అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 6 | Amavasya Vennela - Episode 6 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com episode artwork

EPISODE · Aug 29, 2023 · 9 MIN

అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 6 | Amavasya Vennela - Episode 6 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

'Amavasya Vennela - Episode 6 - New Telugu Web Series Written By BVD Prasada Rao 'అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 6' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: బివిడి ప్రసాదరావు (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ: టాక్సీ డ్రైవర్ శ్రీరమణ నీతీ నిజాయితీలు ఉన్న యువకుడు. అనుకోకుండా అతని టాక్సీ క్రింద చంద్రిక అనే యువతి పడుతుంది. గాయపడ్డ ఆమెను అతనే హాస్పిటల్ లో చేరుస్తాడు. ఆమె తల్లి సావిత్రి, చెల్లెలు ఇంద్రజ హాస్పిటల్ కి వస్తారు. నిజానికి ఇంటర్వ్యూ కోసం వెళ్లిన చంద్రికతో అసభ్యంగా ప్రవర్తించబోతాడు కామేశం. అతన్ని తప్పించుకునే ప్రయత్నంలోనే ఆమె నడుపుతున్న స్కూటీ శ్రీరమణ కారు కింద పడుతుంది. చంద్రిక వైద్యం ఖర్చులు తను భరిస్తానని చెబుతాడు శ్రీరమణ. మాజీ రూమ్ మేట్ వెంకట్ ఆత్మహత్యా ప్రయత్నం చేసాడని తెలిసి పరామర్శిస్తాడు. పార్వతమ్మకు తన గతం చెబుతాడు శ్రీరమణ. ఇక అమావాస్య వెన్నెల ధారావాహిక ఎపిసోడ్ 6 చదవండి తను ఒక బిడ్డను కని.. సోములు చేతిలో పడేసింది. అంతే లాఘవముగా పరాన్నజీవిలా పరారయ్యింది. తన చేతుల్లో ఒదిగిన బిడ్డను ఏడిపించలేక.. తను ఏడుస్తూ.. ఆ బిడ్డ బతుకై యాతనలతో ప్రాకులాడేడు సోములు. ఆ బిడ్డ పెద్దవుతుండగా.. సోములు జబ్బు పడ్డాడు. ఒక పక్క బిడ్డ.. మరో పక్క జబ్బు.. తో తన బతుకు కాడిని ఈడ్చలేక.. విడవలేక.. తుదికి జబ్బు వైపు ఒరిగి పోయాడు. సోములు మళ్లీ ఓడిపోయాడు.. చచ్చిపోయాడు." శ్రీరమణ చెప్పడం ఆపేసాడు. కారుతున్న కన్నీళ్లను తుడవక తల వాల్చేసి అలానే కూర్చున్నాడు. పార్వతమ్మ గుండె బరువెక్కిపోయి ఉంది. అతడినే చూస్తూ ఉంది. కొద్ది నిముషాలు పిదప.. తిరిగి శ్రీరమణ చెప్పడం చేపట్టాడు. "ఆ బిడ్డను.. నేనే.. ఆ సోములే నా నాన్న.. నాన్న చనిపోతూ.. చనిపోతూ.. రోజువారీగా నాకు ఇవన్నీ తెల్పాడు. నాలో ధైర్యాన్ని నింపాడు. బతుకు వన్నెలకు పాఠాలు నేర్పాడు. నన్ను చాలా మటుకు నిలిపాడు. నా అంతట నేను నడిచేలా ఊతం ఇచ్చాడు. నేను కారును అద్దెకు సమకూర్చుకోగలిగాను. నేను ఏమీ చదవక పోయినా.. నాన్న నేర్పిన బతుకు అభ్యాసాలు.. నాకు ఆసరా అయ్యాయి." మళ్లీ చెప్పడం ఆపాడు శ్రీరమణ. ఈమారు కూడా పార్వతమ్మ ఏమీ మాట్లాడలేక పోయింది. ఆ వెంబడే.. "ఇది అమ్మ.. నాది. చాలా." అడుగుతున్నాడు శ్రీరమణ. తననే చూస్తూ ఉన్న శ్రీరమణను చూస్తూ ఉండిపోయింది పార్వతమ్మ. కొద్దిసేపు పిమ్మట.. "పడుకో." అని అక్కడ నుండి లేచి తన పడకకై వెళ్లిపోయింది. శ్రీరమణ పక్క పర్చుకొని.. దాని మీద నడుము వాల్చాడు. *** మర్నాడు.. మధ్యాహ్నం భోజనం అయ్యాక.. పనికి కదలబోతూ.. "నిన్నటి నేను తెచ్చిన పులిహోర బాక్సును కడిగి పెడతానన్నావు. అది ఏడ అమ్మ." అడిగాడు శ్రీరమణ. పార్వతమ్మ వెళ్లి.. ఆ బాక్సును తెచ్చి.. శ్రీరమణకి అందించింది. "ఈ పులిహోర కథ ఏంటి. రాత్రి ఇదీ చెప్పుతావనుకున్నాను." అంది. చిన్నగా నవ్వేసాడు శ్రీరమణ. "ఇదే మరో కథలే అమ్మా." అన్నాడు. "చెప్పవా." ఆశ పడుతుంది పార్వతమ్మ. "ఇదేం అంతటది కాదమ్మా." అనేసాడు శ్రీరమణ. "నీకు కాకవచ్చు. నాకు చెప్పొచ్చుగా." కుతూహలం పడింది పార్వతమ్మ. టూకీగా చంద్రిక వాళ్ల కబుర్లు చెప్పేడు శ్రీరమణ. "అవునా. అయ్యో. నువ్వు ఉన్నావే.. మరీ ఇంత మంచోడివా." నోరు నొక్కుకుంటుంది పార్వతమ్మ. శ్రీరమణ ఏమీ అనలేదు. బాక్సుతో అక్కడి నుండి వెళ్లి పోయాడు.. తన కారు వైపు. *** ఆ సాయంకాలం.. ఇంద్రజ.. పిల్లలకు ట్యూషన్ చెప్పుతుంది.. ఆ ఇంటి వరండాలో. ఆ ఇంటి మధ్య హాలులాంటి గదిలో.. మంచం మీద ఎప్పటిలాగే చంద్రిక ఉంది. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/zcS6YCOBO5Y

Episode metadata supplied by the publisher feed · Published Aug 29, 2023

Embed this episode

NOW PLAYING

అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 6 | Amavasya Vennela - Episode 6 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com

0:00 9:02

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 9 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on August 29, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!