EPISODE · Aug 7, 2023 · 9 MIN
అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 2 |Amavasya Vennela - Episode 2 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
'Amavasya Vennela - Episode 2 - New Telugu Web Series Written By BVD Prasada Rao 'అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 2' తెలుగు ధారావాహిక రచన: బివిడి ప్రసాదరావు (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ: టాక్సీ డ్రైవర్ శ్రీరమణ నీతీ నిజాయితీలు ఉన్న యువకుడు. అనుకోకుండా అతని టాక్సీ క్రింద చంద్రిక అనే యువతి పడుతుంది. గాయపడ్డ ఆమెను అతనే హాస్పిటల్ లో చేరుస్తాడు. ఆమె తల్లి సావిత్రి, చెల్లెలు ఇంద్రజ హాస్పిటల్ కి వస్తారు. ఇక అమావాస్య వెన్నెల ధారావాహిక ఎపిసోడ్ 2 చదవండి.. లంచ్ వేళ కావడంతో.. టాక్సీ స్టాండ్ పల్చనయ్యింది. "శ్రీరమణ ఉదయం నుండి కనిపించడం లేదు. మంచి బేరం దొరికినట్టు ఉంది." అన్నాడు డ్రయివర్ కాశిం. "అట్టానే ఉంది." అన్నాడు.. అది విన్న మరో డ్రయివర్ అబ్దుల్. "అప్పుడే కలగచేసుకుంటూ.. అరె. అదేం కాదు. శ్రీరమణ బండి యాక్సిడెంట్ అయ్యిందట." చెప్పాడు మరో డ్రయివర్ భీమ. "అట్టానా. ఎక్కడ. ఎప్పుడు. అతడుకు ఏమీ కాలేదుగా." వాకబు చేపట్టాడు అబ్దుల్. "వివరాలు అంతగా తెలియవు కానీ. స్పాట్ నుండి గవర్నమెంట్ హాస్పిటల్ వైపు అతడు కారుతో పోయినట్టు తెలిసింది. అంతే." చెప్పాడు భీమ. "అరె. ఏమైందో.. పరిస్థితి ఎలా ఉందో. ఒక మారు పోయి చూస్తే బాగుంటుంది." అన్నాడు అబ్దుల్. "ఎంతైనా మనోడేగా. వెళ్లి చూడాలి." అన్నాడు కాశిం. "మొదట మీరు పోయి చూసి రండి." చెప్పాడు భీమ. అబ్దుల్, కాశిం.. తమ కార్లతో హాస్పిటల్ కు బయలు దేరారు. *** "నువ్వు చెప్పింది కరెక్టే కావచ్చు. ఆ సమయంలో ఆమె స్కూటీకి నీ కారు అడ్డు రావడం నిజమేగా. అలా కాక పోతే.. ఆమెకు యాక్సిడెంట్ అయ్యేది కాదుగా." అన్నాడు ఒక పోలీస్. శ్రీరమణ ఏమీ అనలేక పోతున్నాడు. సావిత్రి ఏడుస్తుంది. "ఊరుకో అమ్మా. మాట్లాడుతున్నాంగా." చిరాకయ్యాడు రెండో పోలీస్. "మీ అమ్మాయిని చూసారుగా. దెబ్బలు లేవు. కానీ కోమా ముంచింది. అదిన్నూ వైద్యంతో నయం కావచ్చని డాక్టర్ అంటున్నారుగా." చెప్పాడు మొదటి పోలీస్. ఇంద్రజ తికమకలో ఉంది. "మగ దిక్కు లేని వాళ్లం బాబు. అది మాకు అందుకు వచ్చిందనే సరికి.. ఇలా అయ్యింది." బెదిరిపోతుంది సావిత్రి. అక్కడి వాళ్లు ఎవరూ ఏమీ అనలేక పోతున్నారు. పోలీసులనే చూస్తున్నాడు శ్రీరమణ. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/SNxIxyokTKc
Embed this episode
NOW PLAYING
అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 2 |Amavasya Vennela - Episode 2 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.