EPISODE · Nov 3, 2022 · 9 MIN
అగమ్యం | Agamyam | Telugu short Story | Allu Sairam | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) అగమ్యం రచన: అల్లు సాయిరాం ప్రసాదరావు రోజులాగే తన ఆఫీసు పనులు తొందరగా ముగించుకొని, ఐదుగంటలకి బ్యాగులో లంచ్ బాక్స్ సర్దుకొని, ఆఫీస్ నుండి గబగబా బొబ్బిలి రైల్వేస్టేషన్ కి బయల్దేరాడు. స్టేషన్ కి చేరుకునేసరికి తను వెళ్ళాల్సిన ఎక్స్ప్రెస్ ట్రైన్ కదిలిపోతుంటే, పరిగెత్తుకుంటూ వచ్చి ఎక్కేశాడు ప్రసాదరావు. నీళ్లుతాగి ఆయాసం తీర్చుకున్నాక, కోచ్ లోపల చూస్తే ప్రయాణికులతో నిండిపోయింది. పక్క సీట్లో కూర్చుని న్యూస్ పేపర్ చదువుతున్న రాహుల్ కొంచెం సీటు ఎడ్జస్ట్ చేసుకోని ఆయాసపడుతున్న ప్రసాదరావుని చూసి కూర్చోమన్నాడు. ప్రసాదరావు సర్దుకుని కూర్చున్నాడు. "ఎంతవరకండీ?" అని రాహూల్ అడిగాడు. ప్రసాదరావు గొంతు సవరించుకుని "పార్వతీపురం వరకు!" అని చెప్పాడు. "మేం పార్వతీపురమేనండీ! ట్రైన్ టైం కి కొంచెం ముందు వస్తే బాగుణ్ణు కదండీ!" అని చెప్పాడు రాహుల్. ఎదురుగా మూడేళ్ల కొడుకు చింటూతో కూర్చున్న రాహుల్ భార్య శరణ్య లాప్-టాప్ లో తన పనిచేసుకుంటూ, వాళ్ళిద్దరి మాటలువింటుంది. ప్రసాదరావు కిందపడిన న్యూస్ పేపర్ అందుకుంటూ "నేను రోజూ ఈ బండిలో వెళ్లివస్తుంటాను. రోజు కరెక్ట్ గా వచ్చేస్తాను. ఈరోజే కొంచెం లేటయింది" అని చెప్తూ పేపర్ చదువుతున్నాడు. "గరమ్. గరమ్ సమోసాలే. 10 రుపాయిలకి 4 సమోసాలు" అంటూ సమోసాలవ్యాపారి నిలబడి ఉన్న మనుషుల సందుల్లోంచి వస్తున్నాడు. "మమ్మీ! సమోసా!! " అంటూ శరణ్య పక్కన విండో సీటు దగ్గర కూర్చున్న చింటూ లేచి వస్తున్నాడు. సమోసాలవ్యాపారి గబగబా నాలుగు సమోసాలు తీసేసి, ఒక పేపర్లో పొట్లంకట్టేసి, బాబు చేతిలో పెడుతున్నాడు. చింటూ ఆశగా తీసుకోవడానికి వెళ్తున్నాడు. " హే చింటూ! డోంట్ డూ దట్! సీ దేర్.. యాక్.. వెరీ ఆగ్లీ. కమ్ హియర్ " అని శరణ్య గట్టిగా అరుస్తూ, తనఒడిలో ఉన్న లాప్-టాప్ పక్కనపెట్టి, చింటూని తనదగ్గరికి తీసుకుంది. శరణ్య చెవిలో ఇయర్-ఫోన్స్ పెట్టుకుని అరిచిన అరుపులు, ట్రైన్ శబ్దాన్ని మించి, ఆ కోచ్ మొత్తం వినిపించాయి. దాంతో, అంతకుముందు అదే వ్యాపారి దగ్గర సమోసాలు తీసుకున్న ఆ కోచ్ లో వాళ్ళందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. శరణ్య మాటలకు కొందరు, యాసలో మాట్లాడుతున్న ఇంగ్లీష్ కి కొందరు తొంగితొంగి చూస్తున్నారు... Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/3uI_JxmPc00
Embed this episode
NOW PLAYING
అగమ్యం | Agamyam | Telugu short Story | Allu Sairam | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.