EPISODE · Jul 26, 2023 · 6 MIN
అమృత - అనంత | Amrutha - Anantha | Telugu Short Story | Mohana Krishna Tata | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
'Amrutha - Anantha' - New Telugu Story Written By Mohana Krishna Tata 'అమృత - అనంత' తెలుగు కథ (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: తాత మోహనకృష్ణ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఆనంద్ హడావిడిగా బ్యాగ్ లో బట్టలు సర్దుతున్నాడు. వారం మునుపు ఢిల్లీకి ట్రైన్ బెర్త్ రిజర్వేషన్ చేసుకున్నాడు. పెద్ద కంపెనీ లో సాఫ్ట్‌వేర్ జాబ్ వచ్చింది. ఆనంద్ చాలా తెలివైన వాడు. కష్టపడి చదువుకున్నాడు. వాళ్ళమ్మ కల - తన కొడుకు పెద్ద ఉద్యోగం చెయ్యాలని. అమ్మ ఆశీర్వాదము తో ఢిల్లీ బయల్దేరాడు. బుక్ చేసిన క్యాబ్ గుమ్మం ముంది ఆగింది. ఆనంద్ బ్యాగ్ తీసుకొని బయల్దేరాడు. దారిలో తన కాలేజీ రోజులు గుర్తొచ్చాయి.. ************************** ఇంజనీరింగ్ చదువుతున్న రోజులవి. ఫ్రెండ్స్ తో చాలా సరదాగా ఉండేవి ఆ రోజులు. సీనియర్స్ - జూనియర్స్ తో కాలేజీ అంతా చాలా సందడిగా ఉండేది. అలాంటి ఒక సందర్భంలో, ఆనంద్ ఒక అందమైన అమ్మాయిని చూసాడు. కొత్తగా జాయిన్ అయిన జూనియర్. సీనియర్ అవడం తో, ఆనంద్ చొరవ తో, అమ్మాయి దగ్గరకు ర్యాగింగ్ నెపంతో, పేరు అడిగి తెలుసుకున్నాడు. "నా పేరు అమృత" అన్నది తన తీయటి గొంతుతో.. "నా పేరు ఆనంద్"- మీకు సీనియర్ని. చదువులో, ఏమైనా డౌట్స్ ఉంటే, నన్ను అడగండి. " "అలాగే" అంది అమృత అమృత తో స్నేహం రోజు రోజు కు ప్రేమ గా మారింది. ఆనంద్ తన ప్రేమ గురించి చెప్పడానికి సమయం కోసం చూస్తున్నాడు. ********************** "సార్! స్టేషన్ వచ్చింది" అన్నాడు క్యాబ్ డ్రైవర్. "ఓకే" అని చెప్పి బ్యాగ్ తీస్కొని లోపలికి వెళ్ళాడు. ట్రైన్ ఇంకా రాలేదు. అక్కడ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు మళ్ళీ పాత రోజులు గుర్తొచ్చాయి. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/aIYaFgV0zpA
Embed this episode
NOW PLAYING
అమృత - అనంత | Amrutha - Anantha | Telugu Short Story | Mohana Krishna Tata | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.