ఆశ - ఆశంక : డాక్టర్ సౌవేంద్ర హన్సడా రచన ( ఆంగ్ల మూలం) episode artwork

EPISODE · Sep 1, 2023 · 29 MIN

ఆశ - ఆశంక : డాక్టర్ సౌవేంద్ర హన్సడా రచన ( ఆంగ్ల మూలం)

from Harshaneeyam

’ఆశ – ఆశంక’ అనే ఈ కథ డాక్టర్ సౌవేంద్ర శేఖర్ హన్సడా గారు రాసిన ఆంగ్ల కథా సంపుటం ‘The Adivasi will not dance’ నించి స్వీకరించబడిన ‘Desire, Devination, Death’ అనే కథకు తెలుగు అనువాదం . ( కథ ఆంగ్ల మూలం – https://ur.booksc.eu/dl/28680189/d870eb)ఈ పుస్తకం ‘ Speaking Tiger Publications’ ద్వారా ప్రచురింపబడింది. 2015 సంవత్సరానికి ఈయన కేంద్ర సాహిత్య అకాడెమి యువ పురస్కారం గెలుచుకున్నారు. వృత్తిరీత్యా ప్రభుత్వ వైద్యులు. ఈ కథను శ్రావ్యంగా, భావ స్ఫోరకంగా హర్షణీయం కు చదివించిన స్వాతి గారికి కృతఙ్ఞతలు. https://bit.ly/Swatipantulaస్వాతి గారి యుట్యూబ్ ఛానెల్ లో మరెన్నో తెలుగు కథలు మీరు వినవచ్చు. ఆశ – ఆశంక :వడి వడిగా నడుస్తోంది సుభాషిణి. ఆ మట్టి  రోడ్డు మీద నడుస్తున్న వాళ్లందరినీ గబా గబా దాటుకొని వెళ్తోంది. సాయంకాలం నీరెండలో,  ధూళి ఆమె పాదాల నుంచి ఓ చిన్న తెరలా పైకి లేవటం కనపడుతోంది. ఆమె మొహంలోకి  పరికించి చూస్తే తన పెదాలు బిగబట్టి మనసులోని అల్లకల్లోల్లాన్ని తొక్కిపెడుతోందా అనిపిస్తోంది.  ‘ఛకూలియా’ శనివారం సంత రద్దీ నించీ ఎలాగోలా తప్పించుకుని బయటపడింది తాను.  ఇంటికి చేరుకోడానికి ఇంకా ఐదు కిలోమీటర్ల పైన నడవాలి. ‘రోషపల్’ లో ఉంటుంది సుభాషిణి.మామూలు రోజుల్లో అయితే, సుభాషిణి ఛకూలియాలో ఆగి, కమరిగూడ తోటల్లో అపుడే  కోసిన  ఆలుగడ్డలు,  ఎర్రటి టమాటోలతో పాటూ ఒక మంచి ఆకు కూర కొంటుంది. అక్కణ్ణించీ నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లి  బెస్త ముసిలిదాని గుడిసె ముందుకెళ్లి నిలబడి,  ఖరీదైన ‘రూయి’ , ‘కాట్లా’ చేపలు  తాజాగా లేవు అని నసుగుతూ, కొనేసేటట్టు బాగా బేరం చేసి చేసి ,  చవగ్గా దొరికే  ‘బాష్ పాటాలు’  మాత్రం కొనుక్కుని  వాటితో ఎండబెట్టి,  కమ్మటి పులుసు చేసుకుందాం  అని ఊహించుకుంటూ,  చివరికి   ‘మా మోనోసా’  స్వీట్ల షాపు  దగ్గర ఆగి, తన పద్నాలుగేళ్ల పరూల్ కీ, పదకొండేళ్ల నిలుమోనీకీ , ఏడేళ్ల చంటోడు కూనా రామ్ కీ,  ఓ అర డజను జోబె లడ్డూలు, సమోసాలు కొనుక్కుని,  అపుడు  కానీ ఇంటివైపు నడక మొదలు పెట్టదు. నాలుగు జిలేబీలు మాత్రం, కాయితపు పొట్లంలో  దాచుకుని, ఆ పొట్లాన్ని  గుండెలకదుముకొని నడుస్తోంది సుభాషిణి.  