అల్లం శేషగిరి రావు గారి 'మృగతృష్ణ' episode artwork

EPISODE · Jan 14, 2021 · 38 MIN

అల్లం శేషగిరి రావు గారి 'మృగతృష్ణ'

from Harshaneeyam

*** కథను ప్రచురింపడానికి అనుమతినిచ్చిన శ్రీమతి మాధవి, శ్రీ రఘునాథ్ అల్లం గార్లకు కృతజ్ఞతలు.'మృగ తృష్ణ ' - అల్లం శేషగిరిరావు గారి 'అరణ్య ఘోష' కథాసంకలనం లోనిది.ఈ కథ ఆంధ్రజ్యోతి పత్రిక లో 1975 లో ప్రచురింపబడింది.పొలిటికల్ సైన్స్ లో ఎం ఏ పట్టా పుచ్చుకున్న అల్లం శేషగిరి రావు గారు, రైల్వేస్ లో పని చేసి రిటైర్ అయ్యారు. విశాఖపట్నం లో నివసించారు. ఆంగ్ల సాహిత్యంలోని అనేక ప్రసిద్ధ రచయితల రచనలను ఆయన ఇష్టంగా చదువుకున్నారు.బాల్యం ఒరిస్సా లోని ఛత్రపురంలో గడిచింది. చుట్టుపక్కల ఎక్కువ అటవీ ప్రాంతం.ఆయన తన పదమూడవ ఏటినించీ, స్నేహితులతో , ఇంట్లో వారితో కలిసి, వేటకు వెళ్లడం అడవుల్లో చాలా సమయాన్ని గడపడం జరిగింది.అటవీ నేపథ్యంలోనే ఎక్కువ శాతం కథలు రాసారు. రాసిన పదిహేడు కథల్లో సమాజంలో వుండే అసమానతలూ, అట్టడుగు వర్గాల జీవితాలపై విశ్లేషణ, ముఖ్య ఇతివృత్తాలుగా , మనకు కనిపిస్తాయి.కథల్లో ప్రకృతిని వర్ణించేటప్పుడు ఆయనకున్న పరిశీలనా జ్ఞానం , భావుకత్వం మనల్ని కట్టి పడేస్తాయి.1981 లో ఆయన ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారి పురస్కారం లభించింది.పల్లవి పబ్లికేషన్స్ వెంకట నారాయణ గారు , ఫిబ్రవరి మొదటి వారంలో 'అల్లం శేషగిరిరావు సమగ్ర కథా సంకలనం' తీసుకవస్తున్నారు.మొబైల్ : '98661 15655' ద్వారా ఆయన్ను సంప్రదించి , మీ కాపీ రిజర్వు చేసుకోవచ్చు.కథ:ఎండలు | నిప్పులు చెరిగే ఎండలు!!అడవిలోని నీటిమాటులు, కొండ వాగులు, సెలలు ఎండిపోయాయి. కొండల్లో అగ్గి జంజలు. వడదెబ్బకి పిట్టలు సొమ్మసిల్లి నేలకు రాలిపోతున్నాయి. దాహం !వులులు, తోడేళ్ళు, జింకలు, దుప్పులు, పిట్టలు, పురుగులు- నీటి కోసం ఆర్చుకుపోతూ మందలు మందలుగా వలసపోతున్నాయి. పరుగులు, ఉరకలు- దాహం. రాత్రింబవళ్ళు ఒకటే పరుగులు, దాహం. అడవి పంది పడితే రెండు మూడు వందలు దాకా చెయ్యొచ్చు. అదృష్టం పండి కణుసుపడిందా, నాలుగువందలదాకా చెయ్యొచ్చు. దుప్పి పడినా కనీసం నూటఏభైకి తక్కువరాదు,సూరయ్య బాకీ తీరిపోతుంది. మూడు సంవత్సరాల నుంచి వర్షాలు లేక బీడు పడిన తన మెరక చెక్క మీద చేసిన అప్పు! అసలు, వడ్డీతో కలిసి మూడు వందలు దాటింది. ఈ సంవత్సరమైనా తీర్చకపోతే సూరయ్య, బాకీ క్రింద భూమి జమకట్టేసుకుంటాడు. అలా చాలామంది భూముల్ని పడేసుకుని పల్లం ప్రాంతంనుంచి వచ్చిన షావుకారు సూరయ్య లక్షాధికారయిపోయాడు. ఆ సంగతి బాగా తెలిసిన బైరిగాడు తన భూమిని ఎలాగైనా దక్కించు కోవాలనుకున్నాడు.