అనామిక | Anamika | Telugu Short Stories | Bhagavathula Bharathi | manatelugukathalu.com episode artwork

EPISODE · Oct 10, 2022 · 6 MIN

అనామిక | Anamika | Telugu Short Stories | Bhagavathula Bharathi | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) అనామిక రచన: భాగవతుల భారతి "ఇంతవరకూ  తెరచాటున ఉండి... మెసేజెస్ ద్వారా మాట్లాడింది చాలు. మీరెవరో ఇదంతా ఎందుకు చేస్తున్నారూ?... ఫోన్ లో అడిగింది స్వప్న. అవతలివైపు మౌనం .... "మౌనం మాట్లాడుతుందని తెలుసు... కానీ మీరు మాట్లాడే భాష మాకు అర్థం కావట్లేదు... మీరెవరూ?...రోజూ మెసేజెస్ పెడుతున్నారు?.... అప్పుడప్పుడు డబ్బులూ పంపుతున్నారు... కారణం ఏమిటీ? " మళ్ళీ మెసేజ్ " టైం వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది. అయినా పరస్పరం అభిమానం సంపాదించటానికి ఆస్తులూ, అంతస్థులతో పాటే, పేరూ, ఊరూ తెలియాల్సిన అవసరమూలేదు " "మీరు మగవారా? ఆడవారా?" సమాధానం లేదు కానీ ఐదువేల రూపాయల గూగుల్ పే రసీదు... వాట్సప్ లోకి వచ్చింది. స్వప్న నిట్టూర్చింది దీర్ఘంగా. కాలం తనపనితను చేసుకొంటూ పోతూనే స్వప్న పెద్దకూతురు కార్తీకను ఐ. ఎ. యస్ ను చేసింది. చిన్నకూతురు ప్రదీపను డాక్టర్నూ చేసింది. కొడుకు షణ్ముఖ.... ఇంకా చదువుతూనే ఉన్నాడు. గతంలోంచి  నడిచివచ్చిన దారిచూసుకుని.... ఇన్ని మైలు రైళ్ళు ఇంత ఒంటరిగానే కష్టపడి దాటి వచ్చానా?  అనుకుంటూ గతంలోకి అవలోకనం చేస్తే... @@@ స్వప్న చిన్న ప్రయివేట్ స్కూల్ టీచర్ గా పనిచేస్తూ, పిల్లలను చదివించటం తలకుమించిన భారమైపోయింది. ఆ సమయంలో ఓ మెసేజ్... " మీకు ఇబ్బంది కలిగించకుండా మీతో ఫ్రెండ్ షిప్ చేస్తే మీకేమయినా అభ్యంతరమా?! " అని. సమాధానం ఇవ్వలేదు స్వప్న. కొన్నాళ్ళు వాళ్ళే మెసేజెస్ పెట్టేసుకుని మానేస్తారులే అనుకుంది.. మానలేదు. పైగా అవతలి వారి వల్ల తనకు ఇబ్బందేం లేదు కాబట్టి....కంటిన్యూ చేసింది. తర్వాత ఫోన్ పే లో చిన్న మెుత్తంలో డబ్బులు రావటం మెుదలయింది. స్వప్నకి భయం వేసింది. ఒంటరి ఆడదాన్ని ఇలా ఆటపట్టించి... చివరిలో ఎమౌంట్ అంతా ఇమ్మంటే గతేంటి?! ఆలోచనలు పసిగట్టినట్లుగా.... "మీరు డబ్బులు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను మీ శ్రేయోభిలాషినే. " మెసేజ్. బ్యాంక్ ఎకౌంట్ నెంబర్ ద్వారా.. వివరాలు సేకరించే తెలివితేటలు, ఓపిక స్వప్నకు లేవు. తన చిన్నసంపాదనకు ఆ చిన్నమెుత్తాలూ జతకూడటంతో కొంత ఊరట.... గతంలోంచి బయటకువచ్చి.... "ఇన్ని సంవత్సరాలుగా,ఆదుకున్న అపరిచితులా (రాలా) మిమ్మల్ని ఓ సారి చూసి, మీకు నమస్కారం చేసుకోవాలని ఉంది. ప్లీజ్ దర్శనం ఇవ్వండి " మెసేజ్ పెట్టింది... Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/VDa4HlCekP4

Episode metadata supplied by the publisher feed · Published Oct 10, 2022

Embed this episode

NOW PLAYING

అనామిక | Anamika | Telugu Short Stories | Bhagavathula Bharathi | manatelugukathalu.com

0:00 6:44

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 6 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on October 10, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!