ఒళ్ళు, కళ్ళు రోడ్డు మీదున్నట్టున్నా, తన ఆలోచనలు  ఇంకెక్కడో తిరుగుతున్నాయి. తొందరగా పని ముగించుకు బయటపడదాం! అనుకున్నా కుదరలేదీరోజు. అందరినీ పలకరిస్తూ నిదానంగా   నడిచే అలవాటున్న సుభాషిణి, పొద్దు పొడిచే ముందే ఇల్లు చేరడం అనేది చాలా అరుదు. మామూలు రోజుల్లో అయితే, సాయంకాలం పూట, సుభాషిణి  తాను పనిచేసే  రైస్ మిల్లు , ఇంకా అల్యూమినియం ఫ్యాక్టరీ , సోపు ఫ్యాక్టరీ , బద్రీనాథ్ సేటు తోట , దేవ్ బాబు కోళ్ల ఫారం, ఇంకా చుట్టుపక్కల   కంస్ట్రక్షన్ సైట్లలో పని చేసే  స్నేహితురాళ్ళ తో పాటూ కబుర్లు చెప్తూ ఊరి వైపు నడుస్తుంది. నేతచీరలు కట్టుకొని కొంతమంది, సిలుకు చీరలు కట్టుకొని ఇంకొంతమంది, పెద్దా చిన్నా ఆడవాళ్ళందరూ కలిసి, సీవెండి కారియర్లు మోసుకొని,  తలగుడ్డలు  నడుముకు చుట్టుకొనో, భుజానికి తగిలించుకునో, నవ్వుతూ, తుళ్ళుతూ, కేరింతలతో ఇంటికి నడిచే సమయం అది. ప్రైవేటు జీపుల, ఝార్ఖండ్ గవర్నమెంటు బస్సుల హారన్లతో, వాటిలో వుండే  క్లీనర్లు తప్పుకోమంటూ  పెట్టే కేకలతో మారుమోగుతూ ఉంటుంది ఆ రోడ్డు. అలిసిపోతేనో ఆలస్యమైపోతేనో తప్ప, మామూలుగా నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళల్లో   వీటిని ఆపి ఎక్కేవాళ్ళెవరూ ఉండరు,. ఎక్కారంటే మటుకు, ఇవ్వాల్సిన డబ్బుల  గురించి సగానికి సగం బేరాలు మొదలు పెడతారు. ప్రతి పైసా మీదా హోరా హోరీ పోరాటంతో పాటూ శాపనార్థాలూ తిట్లూ అదనం. వాటినన్నిటినీ విని  ఆనందిస్తూ ఇంకా ఇంకా ఉసికొల్పుతూ వుంటారు డ్రైవర్లు క్లీనర్లూ.  లోపలున్న, చిన్నా పెద్దా అందరికీ  ఇదో మంచి కాలక్షేపం.   తన బొడ్డు సంచీలో వుండే చిల్లరను సాధ్యమైనంతవరకు కాపాడుకుంటూ,  బండెక్కి ప్రయాణించే సౌకర్యాన్ని  కూడా  వినియోగించుకుంటూ, ఇలాంటి  ఎన్నో పోరాటాల్లో పాల్గొన్న సుభాషిణికి,  నిజానికి  నడకంటేనే ఇష్టం. నడుస్తూ అయితే  డుమినీతో కాస్సేపు  మాట్లాడుకోవచ్చు. డుమిని సుభాషిణికి మంచి స్నేహితురాలు. పక్కూరు  బలిపూర్లోనే ఉంటుంది.  ఒకే చోట పనిచేస్తున్నా, ఇంటికి నడిచేటప్పుడే వాళ్ళిద్దరికీ మాట్లాడానికి సమయం దొరికేది. ముదురు ఎరుపులోకి మారుతున్న ఆకాశాన్ని  ప్రతిఫలిస్తోందా అన్నట్టు మట్టి రోడ్డు  లేత నారింజ రంగులో మెరుస్తోంది. పని ముగించుకుని ఇంటికి వెళ్లే ఆడవాళ్ల కబుర్లతో, గూళ్ళల్లో ఆశగా ఎదురుచూస్తున్న పిల్లల కోసం, ఆహారం  నోట  పెట్టుకుని వేగంగా  ఎగురుతూ వెళ్లే పక్షుల శబ్దాలతో కోలాహలంగా వుంది వాతావరణం. సుభాషిణి నడకలో వేగం బాగా హెచ్చింది.  ఒంటరిగా నడుస్తోంది.  “ముందర నువ్వు బయలుదేరు” అని తొందర పెట్టారు  తన తోటి వాళ్ళు.   డుమిని కూడా,  “నడవొద్దు. వేరే ఏవీ ఆలోచించకుండాఅద్దె జీపులో ఇంటికెళ్ల”మని చెప్పింది.  పక్కన ఆగున్న జీపులో ఎలాగోలా  ఎక్కుదామని ప్రయత్నించింది సుభాషిణి. జీపు అంతా  ఇంటికెళ్ళే జనాలతో నిండిపోయుంది. కాలు మోపడానికి కూడా స్థలం లేదు. పగటి వేషగాళ్ళ మాదిరి వింత వింత  డ్రెస్సులేసుకుని, విచిత్రంగా జుట్టు కత్తిరించుకుని,  మీద సామాన్లు కట్టేసే  చోట కూర్చుని,  ఇద్దరు కుర్రవాళ్ళు కిళ్ళీ నములుతూ, జీపులో స్థలం కోసం ఆదుర్దాగా తొంగి చూసే వాళ్ళ పైన వుమ్మేస్తున్నారు. బాధితులు ఎవరైనా పైకి కోపంగా చూస్తే, వెకిలిగా పళ్ళు చూపిస్తూ నవ్వుతున్నారు.  