బైరిగాడు నాటు తుపాకీని బైటికి తీసి బూజు దులిపాడు. చూరులో దాచిన పాత మందుగుండు సంచి తీసి అందులోని మందుగుండు కొంచెం నేలమీద పోసి అగ్గిపుల్ల గీశాడు. పేదవాడి ఆశలా భగ్గున మండింది. పాతదైనా మందు ఇంకా పవరు పోలేదనుకున్నాడు. తుపాకీ నల్లీలో మందు ఎక్కువ పోసి దట్టించాడు. సంచీలో పాతబడిన మేకుల్నీ, ఇనుప ముక్కల్ని ఏరి గుళ్ళకు బదులుగా తుపాకీలో నింపి వాటి మీద కాగితపు ముక్కల్ని, గుడ్డ పీలికల్ని దట్టించాడు.గోచి గట్టిగా బిగించి, గుడిసె తడక దగ్గరగా లాగి, తుపాకీని పట్టుకుని సంచి భుజానికి తగిలించి అడవి లోకి బయలు దేరాడు వేటకి.అరవై సంవత్సరాలు నిండిన బైరిగాడి ముడతలు దేరిన ముఖం బీటలు పడ్డ నేలలా వుంది. వయస్సుతోనూ, కష్టాలతోనూ జీర్ణించుకుపోయిన శరీరం తోలుతో కప్పిన బొమికల గూడులా వుంది. జీరలు దేరిన కళ్ళు మాత్రం నిప్పు కణికల్లా తీక్షణంగా ఉన్నాయి. ఆ చూపుల్లో పట్టుదల, ఓపిక ఇంకా చప్పబడిపోలేదు. మధ్యాహ్నం దాటిపోయినా ఎండ ఇంకా తీక్షణంగా వుంది.దూరాన గూడెంలో వర్షాల కోసం వన దేవతలను కొలుస్తూ డప్పులు వాయిస్తూ జాతర చేస్తున్నారు.చెట్లన్నీ ఆకులు రాల్చేసి మోడువా రిపోయాయి. అడవంతా ఎండుటాకులు పరుచు కొనున్నాయి.బైరిగాడు నడుస్తుంటే దిష్టిబొమ్మ తుపాకి పట్టుకొని అడవిలో నడుస్తున్నట్టుంది. బైరిగాడి కాళ్ళ క్రింద ఎండుటాకులు చిట్లుతూంటే ఆ సడికి వెదురు డొంకల్లో చిలకలు గోలచేస్తూ ఎగిరిపోతున్నాయి. కాకుల గుంపు బైరిగాడి వింత ఆకారానికి చెట్ల మీద నుంచి గోలచేస్తూ బైరి నెత్తిమీద వలయాకారంగా తిరుగుతూ మెడలు నిక్కించి చాలా దూరం వరకు వెంబడించాయి.బైరిగాడు పొద్దుగూకక ముందే నీటిమాటు దగ్గరకు చేరాలని వడివడిగా అంగలేసుకుంటూ నడుస్తున్నాడు. అడ్డతోవల మీదగా నడుస్తూ తుప్పల్ని, డొంకల్ని, రాళ్ళని దాటుకుంటూ, రొప్పుకుంటూ, రోజాకుంటూ రెండు కొండలు ఎక్కి దిగి సాయంకాలానికల్లా నీటి మాటు దగ్గరకు వచ్చాడు.ఆ కీకారణ్యం మద్య ఎండిపోయిన సెలయేటికి పక్కగా గుబురుగా బలిసిన తుప్పల నీడలో నేల చెమ్మగా వుంది. దాని మధ్యలో చిన్న నీటి గుంట. సన్నగా నీరు ఊరుతూ గుంటగా ఏర్పడింది. బైరిగాడు దగ్గరకు రాగానే నీటిమీద ముసిరిన దోమలు జామ్మున లేచాయి. అంత అడవిలోనూ మరెక్కడా నీటి చుక్క లేదు. చుట్టుపట్ల జంతువులు దాహం తీర్చుకోవడానికి అక్కడికే వచ్చి తీరాలి. గుంట చుట్టూ బైరిగాడు పరిశీలనగా చూశాడు.జంతువుల అడుగులు చెమ్మ నేలమీద, సెలయేటి ఇసుక లోనూ స్పష్టంగా కనిపిస్తున్నాయి, అడవి పందులు తేమనేలని నీటికోసం త్రవ్వేసి గొప్పులు పెట్టేసున్నాయి.