలియాలి" అన్నాడతను.అప్పటికే లిఫ్టు గాజు బుడగలో ఆమె డియో కమ్మగా కమ్ముకుంది.“వెరీ నైస్. కొన్నావా, బాయ్ ఫ్రెండ్ చేత కొనిపించావా?" అన్నాడు మళ్లీ.లిఫ్ట్ పదో అంతస్తు దగ్గర మెత్తగా ఆగి తెరుచుకుంది.బయటికి వెళ్తూ “నెక్స్ట్ టైమ్ యువర్ టర్న్” అంది రజని.లిఫ్ట్ లోంచి అతనికి వరండాలో అలలా వెళ్తున్న రజనీ వంపు తిరిగి మాయమైంది.మిగిలిపోయిన డియో పీల్చుకుని ఆర్వీ పధ్నాలుగో అంతస్తులో దిగేడు. పదకొండు దాటిం తరవాత ఎప్పుడో సిస్టం ముందు నుంచి లేచి ఒళ్లు విరుచుకుని కిటికీ దగ్గిరికి కుర్చీ లాక్కుని కిందికి చూశాడతను..వంద ఎకరాలు మెత్తని పచ్చికలో లేత కనకాంబరం రంగులో ఇరవై అంతస్తుల పాలరాయి చెట్టు.దాన్లో పదిహేను గూళ్లు తొలిచేరుఎరుపు, పసుపు పచ్చ పూలచెట్లు ఎండలో మెరుస్తున్నాయి.రాత్రి రాల్చిన రంగుపూలన్నీ కొంగుపరుచుకున్నట్టు అలాగే ఉండిపోయాయి.లోపల చల్లగా, చల్లదనంతో కలిసిన చిన్న పరిమళంతో సహా హాయిగా ఉంది.బయట ఎంత వెలుతురుందో లోపలా అంతే.గోడలకి, సీలింగుకీ అతుక్కున్న దీపాలు తెల్లగా మెరుస్తున్నాయి.బుగ్గల్లాంటి నున్నటి నీలపు ఒట్టి నేల మీద భోజనం చేసినా ఫరవాలేదు.చారి వారానికి రెండు మూడుసార్లు కిటికీ పక్కన కూచుని ఇదే దృశ్యాన్ని చూస్తూంటాడు.పధ్నాలుగో అంతస్తులో అతని ఉన్నతీ, చుట్టూరా పరుచుకున్న ఖరీదైన చక్కదనం, లోపల చల్లటి భద్రత చారికి సంతృప్తికరంగా వుంటుంది.ఆర్వీ చారి ఈ ఏడాది రెండోసారి కాలిఫోర్నియా వెళ్లాచ్చి పది రోజులు కూడా కాలేదు.విమానం దిగి ఇంటికి కూడా వెళ్లలేదతను.లోపలికి రాగానే జీఎం గారు పిలిపించి అతని భుజం పిండి, కంపెనీ ఆనందాన్ని అతనితో పంచుకున్నాడు.చారి వెంట ఆయన గదిలోకి ఒక డాలర్ ప్రవాహం రావడం చూశాడాయన.ఇద్దరి మొఖాలూ ఇంకా ఎవరూ ముట్టుకోని కొత్త వందడాలర్ల నోటులా మెరిసిపోయాయి.గంట తరవాత కంపెనీ కార్లో ఇంటికి చేరేడతను.లోపలికెళ్లి కూచోగానే జ్యోతి ఫోన్ చేసింది.ఫ్రిజ్లో అన్నీ ఉన్నాయి.సాయంకాలం వరకూ రాలేనంది."ఓకే. లవ్". అన్నాడు చారి.సాయంకాలం ఆరు దాటింతరవాత జ్యోతి కాలింగ్ బెల్ నొక్కే వరకూ నిద్రపోయాడు చారి.నీలపు డబ్బాలోంచి చల్లటి బీరు గుటక వేస్తూ ప్రాజెక్టు గురించి చెప్పేడతను.సంతోషం వెచ్చటి వెలుతురు వలయంలా వాళ్లిద్దరి చుట్టూ పరుచుకుంది.