ఒక చివరన డ్రైవరు సాహసోపేతంగా  సగం శరీరం జీపులో కూర్చోబెట్టి, మిగతా సగం  గాల్లో  వేలాడేసుకునుంటే, అతడి తోటే  ఇంకో   ముగ్గురు కూచుని వున్నారు  ముందు సీట్లో. ఈ చివరన ఫుట్ బోర్డు మీద కాలు పెట్టి ఒకడు, మధ్య వున్న సందులో తన శరీరాన్ని ఎలాగోలా ఇరికించుకుని ఇంకోవాడు కనపడుతున్నారు.   డ్రైవరు పక్కనుండే మూడో వాడి కాళ్ళ మధ్యలో గేర్ వుంది.   డ్రైవరు గేర్ మార్చినప్పుడల్లా అతని పిడికిలి తనకు తగల రాని చోట తగిలే ప్రమాదం ఉందని  వాడికి తెలీకుండా ఉండదు.  ‘ఈ  బండి ఎలా నడుస్తుందో ఆ భగవంతుడికే తెలియాలి. ఏ ప్రమాదం జరగకుండా ఆయనే కాపాడాలి వీళ్లందరినీ ఈ రోజు.’ ఆ జీపులో కూరుకు పొయ్యి  దేవుణ్ణి తల్చుకునే కంటే , నడకే మేలనిపించింది సుభాషిణికి. సుభాషిణితో అన్నాడు క్లీనర్ జీపు  పైభాగాన్ని చూపిస్తూ, కన్ను గీటుతూ   “ఉపోర్ చాప్ గో మాసి”. సుభాషిణి ఒళ్ళు భగ్గున మండింది . “తూయి చాప్ , అమీ నై చాపి” అని వాణ్ణి గట్టిగా కసురుకుని, తన టిఫిన్ కారియర్ చేతికున్న గుడ్డ సంచీలో పడేసి, , జిలేబీల పొట్లం,  బంగారం దాచుకున్నట్టు,  గుండెల కదుముకుని, తల ఎగరేసి తీక్షణంగా ముందున్న రోడ్డు వైపు  చూస్తూ మళ్ళీ నడక మొదలు పెట్టింది. సుభాషిణి వాలకం చూస్తే ఏదో యుద్ధానికి  సన్నద్ధమై పోతున్నట్లుంది. భారంగా నడుస్తున్న ఎద్దు బండ్లను, రోడ్డుకు అడ్డదిడ్డంగా వచ్చే రిక్షా వాళ్ళను, సైకిల్ నడిపే వాళ్ళను తప్పించుకుంటూ అలానే  చాలా దూరం నడిచింది. ఇందాకటి జీపు హారన్ గట్టిగా మోగించుకుంటూ వెనకనించి వస్తోంది . ‘సోర్ గో మాసి’ అని విసురుగా  అరిచాడు,  పక్కకు జరగమన్నట్టు  చేతులూపుతూ క్లీనర్ గాడు . చీరకొంగును మొహంమీద వేస్కుని, ఒక్క ఉదుటున  రోడ్డు పక్కనే వున్న గడ్డి పొదలోకి గెంతింది సుభాషిణి. నల్లటి పొగతో  కల్సిన ఎర్రటి దుమ్ములో ఆమెను ముంచేస్తూ  ముందుకెళ్లింది  జీపు. “ కీ మాసీ, మోర్తే ఖుట్చూ” అని అరిచాడు  వెడుతున్న జీపులోంచి  క్లీనర్. “మోర్బెక్! తేరే మా”  అంటూ అరిచింది సుభాషిణి, “ గాడియే ఛాపి ఫూటానీ కోర్చూ, జొమీనే చాల్ దేఖీ”సుభాషిణి కేకల్ని  తన శబ్దంలో కలిపేసుకుని ముందుకెళ్ళిపోయింది,  కిక్కిరిసున్న  జీపు. మండుతున్న కళ్ళు నులుముకుంటూ, లోపల్నించీ పొంగి వస్తున్న దుఃఖాన్ని అణుచుకుంటూ, అలానే నిలబడిపోయింది ఓ రెండు క్షణాలు సుభాషిణి.  దుమ్ములో స్నానం చేసినట్టుంది ఆమెకి. ఆమె మనసులో ఇంకో మూల ఓ చిన్న బాధ మొదలైంది.  తనకు ఏ మాత్రం తెలీని ఓ ఆడమనిషిని తిట్టేసింది. కాదు కాదు . అంతా ఆ క్లీనర్ గాడి వల్లే, ఎందుకు కనిందో ఇలాంటి వాణ్ణి వాడి తల్లి.   