EPISODE · Aug 13, 2023 · 9 MIN
అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 3 | Amavasya Vennela - Episode 3 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
'Amavasya Vennela - Episode 3 - New Telugu Web Series Written By BVD Prasada Rao 'అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 3' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: బివిడి ప్రసాదరావు (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ: టాక్సీ డ్రైవర్ శ్రీరమణ నీతీ నిజాయితీలు ఉన్న యువకుడు. అనుకోకుండా అతని టాక్సీ క్రింద చంద్రిక అనే యువతి పడుతుంది. గాయపడ్డ ఆమెను అతనే హాస్పిటల్ లో చేరుస్తాడు. ఆమె తల్లి సావిత్రి, చెల్లెలు ఇంద్రజ హాస్పిటల్ కి వస్తారు. నిజానికి ఇంటర్వ్యూ కోసం వెళ్లిన చంద్రికతో అసభ్యంగా ప్రవర్తించబోతాడు కామేశం. అతన్ని తప్పించుకునే ప్రయత్నంలోనే ఆమె నడుపుతున్న స్కూటీ శ్రీరమణ కారు కింద పడుతుంది. చంద్రిక వైద్యం ఖర్చులు తను భరిస్తానని చెబుతాడు శ్రీరమణ. ఇక అమావాస్య వెన్నెల ధారావాహిక ఎపిసోడ్ 3 చదవండి.. హాస్పిటల్ ముందు.. బైక్ ఆపాడు కామేశం. బండి దిగి చుట్టూ చూస్తున్నాడు. ఎవరెవరో అగుపిస్తున్నారు. చంద్రిక భోగట్టా ఎలా తెలుసుకోవాలో యోచిస్తున్నాడు కామేశం. అప్పుడే కంపౌండర్ వీరయ్య.. యాద కొచ్చాడు. బైక్ ను పక్కన నిలిపి హాస్పిటల్ లోకి కదిలాడు. వీరయ్యకై వాకబు చేపట్టాడు. పావుగంట లోపునే వీరయ్యను కలవగలిగాడు. "ఏంటి సారూ." అడిగాడు వీరయ్య. "ఒకరి గురించి తెలుసుకోవాలని వచ్చాను." చెప్పాడు కామేశం. "ఎవరికై." అడిగాడు వీరయ్య. "ఉదయం స్కూటీ యాక్సిడెంట్ ఐంది. ఆ అమ్మాయిని ఇక్కడికే తెచ్చారు. దాని కోసమే వచ్చాను. నువ్వు ఇక్కడి వాడివేగా. తెలుస్తుందని.." మెల్లి మెల్లిగా మాట్లాడుతున్నాడు కామేశం. అంతలోనే.. అటుగా.. చంద్రిక ఉన్న స్ట్రెచర్.. దాని వెనుక ఇద్దరు ఆడ వాళ్లు.. వాళ్ల వెనుక పోలీసులతో కూడిన ముగ్గురు మగాళ్లు.. రావడం చూసిన కామేశం.. మాటలు ఆపేసాడు. వాళ్లలోని శ్రీరమణను పోల్చాడు. 'ఇతడి కారుకేగా చంద్రిక స్కూటీ గుద్దుకుంది..' అనుకున్నాడు. ఆ వెంబడే.. 'చంద్రికను హాస్పిటల్ కు తీసుకెళ్లింది ఇతడేగా..' అని కూడా అనుకున్నాడు. వెనుక్కు తగ్గాడు. ఆ స్ట్రెచర్ తో పాటు.. వాళ్లంతా తనను దాటుకు పోయేక.. "వీరయ్య.. ఇదే.. ఈ సంగతే.. ఈ అమ్మాయే.." అనగలిగాడు కామేశం తడబాటులతో. "ఓ. ఇదా. అమ్మాయికి పెద్దగా దెబ్బలేమీ కాలే. కానీ యాక్సిడెంట్ షాక్ కు తెలివి పోయింది. ఇంట్లో పెట్టుకొని వైద్యం చేయించుకుంటారట." చెప్పాడు వీరయ్య. "అంటే.. బతుకుతుందా." ఆత్రమయ్యాడు కామేశం. "ఏమో. కోమా లాంటిదేనట. తెలివి రాందే ఏమీ చెప్పడం కాదట." చెప్పాడు వీరయ్య. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/HHtMylroLPE
Embed this episode
NOW PLAYING
అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 3 | Amavasya Vennela - Episode 3 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.