*************ఫోన్ మోగింది. సున్నితంగా స్పష్టమైన గలగల.ఫోను మాట్లాడి కూచోగానే ఆలీ లోపలి కొచ్చేడు.“ఏరా?"జేబులో చెయి పట్టి కరెంటు బిల్లు రసీదూ, మిగిలిన రెండు వందల ఎనభై రూపాయలూ టేబిలు మీద పెట్టేడు ఆలీ.రసీదు చూశాడు చారి.“ఓ. కరెంటు బిల్లా? థేంక్స్. ఇదో.” ఏభై రూపాయల నోటు తీసి ఇచ్చేడతను.“ఈ సేవలో కట్నా సార్.”“ఓకే. థేంక్స్."ఆలీ సందేహిస్తూ నిలబడి పోయాడు.ఫైల్లోంచి అతని వేపు చూసి అన్నాడు చారి“ఏమనుకోకండి సార్. బిల్లు చూసిన్రాసార్ మీరు?”"ఆ. చూడకుండా పైసలెలా ఇస్తాను?”“అవుసార్. గిట్లనే బిల్లు నాలుగు దఫాలు ఇచ్చినారు సార్. మీరు చూస్తలేరు సార్. ఆడిస్తనే ఉన్నాడు. మీరు జమజేస్తనే ఉన్నారు సార్. చానా ఎక్కువ సార్." |కొన్ని క్షణాల వరకూ ఆలీ ఏవంటున్నాడో అర్థం కాలేదు చారికి.చివరికి లోపలికి దిగిం తరవాత అన్నాడు. “అదా? ఇంట్లో ఉండం గదా. అంతకు ముందు నెలదే వేస్తున్నాడేమో.""అట్లయిత లేదుసార్. చానా ఎక్కువ బిల్లు సార్. మీరు అడగండ్రి సారూ, ఎన్ని పైసలిస్తరు సార్."అప్పుడతని వేపు చూశాడు చారి.ఆలీ పెదాలు వంపు తిరిగున్నాయి.అతని కళ్లలో నల్లటి నింద అతనికి తెలీకుండానే కళ్ల నిండా పరుచుకుని ఉంది. అతని కళ్లలోకి చూడ్డం ఇబ్బందిగా ఉంది.ఆలీ చూపులు వీపు మీద సూదుల్లా గుచ్చుకున్నాయి.చారి మనసులో ఉక్కపోసినట్టుయింది.ఫైలు చూస్తూ "ఓకే" అన్నాడతను.ఆలీ వెళ్లబోతూ చిన్న నవ్వుతో అన్నాడు. “అయన్ని నాకు మూడు నెల్ల జీతం లెక్క సౌర్."తల అడ్డంగా ఊపుతూ ఆలీ వెళ్లిపోయాడు.సూది బాగా లోపలికి దిగిపోయింది. చిల్లర నోట్లు పర్సులో పెట్టుకుంటూ బిల్లుల వేపు చూసాడతను.దానికీ, మీటరుకీ, డబ్బుకీ సంబంధం అతనెప్పుడూ ఆలోచించలేదు.ఎంతయిందో చూసి ఆలీకి డబ్బులిచ్చి మర్చిపోవడం చారికి అలవాటుగా వస్తోంది. ఇప్పుడు బిల్లు చూస్తుంటే అతనికి ఆశ్చర్యంగానే ఉంది. కాసేపు దానివేపే చూస్తూండిపోయాడు.మనసులో ఉక్క ఎక్కువగానే ఉంది. మళ్లీ ఫోను మోగింది. ఈసారి ఫోను చెవిలో గలగల మన్నట్టుంది.సాయంకాలం వరకూ చారికి జారిపడ్డానిక్కూడా తీరిక దొరకలేదు.సాయంత్రం తన లేత అరిటాకు పచ్చ కారెక్కుతూండగా పక్కనుంచి వెళ్తూ అలీ సలాం కొట్టేడు.ఇంటి కెళ్తూ, కారాపినప్పుడల్లా జేబులో చెయ్యి పెట్టి బిల్లు తడుముకున్నాడు చారి.