అదొక మహానగరం | Adoka Mahanagaram | Telugu short Story | Lakshmi Sarma Thrigulla | manatelugukathalu.com episode artwork

EPISODE · Jan 6, 2023 · 18 MIN

అదొక మహానగరం | Adoka Mahanagaram | Telugu short Story | Lakshmi Sarma Thrigulla | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) అదొక మహానగరం రచన : లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) అదొక పేరుమోసిన అగ్రదేశంలోని న్యూయార్క్ మహానగరం. ఏయిర్ ఫోర్ట్ లో దిగి దిగగానే చుట్టూచూసాడు చలపతి. ఎటువెళ్ళాలో ఏంటో తెలియడంలేదు. ఎక్కడచూసినా అమెరికన్లు, చైనావాళ్ళు తప్పితే మనవాళ్ళు అరకొర కూడా లేరు. ఎవరితో మాట్లాడాలన్నా ఇంగ్లీషు ముక్కరాదు. అంతో ఇంతో హింది వస్తుంది కానీ ఇక్కడ ఎవరు మాట్లాడుతారు హింది. అబ్బో ఇంతపెద్దగా ఉంది ఏయిర్ ఫోర్ట్! అసలు బయటకు ఎలా వెళ్ళాలో అర్ధంకావడంలేదు. వెలసిపోయినా జీన్స్ పాయింట్, దానిమీదకు కొత్తది పాలియస్టర్ షర్ట్, ఎన్నాళ్ళుగానో వాడేసిన బూట్లు, ఒకచేతిలో లెదర్ బ్యాగు పట్టుకుని దిక్కులుచూస్తూ నిలుచున్నాడు. పాపం ఇతని అవస్థను గమనించి దగ్గరగా వచ్చాడు ఒకతను. "ఏంటండి మీరొక్కరే వచ్చారా మీకూడా ఎవరులేరా? పోని మీరు బయటకు వచ్చాకైనా ఎవరన్నా వస్తారా మిమ్మల్ని తీసుకపోవడానికి, " అడిగాడతను. అతను తెలుగులో అడిగేసరికి ప్రాణాలు లేచొచ్చాయి చలపతికి. అతనివైపు ఆశ్చర్యంగా చూస్తూ. "మీరు తెలుగువారా… నాకొక సహాయం చేస్తారా, మా స్నేహితుడు ఏయిర్ ఫోర్ట్ బయట ఉన్నాడు, వాడి దగ్గరకు నన్ను తీసుకెళ్ళండి నేనెటువెళ్ళాలో తెలియడంలేదు, ” అన్నాడు దీనంగా ముఖంపెట్టి. "అలాగే అలాగే… మీకు లగేజి ఏమిలేదా?, " చలపతి చేతులవేపు అనుమానంగా చూస్తూ అడిగాడతను. "అయ్యబాబోయ్ … సామాను మర్చిపోయానండి, ఇక్కడ దిగాక తీసుకోవాలి అని చెప్పారు. ఎక్కడ ఉందో ఏంటో! అదికూడా చూసిపెట్టండి మీకు పుణ్యం ఉంటుంది, " అన్నాడు. "సరే ఇలారండి… మీ సూట్ కేసులు మీరు గుర్తుపడతారు కదా, " అడుగుతూ లగేజ్ దగ్గరకు తీసుకవెళ్ళాడు. "ఆయ్ అండి, " అతని వెనకాలే నడవసాగాడు. అమ్మబాబోయ్ దేవుడి దయవల్ల ఇతను పరిచయం అయ్యాడు. లేకపోతే నా పరిస్థితి ఏలాగుండేదో ఏమో తనలో తానే అనుకుంటూ సూట్ కేసులు వెతకసాగాడు. "అదిగోనండి అదే అదే నా సూట్ కేసు, " అన్నాడు గట్టిగా. అందరు ఒక్కసారిగా చలపతి వైపు తిరిగిచూసారు. "చూడండి మీరు కొంచెం చిన్నగా మాట్లాడండి, ఇది ఇండియా కాదు. అటు చూడండి..  అందరు మిమ్మల్ని ఎలా చూస్తున్నారో, " చిన్నగా చెప్పాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/_4qkxmlmhx8

Episode metadata supplied by the publisher feed · Published Jan 6, 2023

Embed this episode

NOW PLAYING

అదొక మహానగరం | Adoka Mahanagaram | Telugu short Story | Lakshmi Sarma Thrigulla | manatelugukathalu.com

0:00 18:58

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 18 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on January 6, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!