EPISODE · Feb 4, 2023 · 28 MIN
అమ్మ ఆశీస్సులు | Amma Asissulu | New Telugu story | Ch. C. S. Sarma | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) అమ్మ ఆశీస్సులు రచన: సిహెచ్. సీఎస్. శర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) కన్నతల్లి తన జీవిత కాలంలో తన బిడ్డల ఆనందానికి ఏదైనా వెనుకాడకుండా చేస్తుంది. అవసరమైతే ఎవరినైనా ఎదుర్కొంటుంది. తన తనయుడి కోరిక నెరవేర్చేటందుకు... అందుకే అన్నారు పెద్దలు అమ్మకు సాటి అమ్మేనని!!... అంజి బాబు రాఘవేంద్ర అన్నదమ్ములు. వారి తల్లిదండ్రులు సావిత్రి, శేషగిరిరావు. రావు గారు పి.డబ్లి.యుడిపార్ట్మెంట్లో యి.యి.గా పనిచేస్తున్నారు. పెద్ద కొడుకు అంజిబాబు చాలా నిదానం... నెమ్మది, కోపం ఎప్పుడూ రాదు. పరమశాంతమూర్తి. తమ్ముడంటే ఎంతో ఇష్టం. చిన్నవాడు రాఘవేంద్ర మొండివాడు. ఆవేశపరుడు. తన మాటను కాదంటే అతనికి కోపం వస్తుంది. ఆ కోపానికి కారకులు స్నేహితులయితే... కొట్లాడుతాడు తల్లిదండ్రులు అన్న అయితే... అలుగుతాడు. మూగవాడు అయిపోతాడు. కన్నబిడ్డలు... ఎలాంటి వారైనా తల్లిదండ్రులు వారి పట్ల ఎంతో అభిమానంగా ఉంటారుగా... ఆ కారణంగా పిల్లలు తప్పు చేస్తే చేయకూడదని నచ్చ చెబుతారు. వారి బాగును కోరుకుంటారు. వారు సరైన మార్గంలో నడిచి వృద్ధిలోనికి వస్తే ఎంతగానో సంతోషిస్తారు. ఈ దంపతులు వారి బిడ్డల విషయంలో అంతే. అంజి బాబు తన తల్లిదండ్రుల ఆశలు తీర్చాడు. సివిల్ ఇంజనీరయ్యాడు. నెల్లూరులో హైవే డిపార్ట్మెంట్లోఏ.ఈ. గా మూడేళ్ల నుంచి పని చేస్తున్నాడు. రాఘవ ఎం.కామ్ ఫైనల్ ఇయర్. వారి సంసారంలో ఎంతో ఆనందం. వారి ఇల్లు ఆనంద నిలయం. జగన్నాథుడి నిర్ణయాలు అనూహ్యాలు. శేషగిరిరావు తొమ్మిది నెలల కిందట కార్ యాక్సిడెంట్ లో స్వర్గస్తులైనారు. ఆనంద నిలయంగా ఉన్న ఆ ఇంటిని కారు చీకట్లు చుట్టూ ముట్టాయి. పతివియోగం సావిత్రికి సమ్మెట దెబ్బ అయింది. అంజి బాబు దుఃఖాన్ని దిగమ్రింగి... తల్లిని, తమ్ముడిని ఓదార్చుతూ ఆసరాగా నిలబడ్డాడు. ముఖ్యంగా తల్లి విషయంలో ఆమె ప్రతి మాటను గౌరవించి పాటించేవాడు. ఆచరించేవాడు. రాఘవ తల్లి అన్నల మాటలను ఆదరించేవాడు. పాటించేవాడు. మూడు నెలల క్రిందటఎదురింట్లో... డిఎస్పి రామనాథం గారు, భార్య శ్రీమతి యుక్త వయసులో ఉన్న ప్రేమ వారి కుమార్తెతో వచ్చి చేరారు. ప్రేమ అందాల బొమ్మ. రాఘవేంద్ర... ప్రేమను చూసిన తొలిచూపులోనే ఆమెను తనదాన్నిగా చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ప్రేమ బిఏ చదువుతూ ఉంది. దార్లు కాచి, పలకరించి మెల్లగా ప్రేమను ముగ్గులోకి దించాడు మాటకారి మాయదారి రాఘవ. ఇరువురికి కొద్ది కాలంలోనే ఎంతో సన్నిహితం ఏర్పడింది. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/HVPX384er-c
Embed this episode
NOW PLAYING
అమ్మ ఆశీస్సులు | Amma Asissulu | New Telugu story | Ch. C. S. Sarma | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.