EPISODE · Feb 15, 2023 · 5 MIN
అగరు బొట్టు | Agaru Bottu | Telugu Short Story | Lakshmi Madan | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) అగరు బొట్టు రచన: లక్ష్మి మదన్ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఈరోజుల్లో అగరు అంటే ఎవరికీ తెలుస్తుందో లేదో... అగరు అంటే బొట్టు కోసం వాడే పదార్థం అప్పట్లో పిల్లలకి పెద్దవాళ్ళకి అదే బొట్టు వాడుకునే వాళ్ళము. అదెలా తయారు చేసి పెట్టుకుంటారో చూద్దాం. ప్రతి ఇంటిలో అగరుబొట్టు బోలెడంత నిల్వ ఉంచుకునే వాళ్ళు. ఒకవేళ ఇళ్లల్లో అయిపోయినా పక్కింట్లోను ఎదురింట్లోనూ తెచ్చుకునే వాళ్ళము కానీ తప్పకుండా ప్రతి ఇంట్లో అగరుబొట్టు మాత్రం ఉండేది. అగరు అయిపోవస్తుందంటే మా నాయనమ్మ ఆరున్నొక్క రాగం అందుకునేది. మా అమ్మను పిలిచి "ఓ పిల్ల.. అదే అయిపోయింది చూసుకున్నావా.. పిల్లలకి ఏం పెడతావ్? ఏది సోయే ఉండదు" అని గులిగేది. "అయ్యో చూసుకోలేదు అత్తా.. తుమ్మకాయ తెచ్చి తయారు చేస్తా" అని సమాధానం చెప్పేది. ఆ వెంటనే అమ్మ మమ్మల్ని పిలిచి "మామిడి వాళ్ళ ఇంట్లో తుమ్మ చెట్టు ఉంది. కొన్ని కాయలు రాలగొట్టమని చెప్పి ఏరుకొని రండి" అని చెప్పేది. ఇక మేము ఒక బట్ట సంచి తీసుకొని బయలుదేరే వాళ్ళము. "ఓ మామిడి పెంటయ్య.. మా అమ్మ తుమ్మకాయ తీసుకొని రమ్మన్నది. కొంచెం రాలగొట్టవా" అని అడిగే వాళ్ళము. అప్పుడు పెంటయ్య "తుమ్మకాయ గావాలే.. రాలగొట్టి ఇత్త తీ మా వొల్లు తలెల గట్క ఏసిండ్రు. గదితిని రాల గొడ్త" అని చెప్పి పెంటయ్య తెల్లగా తోమిన ఒక ఇత్తడిగిన్నెలో పసుపుపచ్చ రంగు ఉన్న మొక్కజొన్న గట్కా వేసుకొని, అందులో ఒక ఉల్లిగడ్డ, ఒక పచ్చిమిరపకాయ పక్కన పెట్టుకొని, దానిలో పచ్చిపులుసు పోసుకొని ఉల్లిగడ్డ మిరపకాయ నంచుకుంటూ తింటుంటే మాకు కూడా తినాలని అనిపించేది. నిజంగా అప్పటి తిండ్లు చాలా ఆరోగ్యకరమైనవి మరియు ఎప్పటికప్పుడు వేడిగా వండుకొని తినేవాళ్లు.. కట్టెల పొయ్యి మీద వంటలు చేసే వాళ్ళు కదా.. వంట అయిన తర్వాత కట్టెలన్నీ తీసివేసి వండిన పదార్థాన్ని అట్లానే పొయ్యి మీద ఉంచేవాళ్ళు. అప్పుడు పొయ్యిలో ఉన్న సెగకి అన్నము లేదా గట్గా పాలు కూరలు అన్ని వేడిగా ఉండేవి. మా ఇంట్లో అయితే ఆ వేడి పొయ్యిలో నిప్పులన్నీ తీసివేసిన తర్వాత నెయ్యి గిన్నె పెట్టి ఉంచేది అమ్మ. చక్కగా కరిగి అన్నం తినేటప్పుడు బాగుండేది. అట్లా మేము ఆలోచనలో ఉండగానే పెంటయ్య తలేలో ఉన్న గత్క ను తాగేసి చేతులు కడుక్కొని పెద్ద ఇద్దరు చెంబుతో నీళ్లు గటగట తాగేసి బయటకు వచ్చి బ్రేవ్ మని తేల్చి... పండ్రి అమ్మలు ! అని పెరట్లో ఉన్న తుమ్మ చెట్టు దగ్గరికి వచ్చి కట్టే తీసుకొని తుమ్మకాయలు అందిన అన్ని రాలగొట్టి. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/BW0kftfNpJI
Embed this episode
NOW PLAYING
అగరు బొట్టు | Agaru Bottu | Telugu Short Story | Lakshmi Madan | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.