ఆవకాయ అదిరిందోచ్ | Avakaya Adirindoch | Telugu Short Story | Lakshmi Sarma Thrigulla | manatelugukathalu.com episode artwork

EPISODE · May 14, 2023 · 11 MIN

ఆవకాయ అదిరిందోచ్ | Avakaya Adirindoch | Telugu Short Story | Lakshmi Sarma Thrigulla | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఆవకాయ అదిరిందోచ్ రచన : లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) అబ్బా.. ఎండలు మండుతున్నాయి. వైశాఖమాసమంటే భరించుకోలేని ఎండలు. బయటకు వెళ్ళాలంటే మాడి మసిబొగ్గు అవుతామేమోనని భయం. పోనీ ఇంట్లోనే ఉంటే సుఖముందా అంటే అదీలేదు. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిపోతాము. పంకా ఆగకుండా తిరుగుతూనే ఉంటుంది. తిరిగి తిరిగి వేడిగాలి వస్తుంది. పాపం అది మాత్రం ఏం చేస్తుంది.. ఎండలు అంతగా ఉన్నాయి. కానీ.. దేనికదే చెప్పుకోవాలి. ఎండకాలం వచ్చిందంటే గుమగుమలాడే కొత్త మామిడికాయ ఆవకాయ, అబ్బా.. దాని వాసన వస్తుంటే నోరూరుతుందంటే నమ్మండి. అంతే కాదండోయ్! కొత్తావకాయతో పాటుగా బంగినపల్లి మామిడిపళ్ళుగాని, రసాలు గాని అన్నంతోపాటు తింటుంటే ఆ ఆనందమే వేరు. అవును, ఈసారి మా ఇంట్లో పచ్చడి పెట్టిన జాడే కనిపించడం లేదు.. అనుకుంటూ నోరు కొత్త పచ్చడికోసం ఆరాటపడుతుండడంతో ఇంటికి వస్తూనే అడగాలనుకున్నాడు. “ఏమోయ్ సుజా .. మామిడిపళ్ళు పుష్కలంగా వచ్చాయి, నువ్వేంటి ఇంకా కొత్త ఆవకాయ పెట్టలేదు? నాకు ఎప్పుడెప్పుడు తినాలాని ఉంది. చెప్పు ఎప్పుడు పెడుతున్నావు?రేపు ఆదివారం కదా! సంతకెళ్ళి మామిడికాయలు తెస్తాను ఈ లోపల నువ్వు దానికి కావలసిన సరంజామంతా తయారు చేసుకో. ఈసారి పచ్చడి అదిరిపోవాలి తెలిసిందా, ”అడిగాడు ఇంటికి వస్తూనే ప్రసాద్. “ఇంకా నయం! మీరేదో గొప్ప విషయం చెబుతున్నా రనుకున్నాను,మీ హడావుడి చూస్తుంటే.. ఏమండి.. ఉండేది మనిద్దరం. మనకెంత పచ్చడి కావాలి చెప్పండి, ” అంది. “అదేమిటి సుజాత అలా అంటున్నావు? అమ్మాయికి అబ్బాయి వాళ్ళకు పంపొద్దూ, సంవత్సరమంతా వచ్చే ఆవకాయ పచ్చడి పెట్టకపోతే ఎలా? అదేం కుదరదు కచ్చితంగా మనం పెట్టుకోవలసిందే, ” అన్నాడు పట్టుదలగా. “మహానుభావ.. మీకంతా తొందరనే.. నేను చెప్పేది పూర్తిగా విననే వినరు. ఆవకాయ పెట్టాలంటే ఆషామషి కాదు. ఎన్ని సవరించుకుంటే పచ్చడి జాడిలోకి వచ్చి పడుతుందనుకున్నారు.. ఊరకే అవుతుందనుకున్నారా.. ఊరగాయలంటే ఊరించుకుంటూ తిన్నట్టుకాదు, ” అంది మూతి మూడు వంకరలు తిప్పుతూ. “ఆ.. ఆ.. నాకు తెలుసులేవోయ్ .. మా అమ్మ చేతితో పెట్టిన ఆవకాయంటే నాకు ప్రాణం, మా ఇంట్లో ఆవకాయ సీజన్ వచ్చిందంటే అందరికంటే ముందే మా అమ్మ పెట్టేది తెలుసా? చుట్టుపక్కల వాళ్ళందరు మా ఇంట్లోనుండి గుమగుమ వాసన వస్తుంటే, ‘మాకు పెట్టివ్వవూ.. మాకు నీలాగ పెట్టరాదు’ అని అడిగి మరీ పిలుచుకునేవారు.మా అమ్మకు నేను దగ్గరుండి అన్ని అందించేవాడిని. మంచి మడి కట్టుకుని పెట్టేది కదా! ఎవ్వరిని ముట్టనిచ్చేది కాదు, దూరంనుండి తనకు కావలసినవన్ని ఇచ్చేవాడిని, ” తల్లి గొప్పతనం గురించి చెప్పాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video linkhttps://youtu.be/UqERrHbgmi8

Episode metadata supplied by the publisher feed · Published May 14, 2023

Embed this episode

NOW PLAYING

ఆవకాయ అదిరిందోచ్ | Avakaya Adirindoch | Telugu Short Story | Lakshmi Sarma Thrigulla | manatelugukathalu.com

0:00 11:36

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 11 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on May 14, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!