EPISODE · Aug 24, 2023 · 10 MIN
అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 5 | Amavasya Vennela - Episode 5 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
'Amavasya Vennela - Episode 5 - New Telugu Web Series Written By BVD Prasada Rao 'అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 5' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: బివిడి ప్రసాదరావు (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ ఆ వెంబడే.. "సర్లే కానీ.. ఇంతకీ ఏమైంది" అన్నాడు శ్రీరమణ. "సుజాత.. తన తల్లిదండ్రులను ఒప్పించలేక పోయింది" నెమ్మదిగా చెప్పాడు వెంకట్. "నువ్వు వెళ్లి.. ఆ తల్లిదండ్రులతో మాట్లాడాలిగా" అన్నాడు శ్రీరమణ. "తమ కూతురుకే లెక్క చేయని వాళ్లు. నా మాట కానిస్తారా" అనేసాడు వెంకట్. "అదే తప్పుడు ఆలోచన. ప్రయత్నం చేయాలిగా. ఆ అమ్మాయే కావాలనుకున్నప్పుడు నువ్వు చొరవ అవ్వాలి. తప్పు నీదే" చెప్పాడు శ్రీరమణ. వెంకట్ తలెత్తాడు. శ్రీరమణనే చూస్తున్నాడు. శ్రీరమణ మాత్రం సూటిగానే వెంకట్ నే చూస్తూ.. "పైగా చావాలనుకోవడం మరీ తప్పురా" అంటున్నాడు. గిరి, సుబ్బారావు శ్రోతలై ఉన్నారు. "ప్రేమ వ్యవహారం చాలా సున్నితం.." చెప్పుతున్నాడు శ్రీరమణ. "అందుకే దానిని ఒడుపుగా హేండిల్ చేయాలి తప్పా.. తెగనీయకూడదు" ఆగాడు శ్రీరమణ. అప్పుడే.. "సుజాత కూడా.. 'నువ్వు దక్కకపోతే నేను చస్తాను' అన్నా.. నన్ను పట్టించుకోలేదురా" మాట్లాడేడు వెంకట్. "చాల్లే. నువ్వు.. నీ చావు వాలకం" కసురుకున్నాడు శ్రీరమణ. వెంకట్ తగ్గాడు. "ప్రేమించుకో ముందే తర్జన భర్జన పడాలి. ప్రేమలో పడేక దానకై కట్టుబడాలి. అంతే. " తేల్చేసాడు శ్రీరమణ. "ఇప్పుడు ఏం చేయగలం. " అడిగాడు వెంకట్. "సుజాత.. తన తల్లిదండ్రులను ఒప్పించకోలేక పోయింది మరియు నువ్వు చస్తానన్నా తను పట్టించుకోలేదు.. కదూ" ఆగాడు శ్రీరమణ. "అవును" అన్నాడు వెంకట్. "తన పెద్దలు కుదిర్చిన సంబంధంకి తను సమ్మతిస్తుందనుకోవాలా" అడిగాడు శ్రీరమణ. "అంతే అనుకున్నా. తను మరొకడితో పెళ్లికి సమ్మతించింది కనుకనే.. నన్ను తను లెక్క చేయలేదు" అనేసాడు వెంకట్. "మరి అట్టి దానికై నువ్వు చావడం ఏమిట్రా" అనేసాడు శ్రీరమణ. వెంకట్ మాట్లాడ లేదు. "తను నీ మీద మొగ్గు అగుపరిస్తే ఏమైనా చేయచ్చు. తనే ఖాతరు చేయ నప్పుడు.. మీ మధ్య ప్రేమేట్రా" విస్మయం ప్రదర్శించాడు శ్రీరమణ. "అంతేగా. రమణ అంది ముమ్మూటికి కరెక్టురా" అప్పుడే అన్నాడు గిరి. "అవున్రా. అట్టి అమ్మాయి కోసం నువ్వు చావడం ఏంట్రా" అందుకున్నాడు సుబ్బారావు. "నా మాట ఆలకించు. ఆమె సొద ఆమెకే వదిలేసి.. నువ్వు మామూలు అవ్వు. చక్కగా నీ మానాన నువ్వు ఉండు. నీ ఇజ్జతు వీడకు" చెప్పాడు శ్రీరమణ.. వెంకట్ చూపుల్లోకి చూస్తూ. ఆ వెంబడే.. "నీ మీద ఆధార పడ్డ వారు ఉన్నారు. వారిని హైరాన పర్చకు" చెప్పాడు. అందుకు మిగతా ఇద్దరూ వత్తాసు పలికారు. వెంకట సముదాయించుకోగలుగుతున్నాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/RpgRQxgWYRw
Embed this episode
NOW PLAYING
అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 5 | Amavasya Vennela - Episode 5 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.