కడుపులో ఏవీ బాగా లేనట్టనిపించింది."టీ ఇవ్వనా?" అంది జ్యోతి.తల ఊపేడతను.పేంటులోంచి చొక్కా బయటికి లాగి, విప్పి పక్కన పడేశాడు.టీ తెచ్చి ఇచ్చిందామె.ఓ గుక్క మింగి కప్పు టీపాయ్ గ్లాసు మీద పెట్టి చొక్కా జేబులోంచి బిల్లు తీసి ఆమెకిచ్చేడతను."ఏంటిది? ఓ. కరెంటు బిల్లు. కట్టేడా ఆలీ?”“కట్టేడు. జ్యోతి బిల్లు చూశావా?"“బిల్లే వుంది సార్ చూడ్డానికి?"బిల్లు తన చేతిలోకి తీసుకుని చూస్తూ అన్నాడు చారి.“మనిద్దరం చూడ్డం లేదు. మూడు నాలుగు నెలల్నించి చాలా ఎక్కవ బిల్లు పడుతోంది. మనకి అందులో సగం కూడా అవదు."అతని కనుబొమ్మల మధ్య చిరాకు మడతపడ్డం చూసిందామె. అతని వేపే చూస్తూ ఏవీ అనలేదామె."వాడు గమనించి చెప్పేడు. ఇటీజ్ ఎ లాటాఫ్ మనీ, నేనూ చూడలేదు.”"అవును.అంటే, మామూలుగా చూడంకదండీ.ఏ బిల్లు వచ్చినా మనీ ఎంతో చూసి మీరో నేనే ఇస్తాంగదా. బహుశా ఎక్కడో పొరపాటు జరిగి ఉంటుంది. పోనీ ఓసారి కంప్లయింటు చేసి చూడండి.”తల ఊపేడతను. కానీ లోపలి ఉక్క , ఫేను గాలికి శాంతించడం లేదు.“ఒకే. పాత బిల్సున్నాయేమో చూడోసారి." అతనివేపోసారి చూసి లేచి వెళ్లిందామె. టేబిలు సొరుగులో ఏవీ లేవు. కానీ సీడీల పెట్టె కింద నాలుగు విడి వందరూపాయలు దొరికేయి."లేవు. డబ్బులు దొరికేయి." అందామె. ఆలీ సూది పొడుగు పెరిగింది మరీ లోపలికి."బిల్సు లేవా? మనం ఉంచడం లేదా?" చారి ముఖం కొద్దిగా ఎర్రబారడం గమనించిందామె."ఎక్కడో పెట్టినా పట్టించుకోంగదా. పేమెంటు అవగానే పడేస్తూంటాం. పైగా వాటి అవసరం ఎప్పుడూ రాలేదు. ఒక్క టాక్సు కాయితాల్నే పైల్ చేస్తాను.ఏంటి అలా ఉన్నారు? ఏవైంది?"టీ తాగి కప్పు టేబిలు మీద పెట్టేసి దరిదాపు మామూలుగా అన్నాడు చారి. "ఏం లేదు. తెలుసుకోవాలనిపించింది. అంతే.""వెళ్లి స్నానం చేసి రండి. బాగా అలసిపోయినట్టున్నారు. డోంట్ వర్రీ..."చారి స్నానం చేసి వచ్చి ఉదయం వదిలేసిన పేపరు వార్తలు చూస్తున్నాడు. పేపర్నిండా దుర్భిక్షం పరుచుకుని ఉంది. నీటి మేఘాలన్నీ చుట్టచుట్టుకుని హిమాలయ సానువులకి వెళ్లిపోయాయి. ఆకాశం భగ్గున మండుతోంది. వేసవి డేగ మళ్లీ రెక్కలు పరుచుకుంటోంది.రెండోది ఆర్థికమాంద్యం. మెన్నటి ఉల్లి దోశలాగ.ఆర్థికమంత్రి చక్కటి చిరునవ్వు కలిపిన ఇంగ్లీషులో సొరంగం చివర సూర్యుడు కూచున్నాడనీ, భయం లేదని చెప్తున్నాడు.