EPISODE · Aug 2, 2023 · 10 MIN
అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 1 |Amavasya Vennela - Episode 1 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
'Amavasya Vennela - Episode 1 - New Telugu Web Series Written By BVD Prasada Rao 'అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 1' తెలుగు ధారావాహిక ప్రారంభం (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: బివిడి ప్రసాదరావు (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) శిరిడి సాయిబాబా గుడి ముందుకు రాగానే.. కారు ఆపి.. దిగాడు యువకుడు.. శ్రీరమణ. చెప్పులు వదిలి.. పక్కకు జరిగి.. గుడి వైపు తిరిగి.. కళ్లు మూసుకున్నాడు.. రెండు చేతులు జోడించాడు. మదిలో సాయిని శరణ కోరాడు. పిమ్మట టాక్సీ స్టాండ్ వైపు కదిలాడు శ్రీరమణ.. తన కారుతో. కారును సాఫీగా ముందుకు పోనిస్తున్నాడు. అతనిలో ఒకటే ఆలోచన.. మళ్లీ మళ్లీ చక్కెర్లు కొడుతుంది. ఈ రోజు సరైన ట్రిప్పులు రావాలని అతను తెగ ఆశిస్తున్నాడు. అతను వెళ్తున్న రోడ్డు రద్దీగానే ఉంది. వాహనాలు సర్రు సర్రున పోతున్నాయి. నడిచే వారు నడుస్తున్నారు. శ్రీరమణ కారు ముందుకు చరచరా జరుగుతోంది. అంతలోనే.. పక్క సందుల్లోంచి జర్రున రోడ్డు మీదికి వచ్చిన స్కూటీ ఒకటి.. శ్రీరమణ కారుకు టక్కున ఎదురయ్యింది. అతను జర్కయ్యాడు. ఐనా.. తన కారుని నియంత్రించాడు.. కానీ.. అప్పటికే.. ఆ స్కూటీ భళ్లున.. ఆ కారుని ఢీ కొట్టేసింది. ఆ స్కూటీ మీది యువతి.. చంద్రిక.. తుళ్లి.. టఫీన కింద పడింది. అప్పటికే.. చంద్రిక వెంట పరుగు పరుగున వచ్చి.. ఆ సందు చివరన ఆగిపోయిన నడి వయస్కుడు కామేశం.. కింద పడ్డ చంద్రికకు ఆమడ దూరంకి గబగబా చేరాడు. చంద్రికలో చలనం లేదు. అది గుర్తించిన కామేశం మెల్లిగా నవ్వుకున్నాడు. ఆ వెంబడే.. 'హమ్మయ్య' అనుకున్నాడు. తన గుండె వైపు ఛాతీని తన కుడి అర చేతితో పాముకుంటున్నాడు. *** "నీకు జాబ్ కావాలంటే.." ఆగాడు కామేశం. ఆబగా చంద్రికను చూస్తున్నాడు. చంద్రిక చూపు మార్చుకోలేదు.. "జాబ్ కావాలంటే.." అడగ్గలిగింది. "నువ్వు నాకు కావాలి." అంటూనే చంద్రిక కుడి అర చేతిని.. తన రెండు అర చేతుల్లోకి తీసుకోబోయాడు కామేశం. చంద్రిక చటుక్కున రియాక్టయ్యింది. కుర్చీలోంచి లేచింది. దానిని విసురుగా వెనుక్కు తన్నింది. అంతే అదునుగా కామేశం చెంప మీద తన కుడి అర చేతితో చెళ్లున చరిచింది. కామేశం కంగారయ్యాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/B2cgd8oJEts
Embed this episode
NOW PLAYING
అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 1 |Amavasya Vennela - Episode 1 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.