తన తల్లి  వయసున్న ఆడవాళ్లను అనగూడని మాటలు అంటాడా? ఎందుకూ పనికి రాని అడ్డగాడిద! వాళ్ళమ్మ కొంచెం మర్యాద నేర్పించుంటే, బావుండేది ఎదవకి. నా చంటాడు కూనారామ్ చేస్తాడా ఇలాంటి పని?  లేదు లేదు . ఎప్పటికీ చెయ్యడు. కొడుకును సరిగ్గా పెంచనందుకు , వాళ్ళమ్మను తిట్టడంలో తప్పే  లేదు.  అది సరే .. అయినా  వాళ్ళ అమ్మ ఏమి చేసింది పాపం? . కేకలు పెడ్తూ తనని  ఎగతాళి చేసింది ఆ క్లీనర్ గాడు కదా… సుభాషిణి మనసు పరిపరి విధాల పోతోంది. భగవంతుడా! నా చేత ఎలాంటి ఎలాంటి  పనులు చేయిస్తున్నావు? వాడు   ఆలా ఎందుకు  మాట్లాడాలి,  నేను నోరు పారేసుకునేట్టు ?అయినా ఇలాటివన్నీ  ఈ రోజే  ఎందుకు జరుగుతున్నాయి? నాకు సీటు దొరక్కపోవడం , వాడి చేత మాటలు పడ్డం? నేను ఇంకో బండి చూసుకొని వుండొచ్చుగా?  ఏం జరుగుతోంది నాకు? అప్పటిదాకా అతికష్టం మీద  ఆపుకున్న శోకం పైకి తన్నుకొస్తోంది  సుభాషిణికి.  కళ్ళు, నీళ్లతో మసకబారాయి. రెండు చుక్కలు మాత్రం  ఎలాగోలా కళ్ళని దాటుకుని, ముదురు గోధుమ రంగు  బుగ్గల మీదున్న ఆ  నల్లటి మచ్చలమీద  జారుతూ చారికల్లా మారాయి.  నల్లటి మచ్చలు! క్షణ క్షణం ఒత్తిడితో అలుపెరగకుండా పని చేస్తూ, ఇంటి భారం ఒంటరిగా ఇన్నాళ్లు  మోస్తూ వచ్చినందుకు,  కాలం ఇచ్చిన బహుమతి. నాకే ఎందుకు జరగాలిలా? నాకే ఎందుకు? ఇది కూడా ఓ పరీక్షా? ఎన్ని పరీక్షలు పెట్టావు? ఇంకా నా మీద దయ కలగలేదా నీకు? ఇంకెన్ని చూడాలి  నేను?  ఎంతమందిని నానుంచి తీసుకెళ్లి పోతావు?                                                                            —–“మా నాన్న పేరు పెడదాం  వీడికి ‘కూనారామ్’ అని!”,  అన్నాడు  భర్త  సూనారామ్. వంచిన తల కూడా  పైకెత్తకుండా ‘ఊ’ కొట్టింది !  .  వినపడిందో లేదో అతనికి. ముందు పుట్టిన ఇద్దరు ఆడపిల్లల్నీ నెత్తిన పెట్టుకున్నాడు. మూడోసారి కొడుకే కావాలంటాడు. తనకు కూడా కొడుకే కావాలి అని అతనికి ఎలాచెప్పాలి? నిండుగర్భం వైపు తదేకంగా  సూనారామ్  చూస్తూంటే , అతన్నే చూస్తూ వుండాలనిపించేది మాటనేదే లేకుండా.  “ఈసారి మటుకు  కొడుకునే కంటున్నావు....

Episode metadata supplied by the publisher feed · Published Sep 1, 2023

Embed this episode

Ready to play

ఆశ - ఆశంక : డాక్టర్ సౌవేంద్ర హన్సడా రచన ( ఆంగ్ల మూలం)

0:00 29:23

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Harshaneeyam?

This episode is 29 minutes long.

When was this Harshaneeyam episode published?

This episode was published on September 1, 2023.

Can I download this Harshaneeyam episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!