కథకి అవసరం అనుకుంటే తప్పకుండా బికినీ వేసుకుంటానంటోంది. పెద్ద తార. పేపర పక్కన పడేసి టీ.వీ. తెరిచాడు చారి.పంజాబీ డ్రెస్ వేసుకుని పక్కనే వచ్చి కూచుంది జ్యోతి. డ్రెస్ వేపు చూస్తూ ఏవి టన్నట్టు చూశాడతను.“చెప్తాగా" అంది జ్యోతి.న్యూస్ రీడర్ ఎర్రటి చక్కటి పెదాలు రాష్ట్రంలో దుర్భిక్ష ప్రాంతాల్ని చుక్క వర్షం పడని తెలంగాణా ప్రాంతాల్నీ చప్పరిస్తున్నాయి. తెరమీద పొలాలు విచ్చిపోయాయి.లావుపాటి ఎమ్మెల్యే మరో అయిదు మండలాల్ని కరవు పీడిత ప్రాంతాలుగా గుర్తించాలంటున్నాడు.హైద్రాబాద్లో రిలయన్స్ మాల్. వెలుగు దీవి.చేతుల్లో ప్లాస్టిక్ సంచులతో, పక్కనే పిల్లలతో మెరుస్తూ బయటికి వస్తున్నారు. లోపల చక్రాల బళ్లలో చిన్న పిల్లల్ని సరుకుల్నీ హాల్లో వరసల మధ్య తిప్పుతున్నారు.పెద్ద పెద్ద ఏనుగులు, ఎలుగులూ, జీరాఫీలూ వాటి కళేబరాల్లా ప్లాస్టిక్ సంచుల్లో నిలబడి చూస్తున్నాయి.కూరల దగ్గిర హడావుడిగా ఉంది. తెలుపు నీలం ప్లాస్టిక్ కవర్లలో అల్లాగే ఉన్న అమ్మాయి నాలుగు చేతులతో కూరగాయలందిస్తోంది.చటుక్కున కెమేరా ఎక్కడో కూరలబళ్ల దగ్గరికి వెళ్లింది.ప్లాస్టికబుట్టల్లో కూరగాయల్ని చుట్టుముట్టి ఉన్నారు. మహిళలు. బళ్లకింద కేబేజీ చర్మాలు, వంకాయలు, చితికిన టమాటోలు పడి ఉన్నాయి. బెండకాయలు చివరిభాగం విరస్తుంటే ఒప్పుకోడం లేదు. కూరలవాడు.చేతిలో కూరల సంచీతో ఒకామె కెమేరాలోకి వచ్చింది.వరసకీ ఆమె కూరగాయల ధరలు ఏకరువు పెట్టింది.ధరలు ఇలాగే ఉంటే సామాన్యలందరూ గడ్డి కొనుక్కొని వండుకోక తప్పదంటోంది. రెండో పూట తినే అవకాశం లేదనీ పిల్లలకి పెట్టి మంచినీళ్లు తాగి పడుకునే రోజు వస్తుందని చెప్పి వెళ్లిపోయిందామె. రెండుచేతులతో , వీలయితే నాలుగు చేతుల్తో లంచాలు తింటే తప్ప బతకలేని పరిస్థితి ఏర్పాటు చేస్తున్నారన్నాడు ఒక ఉద్యోగి.సూది తీవ్రంగా పనిచేస్తోంది.**************నాన్న కడుపు అలారంలా పనిచేసేది. ఓ కంట్లో భూతద్దం పెట్టుకుని బంగారప్పని చేస్తున్నా పదకొండు అయేసరికి ఓ గావుకేక పెట్టేవాడు సుబ్బాచారి.అన్నం కూరా అన్నీ వేడిగా ఉంటేనే తినేవాడతను.మొత్తానికి వారానికి మూడు రోజులైనా పెరట్లో కూరలూ ఆకు కూరలు తెంపి వండేది అమ్మ.