EPISODE · Mar 3, 2023 · 5 MIN
అక్షరమే అండగా | Aksharame Andaga | Telugu Short Story | Pitta Gopi | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) అక్షరమే అండగా రచన: పిట్ట గోపి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) టెక్నాలజీ రాజ్యమేలే ఈ రోజుల్లో నాయుడు తోట గ్రామం ఇంకా పురాతన కాలంలోనే ఉంది. కారణం ఆ గ్రామ భూస్వామి తన స్వలాభం కోసం గ్రామస్తులు అందర్ని తన కింద పని చేయించుకోవటమే. అందులోను రామయ్య అనే వ్యక్తి తనకు చదువు , ఆస్తిపాస్తులు లేకపోవటంతో భూస్వామి వద్ద పాలేరుగా పని చేస్తు కొడుకు,కూతుళ్ళను చూసుకుంటున్నాడు. అయితే పదేళ్ళ కొడుకు వెంకన్న తెలివైనవాడనే విషయం అక్షర జ్ఞానం లేని రామయ్య కు తెలియదు.ఎంత చెప్పినా.. అర్థం చేసుకోడు. తన తండ్రి పాలేరుగా ఉండటం వెంకన్నకు నచ్చేది కాదు. పైగా బడికి పంపకుండా అప్పుడప్పుడు తనను కూడా పనిలోకి పంపేవాడు.దీంతో భూస్వామి పై వెంకన్నకు పగ.ఒకరోజు వెంకన్న ఇంటివద్ద చదువుకుంటున్నాడు. “ఒరేయ్ రామయ్యా..!” అని అరుస్తు భూస్వామి వస్తాడు. “ఏంటయ్యా ఇలా వచ్చారు..” "ఇలా వచ్చానంటావేంట్రా..దొడ్లో పనులన్ని ఎక్కడివక్కడ ఉండిపోతేను” అంటాడు భూస్వామి. "అయ్యా! కూతురు ఆరోగ్యం బాలేదు. కొద్దిగా ఆలస్యం అవుతుందయ్యా.. వచ్చేస్తాను” అని బతిమాలుతాడు రామయ్య. ''ఆలస్యం అయితే ఈ ఎంకడిని అయినా పంపురా.. చిన్నప్పటినుండి చేస్తే పనిలో ఆరితేరుతాడు” అన్నాడు భూస్వామి. ''నేను వెళ్ళను చదువుకుంటాను” అన్నాడు వెంకన్న. ''ఒరేయ్ రామయ్యా.. మీకు చదువెందుకురా...చెప్పరా నీ కొడుక్కి” ''నాన్నా! మేము చదువుకుంటే..వీడంతటి వాళ్ళం అవుతాం. అందుకే మమ్మల్ని చదువుకోనీయట్లే..” అన్నాడు వెంకన్న. ''రేయ్..రామయ్యా.. నన్ను అంత మాట అంటాడా నీ కొడుకు.. చెప్తా… అని వెళ్ళిపోతాడు భూస్వామి. "ఏరా ..పెద్దోళ్ళ పై అలా అరుస్తావా..”అని కోప్పడతాడు రామయ్య . ఇంతలో పాఠశాల ఉపాధ్యాయుడు సుందరం వచ్చి “రామయ్యా! నీ కొడుకుని బడికి పంపితే నిన్ను బాగా చూసుకుంటాడు” అన్నాడు. “అవున్రయ్య.. నన్ను చదివిస్తే.. భూస్వామి కంటే మంచిగా బతకగలం” అని నచ్చజెప్పుతాడు వెంకన్న. రామయ్య వినకుండా “నోర్మూసుకుని వెళ్ళి దొడ్లో పనులు చేసుకుని రా. లేకపోతే తిండిపెట్టేది లేదు” అన్నాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/KvocmfGhAGs
Embed this episode
NOW PLAYING
అక్షరమే అండగా | Aksharame Andaga | Telugu Short Story | Pitta Gopi | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.