అందమైన పొదరిల్లు | Andamaina Podarillu | Telugu Short Story | Neeraja Hari Prabhala | manatelugukathalu.com episode artwork

EPISODE · Aug 14, 2023 · 3 MIN

అందమైన పొదరిల్లు | Andamaina Podarillu | Telugu Short Story | Neeraja Hari Prabhala | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

'Andamaina Podarillu' - New Telugu Story Written By Neeraja Hari Prabhala 'అందమైన పొదరిల్లు' తెలుగు కథ (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: నీరజ హరి ప్రభల (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ "ఏయ్ స్విగ్గీ!" ఈరోజు మన పెళ్లిరోజు కదా! సాయంత్రం ఏదైనా సినిమాకి వెళదామా"? అడిగాడు జొమాటో. "తప్పకుండా!" అంది స్విగ్గీ. సాయంత్రం ఇద్దరూ సరదాగా సినిమాకి వెళ్లి ఇంటికి వచ్చి కబుర్లు చెప్పుకుంటూ తమ ఫాస్ట్ ఫుడ్ ని కమ్మగా ఆరగించి హాయిగా నిద్రపోయారు. స్విగ్గీ, జొమాటో అన్యోన్యంగా కాపురం చేసుకుంటూ సంతోషంగా ఉంటున్నారు. వాళ్ల అన్యోన్యమైన కాపురాన్ని చూసి "ముచ్చటైన జంట" అని ఇరుగుపొరుగు అందరూ మెచ్చుకుంటున్నారు. చూస్తూ ఉండగానే ఏడాది గడిచింది. స్విగ్గీ గర్భవతి అయింది. జొమాటో ఫంక్షన్ ఏర్పాటుచేసి అందరికీ సంతోషంగా విందు ఇచ్చాడు. వచ్చినవాళ్లందరూ ఆ దంపతులను దీవించి కమ్మని విందు ఆరగించి వెళ్లారు. స్విగ్గీకి నెలలు నిండి సుఖప్రసవం జరిగి పండంటి కొడుకు పుట్టాడు. వాడికి "పొటాటో" అని పేరు పెట్టుకొని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. పొటాటో క్రమేణా పెరుగుతూ తన ముద్దుముద్దు మాటలతో, ఆటపాటలతో అందరినీ అలరిస్తున్నాడు. రోజులు గడుస్తున్నాయి. పొటాటోకి మూడు సం.. నిండగానే అక్షరాభ్యాసం చేసి దగ్గరలో ఉన్న మంచి స్కూలులో చేర్చారు స్విగ్గీ, జొమాటోలు. పొటాటో చక్కగా అక్షరాలు దిద్దుతూ శ్రధ్దగా చదువుకుంటున్నాడు. మరో రెండు సం.. లకు స్విగ్గీ గర్భం దాల్చింది. జొమాటో ఆనందానికి అవధులు లేవు. రోజులు ఆనందంగా గడుస్తున్నాయి. నెలలు నిండి సుఖప్రసవం జరిగి స్విగ్గీకి మరో కొడుకు పుట్టాడు. వాడికి "టొమాటో" అని పేరు పెట్టుకొని ప్రేమగా పెంచుకుంటున్నారు స్విగ్గీ, జొమాటోలు. తమ్ముడు పుట్టాడని సంబరంగా ఉంటున్న పొటాటో స్కూలు నుంచి రాగానే తమ్ముడిని ఎత్తుకొని ముద్దుచేస్తూ కాలం గడుపుతున్నాడు. టొమాటో క్రమేణా పెరిగి పెద్దవుతూ తన మాటలు, ఆటపాటలతో ఇంటిల్లిపాదినీ సంతోషపెడుతున్నాడు. టొమాటోకి మూడు సం.. నిండగానే అక్షరాభ్యాసం చేసి పొటాటో చదువుచున్న స్కూలులోనే టొమాటోను కూడా చేర్చారు స్విగ్గీ, జొమాటోలు. ప్రతిరోజూ పొటాటో, టొమాటోలు చక్కగా స్కూలుకు వెళ్లి వస్తూ చక్కగా చదువుకుంటున్నారు. కాలం గడుస్తోంది. ఇద్దరూ కష్టపడి చదువుతూ మంచిమార్కులతో పాసవుతున్నారు. రోజులు సాఫీగా గడుస్తున్నాయి. పొటాటో డిగ్రీ పాసయి బాంకు పరీక్షలు వ్రాసి బాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/fpAd10kVK_k

Episode metadata supplied by the publisher feed · Published Aug 14, 2023

Embed this episode

NOW PLAYING

అందమైన పొదరిల్లు | Andamaina Podarillu | Telugu Short Story | Neeraja Hari Prabhala | manatelugukathalu.com

0:00 3:46

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 3 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on August 14, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!