సుబ్బాచారికి రాబడి కంటే ఎన్నో రెట్లు ఎక్కువ మంచి పేరుండేది. ("పోయి చదూకో ఎధవా. దీని జోలికి రామాక.")కంచుగ్లాసు నిండా అపుపడప్పుడు సగ్గు బియ్యపు పరమాన్నం పెట్టేది అమ్మ,చారి నోరు తియ్యబడింది. తను ఇంజనీరవడం చూళ్లేదామె. ఓసారి శలవలకి ఒచ్చినప్పుడు అమ్మకేవీ బాగాలేదని చెప్పేడు నాన్న.ఓరాత్రి తన పాయసం తాగే గ్లాసు లోంచి ఏదో గుటక వేస్తూ చటుక్కున అన్నాడాయన.“బాగా బలంగా ఉండే ఆహారం రెండుపూట్లా పెడితే లేచి బాగా తిరుగుద్దంట."అమె లేచి తిరగలేదు.*************"మీరు న్యూస్ చూస్తున్నారా?" అంది జ్యోతి.ఉలిక్కిపడ్డా డతను."ఏం చేశావీపూట?""అదే చెప్తానన్నాను. ఏం చెయ్యలే. బయటికి పోదాం. ఆకలిగా ఉందా?""లేదు. కాసేపాగి వెళ్లాం. ఎక్కడికిట?”“ఊ. చైనీస్".'రైట్. ఎటొచ్చీ దూరం.”"నే డ్రైవ్ చేస్తాలే.""న్యూస్ చూశారా?"ఇబ్బందిగా నవ్వేడు చారి. కూరలధరలు అమ్మని గుర్తు చేశాయి. ఆవిడెవరో అన్నట్టు అమ్మ గడ్డి కూర చేసినా అమృతంలా ఉంటుంది.“పదండి.""ఏం?""మీరేదో ఆలోచిస్తున్నారు. డ్రైవింగులో మర్చిపోతారు. చల్."బట్టలు మార్చుకుని పర్సు జేబులో పడేసుకుని ఇద్దరూ బయటపడ్డారు.కార్ల,ఆటోల ఎదురు ప్రవాహాన్ని చీల్చుకుంటూ చైనీస్ రెస్టారెంట్ చేరడానికి నలభై అయిదు నిముషాలు పట్టింది.లోపల చల్లగా ఉన్నా ఇద్దరూ చల్లబడ్డానికి పది నిముషాలు పట్టింది.తన కిష్టమైనవి వెంటనే ఆర్డర్ చేసింది జ్యోతి. చారి మెన్యూ కార్డు తెరిచాడు. సూపు దగిర్నించీ అనుకోకుండా ఎదురుగుండా ఎర్రటి అంకెల్లో మెరుస్తున్న ధరలు చూస్తున్నాడతను. ఎప్పుడూ ధరలు చూడ్డం అలవాటు లేదతనికి."ఏదో ఒకటి చెప్పండి."ముందు సూప్ చెప్పి మళ్లీ ఆలీలా ధరల పట్టా వేపు కళ్లు పెద్దవి చేసి

Episode metadata supplied by the publisher feed · Published Dec 20, 2020

Embed this episode

NOW PLAYING

'ఆర్వీ చారి కరెంటు బిల్లు ' ! - పతంజలి శాస్త్రి గారి కథ

0:00 31:51

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Harshaneeyam?

This episode is 31 minutes long.

When was this Harshaneeyam episode published?

This episode was published on December 20, 2020.

Can I download this Harshaneeyam episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!