కొండల వెనుక అస్తమిస్తున్న సూర్యుడు చెట్ల సందుల్లోంచి అందంగా కనిపిస్తున్నాడు. వడగాలి చల్లబడుతున్నా పగలంతా ఎండకి సలసల కాగిపోయిన కొండ రాళ్ళలో నుంచి వేడి చిమ్ముకొస్తోంది.నీటి గుంటకి ఇరవై గజాల దూరంలో వెదురు పొద మధ్యన కూర్చొనడానికి వీలుగా సంచీలో నుంచి కత్తి తీసి చదును చేశాడు. తను బయటికి ఏ మాత్రం కన్పించకుండా చుట్టుపక్కల కొమ్మల్ని, తుప్పల్ని నరికి తెచ్చి చుట్టూ పేర్చుకున్నాడు. తుపాకీతో కాల్చడానికి వీలుగా వాటి మధ్య చిన్న సందులు చేశాడు. దూరానికి చూడ్డానికి మాటు తుప్పల మధ్యలో తుప్పలాగా కనిపిస్తోంది. అంత గొప్ప నైపుణ్యంగా పేర్చినందుకు తననుతానే అభినందించుకొని మెల్లగా మాటులోకి దూరి కూర్చున్నాడు. తుపాకీ గుర్రం ఎక్కు పెట్టి సిద్ధంగా పక్కనుంచాడు. మాటు సందుల్లోంచి నీటి గుంటకి దాహం తీర్చుకోడానికి రాబోయే జంతువులకోసం నలువైపులా చూస్తున్నాడు. ప్రతి చప్పుడునీ చెవులు నిక్కించి సూక్ష్మంగా ఆలకిస్తున్నాడు- వేటలో రాటు దేరిన బైరిగాడు. • క్యాంప్, క్యాంప్ అడవిలో నెమళ్ళు అరుస్తున్నాయి.కత్తిరి పిట్టలు ఒక్కొక్కటిగా చెట్ల మీది నుంచి దిగుతూ నీళ్ళు తాగి ఎగిరిపోతున్నాయి. నెమళ్ళు జంట ఎండుటాకుల మీద జరజరమని పరుగెత్తుకుంటూ వచ్చి నీటి గుంట దగ్గర ఆగి బెదురుగా అటూ ఇటూ చూశాయి. గబగబా నీటిని పీలుస్తూ మెడల్ని పైకెత్తి కతకతమని మింగుతూ దాహం తీర్చుకున్నాయి. దాహం తీరిన మగ నెమలి ఉల్లాసంగా పురివిప్పి ఆడ నెమలిని క్రీగంట చూస్తూ కెక్ కెక్ మని కేరుతూ అడుగులు వేస్తోంది. దాని పింఛం నీరెండలో రంగు రంగులుగా మెరుస్తోంది. అలా కాస్సేపు ఆడి నెమళ్ళ జంట అరుచుకుంటూ, తేలిపోతున్నట్టు ఎగురుకుంటూ అడవిలోకి పోయాయి. సాయంకాలం అవుతున్న కొద్ది అడవి కోళ్ళు, రకరకాల పిట్ట జాతులు నీటి మాటు దగ్గరికి వచ్చి నీరు తాగి వెళ్ళిపోతున్నాయి.రాను రాను సందె చీకట్లు అలుముకుంటున్నాయి. పక్షుల అరుపులు తగ్గిపోతున్నాయి. అవి గూళ్ళకు చేరుకుంటున్నాయి.ఇహ, జంతువులు నీటికి దిగేవేళ. గంటల తరబడి మాటులో కూర్చున్న బైరిగాడికి నడుం పీకేస్తోంది. క్రమేణా అడవంతా చీకట్లు ముసురుకున్నాయి. చీకటి దట్టమవుతున్న కొద్ది కీచురాళ్ళు ధ్వని ఎక్కువౌతోంది. దూరంగా కొండ లోయల్లో కొండ గొర్రె అరుపు మొదలు పెట్టింది. చుక్క వెలుగు గుంటలోని నీట్లో ప్రతిఫలిస్తూబైరిగాడి కళ్ళకి స్పష్టంగా కనిపిస్తోంది. ఎండిపోయిన సెలయేటి ఇసక అంత చీకట్లోనూ తీర్చి దిద్ది నట్లు కనిపిస్తోంది.