EPISODE · Jun 22, 2023 · 7 MIN
అమ్మ లేని పుట్టిల్లు | Amma Leni Puttillu | Telugu Short Story | Penumaka Vasantha | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Amma Leni Puttillu' - New Telugu Story Written By Penumaka Vasantha 'అమ్మ లేని పుట్టిల్లు' తెలుగు కథ రచన: పెనుమాక వసంత (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) "అమ్మ కు బాలేదక్కా! సీరియస్ గా ఉంది." రమ్మని తమ్ముడు కాల్ చేశాడు. "అదేంటి.. రా నిన్న కూడా మాట్లాడాను, .. ఏమైంది? ముందు నిజం చెప్పు ఎలా ఉంది? అమ్మకు" అని అడిగాను. "రాత్రి గుండె నొప్పి అంది. వెంటనే హాస్పిటల్ లో జాయిన్ చేశాం. ముందు బయలుదేరు అక్కా!” అని సెల్ పెట్టేశాడు శరత్. వెంటనే జర్మనీ నుండి ఇండియా కు టికెట్ బుక్ చేసుకుని బయలుదేరింది విజయ. ఫ్లైట్ ఎక్కిందే గానీ అమ్మ ఆలోచనలే మది నిండా. అమ్మ నాన్నను పెళ్లి చేసుకుని ఏనాడూ సుఖ పడింది లేదు. ఆయన తాగుడు అలవాటు భరించి ఎపుడూ ఆనందంగా ఉన్నది లేదు. పొలం పనులు చేయిస్తూ ఇంటి బాధ్యతలను నెత్తిన వేసుకుని శ్రమ పడేది. నాకు అన్నయ్య, తమ్ముడు ఉన్నారు. అన్నయ్య పెళ్ళిచేసుకుని హైదరాబాద్ లో సెటిల్ అయ్యాడు. తమ్ముడు అమ్మ కు చేదోడు వాదోడుగా ఉంటూ డిగ్రీ తో చదువు మానేసి వ్యవసాయం చేసుకుంటున్నాడు. నా పెళ్ళికి అన్నయ్య సాయం చేయక పోయినా తమ్ముడు నా పెళ్ళికి అమ్మ తో పాటు కష్టపడ్డాడు. నాన్న అక్షింతలు వేయటం తప్ప ఎటువంటి సాయం ఆయన నుండి లేదు. ఆయన తాగి పెళ్లి లో గొడవ చేయకుండా ఉంటే.. చాలని అమ్మ కోరుకుంది. ఇలా నా పెళ్లి చేసి కొంచం ఊపిరి పీల్చుకుంది అమ్మ. నాకూ తమ్ముడు కి మాత్రమే తెలుసు! అమ్మ తన పుస్తెలు కుదువ పెట్టీ మా పొలాలకి ఎరువులు, పురుగుమందులు తేవటం. నాన్న తన తాగుడు కి డబ్బులు ఇవ్వలేదని అమ్మని కొడుతుంటే తమ్ముడు, నేను ఆయన్ని బయటకు పంపే వాళ్ళం. ఆయన అంత చేసినా ‘నాన్న అన్నానికి ఆగలే’డంటూ అన్నం కలిపి ఆయన నోట్లోపెట్టేది. మనుషుల్ని ప్రేమించటం, అమ్మ దగ్గర చూసి నేర్చుకున్నాను. ఇంట్లో నాన్న తాగుడు, అప్పులు.. ఇవన్నీ చూసి అన్నయ్య ఉద్యోగం చూసుకుని హైదరబాద్ లో స్థిరపడ్డాడు. పండగకి చుట్టంచూపుగా రావటం చేసేవాడు. ‘పెద్దొడా!’ అని అమ్మ ప్రేమగా పిలిస్తే.. ఎక్కడ డబ్బులు అడుగుతుందో లేదా అప్పులు మీద పడతాయనీ ‘ఆ.. ఏంటీ?’ అని అంటి ముట్టనట్లుగా ఉండేవాడు. మా తమ్ముడు ‘అన్నయ్యను డబ్బులు అడుగుదాం’ అంటే అమ్మ ఊరుకునేది కాదు.. "చిన్నోడా! వాడు భార్య పిల్లలతో సిటీ లో ఎన్ని కష్టాలు పడుతున్నాడో!? వద్దు నాన్నా! వాడిని అడగవద్దు" అనేది. నా పెళ్లి మా బావతో అవ్వటం వల్ల కొంచం కుదట పడింది అమ్మ. మా అన్నయ్య మీద వదిన చాలా మంచిది. పెళ్లి ఖర్చులకి అమ్మ కి కొంత మనీ ఇచ్చింది. అపుడు అమ్మ వదిన్ని "నువ్వు నాకు కూతురువి! కోడలివి కాదు" అంటూ కళ్ల నీళ్ళు పెట్టుకొంది. ‘మనందరం ఒకట! అత్తయ్య! దిగులు పడకండ’ని పెళ్లి పనులను నెత్తిన వేసుకుంది వదిన. అలా నాతో పాటు సమానంగా చూసేది వదిన్ని. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/QMzMcwDa0V4
Embed this episode
NOW PLAYING
అమ్మ లేని పుట్టిల్లు | Amma Leni Puttillu | Telugu Short Story | Penumaka Vasantha | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.