ఆశపాశం | Asapasam | Telugu Short Story | Allu Sairam | manatelugukathalu.com episode artwork

EPISODE · Feb 26, 2023 · 13 MIN

ఆశపాశం | Asapasam | Telugu Short Story | Allu Sairam | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఆశపాశం రచన: అల్లు సాయిరాం (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఆంధ్ర - ఒరిస్సా సరిహద్దు ప్రాంతం. ఆకాశమంతా నిండుగా ప్రకాశిస్తూ, బహుశా డ్యూటీ దిగిపోయే గాభరాలో చకచకా  మబ్బుల చాటున పరుగెత్తుతున్న మూడోజామురాత్రి చంద్రుడ్ని, ఎంత తొందరగా తెల్లవారుతుందా అని  నిద్రపట్టక మంచం మీద పడుకుని చూస్తున్నాడు చంద్రయ్య. దీపం వెలుగులో గడియారం చూస్తే, టైం రెండున్నరయింది.  యింకా రెండున్నరేనా! టైం నాలుగున్నర అయితే కానీ కూరగాయలు బజారుకి తీసుకెళ్ళడానికి ఆ ఆటో రాజు ఆటో తీసుకునిరాడు అని నిట్టూరుస్తూ, తన మంచం ప్రక్కన రెండు బుట్టల్లో  మూటగట్టిన కూరగాయలు, పండ్లు చూస్తూ, యిరోజు సంతబజారులో కూరగాయలన్ని ఎలాగైనా తొందరగా అమ్మేయాలి అని ఆలోచించుకుంటూ పడుకున్నాడు. యిలా చిన్న కునుకు తీయడం, టైం అయిపోయిందని ఉలిక్కిపడి నిద్రలేవడం, టైం అవ్వలేదని నిట్టూర్చడం, బుట్టల్లో మూటగట్టిన కూరగాయలు, పండ్లు చూసుకోవడం, మళ్లీ పడుకోవడం, రాత్రంతా యిదే వరుస. ముందురోజు సాయంత్రం పొలంలోకి వెళ్లి, పండించిన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, యిలా ఎదుంటే అది బుట్టల్లో మూటగట్టి, దగ్గరున్న పట్టణం సంతబజారులో అమ్ముకుంటే, నాలుగు డబ్బులు వస్తాయి కదా అని  ఆశపడే రకం చంద్రయ్య. ఎప్పటిలా యింట్లో ఒక్కడే ఉంటే, టైం తో సంబంధం లేకుండా నిద్రలేచి, బుట్టలతో కూరగాయలు పట్టుకుని బస్టాండుకి వెళ్లి, ఆటో రాజు రాకపోతే, అవసరమైతే చీకటిలో సంతబజారుకి నడిచి వెళ్ళిపోతాడు. కానీ, తనకున్న ఒక్కగానొక్క మనవరాలైన గిరిజ పట్టణం నుంచి ముందురోజు  రాత్రి వచ్చింది. యిలా నిద్రల్లేకుండా ఆరోగ్యం పాడుచేసుకుంటాడని ఎప్పుడూ గిరిజ చంద్రయ్య మీద కోప్పడుతుంది. దురదృష్టవశాత్తు గిరిజ తన తల్లిదండ్రులని చిన్న వయసులోనే కోల్పోయింది. అప్పటినుంచి ప్రాణంగా చూసుకుంటూ, తన శక్తి మేరకు గిరిజని డిగ్రీ వరకు చదివించాడు చంద్రయ్య. పట్టణంలో ప్రైవేటు కంపేనీలో చిన్న ఉద్యోగావకాశం వస్తే, చంద్రయ్యని ఒంటరిగా వదిలి వెళ్లడానికి ఏమాత్రం యిష్టంలేని గిరిజ వద్దనుకుంది. నేను యింకెంత కాలం ఉంటానమ్మా! నాలుగు డబ్బులు వస్తే, నీ భవిష్యత్తు బాగుంటుంది తల్లీ! అయినా నేను రోజూ కూరగాయలు తీసుకుని పట్టణం సంతబజారుకి వస్తాను కదా, అక్కడినుంచి నిన్ను చూడడానికి వస్తాను అని గిరిజకి సర్దిచెప్పి ఉద్యోగం చెయ్యడానికి ఒప్పించాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/NQHzhs8pAac

Episode metadata supplied by the publisher feed · Published Feb 26, 2023

Embed this episode

NOW PLAYING

ఆశపాశం | Asapasam | Telugu Short Story | Allu Sairam | manatelugukathalu.com

0:00 13:30

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 13 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on February 26, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!