EPISODE · Jul 6, 2022 · 7 MIN
అఖిల్ | Akhil |Telugu Short Story | N Dhanalakshmi | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) అఖిల్ రచన: N. ధనలక్ష్మి చిన్నపిల్లల మనసు చాలా స్వచ్ఛమైనది. వాళ్ళు ఎటువంటి కల్మషం లేని వారు. అలాంటి స్వచ్ఛమైన మనస్సు కలవాడు అఖిల్. అఖిల్ తన స్వచ్ఛమైన మనసుతో అందరిలో ఎలా మార్పుని తీసుకుని వచ్చారో తెలియజేసే కథ.. ఓ పట్నంలో అఖిల్ అనే అబ్బాయి 5వ తరగతి చదివేవాడు. అన్నిటిలో ముందుడేవాడు. అఖిల్ అంటే చరణ్ సర్ కి చాలా ఇష్టం. ఎందుకంటే అల్లరి చేయకుండా చెప్పిన మాట వింటాడు. అలాగే చెప్పిన పనిని ఎటువంటి తప్పులు లేకుండా చేయడమే కాకుండా కొత్తవి నేర్చుకోవడానికి ఎంతో ఆసక్తి చూపేవాడు. భోజన సమయంలో తన మిత్రులతో కలిసి తాను తెచ్చుకున్న ఆహారాన్ని తినేవాడు. అఖిల్ తాను తెచ్చుకున్న అన్నాన్ని ఒక్క మెతుకు కూడా క్రింద పడకుండా, పదార్థాలను వృధా చేయకుండా తినేవాడు. అతని స్నేహితుల్లో చాలా మంది ఇంటి నుండి తెచ్చుకున్న అన్నాన్ని సరిగ్గా తినకుండా, క్రింద పైన వేసుకుంటూ తినేవారు. మరికొందరైతే గొడవపడుతూ కోపంతో ఆహారాన్ని విసిరి పారేస్తుంటారు. కానీ ఈ అబ్బాయి మాత్రం ఒక్క మెతుకు కూడా పారేయకుండా తినేవాడు. ఒకవేళ తాను తెచ్చుకున్న బాక్స్ కు ఎక్కడైనా రెండు మెతుకులు అతుక్కుని ఉన్నా, వాటిని కూడా తినేవాడు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/Th4zvBln_8k
Embed this episode
NOW PLAYING
అఖిల్ | Akhil |Telugu Short Story | N Dhanalakshmi | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.