గంటలు దొర్లుతున్నాయి. బాగా చల్లగాలి తెరలు తెరలుగా ఎండుటాకుల మీద నుంచి గల గల వీస్తోంది. బైరిగాడి చెమట ఇగిరిన ఒంటిమీద చల్లగాలి తాకినప్పుడల్లా హాయిగా ప్రాణం లేచివచ్చినట్లుంది.ఉన్నట్టుండి అడవి అదిరిపోయేటట్టుగా కణుసు “ఫోంక్, ఫోంక్” మని బెదురుగా దగ్గర్లో అరుచుకుంటూ పారిపోయింది. దూరమౌతున్న దాని డెక్కల చప్పుడు బైరిగాడికి స్పష్టా స్పష్టంగా వినిపిస్తోంది. కీచురాళ్ళ అరుపులు ఒక్కసారి ఆగిపోయాయి. అంతా నిశ్శబ్దం.... భరించలేని నిశ్శబ్దం అడివిని ఆవరించుకుంది. బైరిగాడు మాటులో ఉలిక్కి పడ్డాడు. ఒళ్ళంతా గగుర్పొడిచింది. అప్రయత్నంగా తుపాకీ మీదకి చెయ్యి పోయింది. ఈ అవ్యక్తమయిన గగుర్పాటుకి కారణం అర్ధమవక తికమక పడిపోతున్నాడు. • వాగు ప్రక్క తుప్పల్లో నల్లటి ఆకారం ఏదో కదుల్తున్నట్టు అనిపించిది. బైరిగాడి కళ్ళు చీకట్లను చీల్చుకుంటూ చూస్తున్నాయి. బైరిగాడు నెమ్మదిగా తుపాకీని భుజానికి ఎత్తి ఆ ఆకారం వైపు గురి పెడుతున్నాడు. ఆ ఆకారం బరువుగా నడుస్తూ నీటి గుంట దగ్గరకు వెళ్ళింది. నాలుగు కాళ్ళ మీద పడుకుని నీటి గుంటలో మూతి పెట్టి నీటిని కతుకుతోంది. గాలి విసురుకి గుఫ్ మని గబ్బు కంపు కొట్టింది.బైరిగాడి గుండె ఝల్లు మంది. పెద్దపులి నీరు తాగుతోంది. నాటు తుపాకీ, అందులోనూ ఒకే ఒక్క బారు. గురి తప్పితేనో? అధవా, దెబ్బకి పడిపోయినా; అంత తేలిగ్గా ఫారెస్టు వాళ్ళ కన్ను గప్పి అమ్ముడుపోదు. సూరయ్య బాకీ తీరడం అటుంచి కనీసం ఆర్నెల్లు జైలు శిక్ష తప్పదు. నెమ్మదిగా తుపాకీ దింపేసి అలా పులిని చూస్తూ తుప్పల్లో తుప్పలాగా కదలకుండా కూర్చున్నాడు.పెద్దపులి నీరు త్రాగి తీరిగ్గా నిల్చుని, తృప్తిగా తోకతో నేలమీద రెండు మూడుసార్లు బాది నిర్భయంగా చీకట్లో నడుచుకుంటూ అడవిలోకి పోయింది. ఎక్కడో చిటారుకొమ్మన కూర్చున్న కొండ ముచ్చు పులిని చూసి కాబోలు “హూప్ హూప్ ” మని అరుస్తూ తన మందని హెచ్చరిం చింది. దాంతో అడవిలో వున్న కోతుల మందలు కిచకిచ మని అరుచుకుంటూ అడవంతా ఒకటే గోల పెట్టేస్తున్నాయి.రాను రాను పులి దూరమౌతున్న కొద్ది ఆ అరుపులు తగ్గిపోయాయి. తిరిగి అడవంతా నిశ్శబ్దం ఆవరించుకుంది."పులివాసన తగిలింది. మరే జంతువూ నీటికి రాదు” అని అనుకుంటూ నిరాశతో బైరిగాడు మాటులో చతికిలపడిపోయాడు. ఇంత ప్రయత్నం వృధా అయిపోతోందని ఉస్సురుమన్నాడు.షావుకారు సూరయ్య మనస్సులో మెదిలినప్పుడల్లా పులికంటే ఎన్నోరెట్లు భయంగాను, క్రూరం గాను కనిపిస్తున్నాడు. తనకు మిగిలిన ఒకే ఒక్క జీవనాధారం- మెరక చెక్కని- నంజేసు కుంటాడు.