EPISODE · Jan 31, 2023 · 7 MIN
అనగనగా ఓ ప్రేమ కథ | Anaganaga O Prema Katha | Telugu Short Story | N. Dhanalakshmi | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) అనగనగా ఓ ప్రేమ కథ రచన: N. ధనలక్ష్మి (ఉత్తమ యువ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఊహ తెలిసినప్పటి నుంచి నేను కోరుకున్న నా ప్రేమ, నేను కోరుకున్న జీవితాన్ని ఈ రోజు అందుకుంటున్నా. ఇంకో గంటలో నా బావకి నేను సొంతం కాబోతున్నా. ‘ఐ లవ్ యూ’.. ‘ఈ మాట నా నోట వినాలని చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నావుగా.. నేను నీ సొంతం అయిన మరుక్షణం ఈ మాట చెపుతాను’ అంటూ అద్దంలో తనని తాను మరొకసారి చూసుకొని మురిసిపోతుంది రచన... తలుపు చప్పుడు అవ్వడంతో వెళ్ళి తీసిన రచన మొహం పై ఏదో పడింది.. అంతే మరుక్షణం తన ఆర్తనాదాలు విని కళ్యాణమండపం నుండి రెస్ట్ రూం వైపుకి చేరుకున్నారు బంధుగణం.. ‘అమ్మా.. మంట మంట... బావ.. బావ..’ అని ఏడుస్తున్న రచనను చూస్తూంటే అక్కడున్న వారికి కడుపు తరుక్కుపోతుంది.. రవి తనని తాను కంట్రోల్ చేసుకొని “రచనా! ఏమీ కాదు. భయపడకు” అంటూ తనని ఎత్తుకుని కార్లో కూర్చోపెట్టుకొని దగ్గర్లోనున్న హాస్పిటల్ కు తీసుకొని వెళ్ళాడు. రచన మొహం ఓ పక్క కొంత భాగం కాలిపోయింది. “అదృష్టం బాగుండి కళ్ళలో ఏమీ పడలేదు. మెడిసిన్స్ వాడుతూ తగిన స్కిన్ కేర్ తీసుకుంటే తను త్వరగా క్యూర్ అవుతుంది.. తను చాలా భయపడుతుంది..” అని డాక్టర్స్ చెప్పి వెళ్ళి పోయారు... ప్రాణాపాయం తప్పినందుకు అందరు సంతోషపడ్డారు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/QxKPGeoIQQw
Embed this episode
NOW PLAYING
అనగనగా ఓ ప్రేమ కథ | Anaganaga O Prema Katha | Telugu Short Story | N. Dhanalakshmi | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.