EPISODE · Feb 7, 2023 · 8 MIN
Amma Chettu | అమ్మ చెట్టు | Telugu Short Story | Sujatha Thimmana | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) అమ్మ చెట్టు రచన: సుజాత తిమ్మన (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) పని ముగించుకొని మంచం మీద వాలాను. అమ్మ ఒడిలో ఒదిగి పడుకున్న భావన.. అవును మరి, ఈ మంచం ఒకప్పటి అమ్మ నాటిన చెట్టు కదూ! మంచం ఏంటి.? చెట్టు ఏంటి? అనుకుంటున్నారా! అమ్మ తన చిన్నతనంలో చింత పిక్కలాట ఆడుకుంటూ.. ఓ గింజని తన చిన్ని చేతులతో ( అప్పుడు తనకి అయిదేళ్ళట )వాళ్ళ ఇంటి పెరడులో నాటిందట. రోజు ఉదయం లేచింది మొదలు నీళ్ళు పోస్తూ,. మొక్క ఎప్పుడు వస్తుంది అనుకుంటూ చూసేదట. ఓ ఉదయం నేలని చీల్చుకుంటూ...ఓ చిన్ని మొలక కనిపించగానే... ఎగిరెగిరి గంతులు వేసిందట ఆనందంతో. ప్రతి రోజు ఆ మొక్కతో మాట్లాడుతూ.... తనతో పాటే.. మొక్కని ఏంతో ప్రేమతో పెంచుకుందిట. పెరటినిండా ఇంకా ఎన్నో చెట్లు, జామ, సపోటా, దానిమ్మ, నిమ్మ, డబ్బపండు, మామిడి ఇలా పండ్ల చెట్లే కాదు... మల్లె పందిరి చుట్టూ గులాబి పూవులు... కనకాంబరాలు... మందార... నందివర్ధం... సంపెంగ... ఇలా రకరకాల పూల చెట్లు ఎన్ని ఉన్నా... తన చేతులతో పెట్టిన గింజ మొలకెత్తింది అనే పిచ్చి ప్రేమని పెంచుకుందిట. పెళ్లి అయి అత్తవారింటికి వెళ్ళాలిసి వచ్చినప్పుడు ఆ చెట్టును వదిలి వెళ్లనని గోల గోలగా ఏడిచిందిట. తాతగారు ఈ గోల పడలేక ఆ ఇంటిని అమ్మకి కానుకగా ఇచ్చేసారుట..అప్పటి నుంచి అమ్మ కాపురం కూడా ఆ ఇంట్లోనే. నాన్నగారు ఈమె పిచ్చితనం చూసి ముసి ముసిగా నవ్వుకునే వారు.గంటల తరబడి ఆ చెట్టు దగ్గరే పనులు చేసుకుంటూ, పని అయినాక రేడియో పెట్టుకుని పాటలు వింటూ తనూ పాడుకుంటూ ఏంతో ఉత్సాహంగా ఉండేది. నన్ను తమ్ముడిని కుడా ఆ చెట్టు నీడలో కూర్చోబెట్టి చదువుకోమనేది. చింత చెట్టు కదూ! ఎంచక్కగా చింత చిగురుతో రకరకాలుగా వంటలు చేసి పెట్టేది. చింతకాయలతో పచ్చడి మా కొక్కళ్లకె కాదు... మా చుట్టాలందరికి ఇచ్చేది. చింతపండు సంవత్సరానికి సరిపడా మాకు ఉంచి మిగిలినది అందరికి పంచేది. ఆ చెట్టు కొమ్మకి తాడు కట్టుకొని మా స్నేహుతులం అందరమూ ఎంచక్కా ఉయ్యాలలూగే వాళ్ళం. ఇలా అమ్మతో పాటే మేము కూడా ఆ చింత చెట్టు తో మమకారం పెంచుకున్నాము. పెరిగి పెద్దవాళ్ళం అయ్యాము. ఇల్లు పాతబడి పోయినా అమ్మ మాత్రం మరమత్తులు చేయించేది కాని, మార్చటానికి వీలు లేదు అని గట్టిగా చెప్పేసింది. నా వివాహం జరిగి నేను ఆ చెట్టుని, ఇంటిని, ఆ వీధిని,ఆ ఊరిని, వదిలి ఈ పట్నం వచ్చి చేరాను, శ్రీవారి ఉద్యోగ రిత్యా… Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/_29oHYwLUU0
Embed this episode
NOW PLAYING
Amma Chettu | అమ్మ చెట్టు | Telugu Short Story | Sujatha Thimmana | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.