EPISODE · Dec 31, 2022 · 4 MIN
అధిక సంపద - సోమరిపోతుతనం | Adhika Sampada - Somaripothuthanam |Telugu Short Story | Kidala Sivakrishna | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) అధిక సంపద - సోమరిపోతుతనం రచన: కిడాల శివకృష్ణ (ఉత్తమ నవతరం రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) మీటింగ్ మొదలైంది. మాటల శబ్దంతో మీటింగ్ హాల్ అంతా గందర గోళంగా ఉంది. ఇంతలో యం. డి కిషన్ రెడ్డి గారు మీటింగ్ హాల్ కు వచ్చేశారు. ఆయన ముఖం చూడగానే కంపెనీ స్టాఫ్ అందరూ ఒక్కసారిగా నిశ్శబ్ధంగా ఆయనకు నమస్కరిస్తూ పైకి లేచి నిల్చున్నారు. ఆయన సంస్కారంతో ‘అందరికీ నమస్కారం’ అంటూ కూర్చోమన్నాడు. అందరూ కుర్చీలో కూర్చొని ఏమీ మాట్లాడకుండా ఉన్నారు. యం. డి కిషన్ రెడ్డి గారు “అందరూ బాగున్నారా?? ఎలా సాగుతున్నాయి పనులు?” అన్నాడు. అప్పుడు కంపెనీ స్టాఫ్ “అందరూ బాగున్నాము సార్. పనులన్నీ సక్రమంగానే జరుగుతున్నాయి” అంటూ సమాధానం ఇచ్చారు. అప్పుడు యం డి కిషన్ రెడ్డి గారు “మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా?” అని అడిగారు. అప్పుడు స్టాఫ్ అందరూ “ఏమీ సమస్యలు లేవు సార్” అన్నారు. వెంటనే టీమ్ లీడర్ అయినటువంటి లోకనాథ్ గారు “నేను ముందుగానే ఈ ప్రశ్నను అడిగాను సార్. వీళ్ళు ఏమీ సమస్యలు లేవు అని చెప్పారు” అన్నాడు. “సరే లోకనాథ్ గారూ! నేను ఇప్పుడు ఒక సమస్య గురించి అడుగుతాను. అప్పుడు అందరూ మాకు ఈ సమస్య ఉంది అని అంటారు చూడండి” అన్నారు యం. డి కిషన్ రెడ్డి గారు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Embed this episode
NOW PLAYING
అధిక సంపద - సోమరిపోతుతనం | Adhika Sampada - Somaripothuthanam |Telugu Short Story | Kidala Sivakrishna | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.