అర్ధరాత్రి దాటిన తరువాత అడవిలో గాలి ఎక్కువయింది. దూరంగా కొండల్లో ఉండుండి మెరుస్తోంది. గుడగుడ మంటోంది. బైరిగాడు తలెత్తి ఆకాశం వైపు చూశాడు. నలువైపుల నుంచి నల్లటి మేఘాలు కమ్ముకొస్తున్నాయి.“వర్షం కూడా వస్తాది కాబోలు” అనుకుంటూ తన దురదృష్టానికి నిందించుకొని తలపట్టుకు కూర్చున్నాడు.రాను రాను ఆకాశం మేఘావృతమై ఉరుముతోంది. తేమగాలి మరింత జోరుగా వీస్తోంది. వెదురు పొదలు కట కటమని శబ్దం చేస్తూ పిచ్చిగా ఊగుతున్నాయి. ఎండుటాకులు అడివంతా చెల్లాచెదురుగా సుడులు తిరుగుతూ ఎగురుతున్నాయి. గాలికి రేగిన దూళి నల్లటి చీకట్లో మంచు తెరలా కనిపిస్తోంది.“ఇంత సడయితే ఇంకే జంతువు దిగుతా ది; నా కరమ కాలిపోతుంటేను!” అనుకుంటూ శూన్యంలోకి చూస్తూ కూర్చున్నాడు. ఈ నిరాశకి తోడుగా దూరాన అడవిలో వర్షం పడుతున్న చప్పుడు స్పష్టాస్పష్టంగా వినిపిస్తోంది బైరిగాడికి.రాను రాను వానజల్లు జలజలమని దగ్గరౌతోంది. రెండు మూడు చినుకులు బైరిగాడి వంటిమీద కూడా పడ్డాయి.తనకి ఎదురుగా అడవిలో ఎండుటాకుల మీద జరజరమని చప్పుడైంది. ఈదురుగాలుల నుకున్నాడు. ఆ చప్పుడు ఎక్కువౌతూ దగ్గరవుతోంది. బైరిగాడు అనుమానంగా చెవులు నిక్కించి ఆలకించాడు. ఎండుటాకుల మీద అడుగుల చప్పుడు.. డెక్కల చప్పుడు... మంద పరుగుల చప్పుడు. మందలు పరుగెత్తుకొస్తున్నాయి పరుగులు.. ఉరకలు... దాహంపెద్ద మెరుపు మెరిసింది.ఆ మెరుపు కాంతిలో దుప్పుల మంద ఆదరాబాదరాగా పరుగెత్తుకుంటూ వస్తోంది నీటి మాటుకి. తిరిగి చీకటి.చీకట్లో నీటి గుంట దగ్గర చిందర వందరగా దుప్పులు పరుగెత్తుతున్నాయి. ఒకదాన్నొకటి త్రోసుకుంటూ నీళ్ళు జుర్రుతున్నాయి. టకటకమని కొమ్ములు రాసుకుంటున్న చప్పుడు.బైరిగాడు మెరుపులా తుపాకీ తీసి గురి పెట్టాడు. చీకట్లో కదులుతున్న మంద తప్పించి సరిగ్గా గురి చూడడానికి స్పష్టంగా జంతువులు ఆనటం లేదు. ఆలస్యం చేస్తే మంద పారిపోతుంది. దుప్పుల మంద మధ్యలో గురి పెట్టి ట్రిగర్ నొక్కాడు.“ ధూమ్!" నాటు తుపాకీ మోత చుట్టు ప్రక్కల కొండల్లో ప్రతిధ్వనించింది. దుప్పులు చెల్లాచెదురుగా పారిపోతున్నాయి. తుపాకీ పొగ..... మందుగుండు క్రూర...

Episode metadata supplied by the publisher feed · Published Jan 14, 2021

Embed this episode

NOW PLAYING

అల్లం శేషగిరి రావు గారి 'మృగతృష్ణ'

0:00 38:00

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Harshaneeyam?

This episode is 38 minutes long.

When was this Harshaneeyam episode published?

This episode was published on January 14, 2021.

Can I download this Harshaneeyam episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!