EPISODE · Jun 24, 2023 · 13 MIN
అణువణువున జ్వలించిన ఓ హృదయాన - 12 | Anuvanuvuna Jwalinchina O Hrudayana - 12 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Anuvanuvuna Jwalinchina O Hrudayana - 12' New Telugu Web Series Written By Pandranki Subramani 'అణువణువున జ్వలించిన ఓ హృదయాన - 12' తెలుగు ధారావాహిక రచన : పాండ్రంకి సుబ్రమణి (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఈసారామె దీర్ఘంగా ఊపిరి పీల్చుకుని చెప్పనారంభించింది--“ఒక రోజు కాలేజీలోని అన్ని బ్లాకుల వాళ్లమూ ఎక్స్ కర్షన్ కని నల్లమల అడవుల ప్రాంతం వేపు వెళ్ళాం. మా టీము లీడర్-- మా సీనియర్ లెక్చరర్ కలసి రూపొందించిన ప్రణాళిక ప్రకారం-- ఒక అడ్వంచర్ గా తీసుకుని--- కాళ్ళు సలుపెక్కేంత వరకూ చుట్టుప్రక్కలంతా తిరిగొచ్చాం. కొండలెక్కాం-- గుట్టలెక్కాం. చిన్నచిన్న కొండవా గుల్లో అరకొరగా మునిగి తడిసాం కూడాను. అటుపిమ్మట కొందరు గిరిజన మహిళలతో ఫోటోలు కూడా దిగి గెస్ట్ హౌస్ చేరాం. అలవాటు లేని తిరుగుడేమో చచ్చేంత రీతిన అలసి పోయాను. కాలు కదపడం మాట అటుంచి నోట మాట కూడా పెగలడం కష్టమని పించింది. ఇక దొరికింది కతికి వెంటనే గదుల్లోకి వెళ్ళి పోవాలన్న యావతో గెస్ట్ హౌస్ వెనుక ఉన్న చావడిలో కూర్చుని అందరమూ కలసి భోజనాలు చేయ నారంభించాం. అప్పుడు జరిగిందది. కొందరు దుర్మార్గులు ఎన్నాళ్ళనుండి పచ్చపాముల్లా పొంచి ఉన్నారో, ఎన్నాళ్ళుగా నన్ను ఫాలో చేస్తున్నారో తెలియదు; నేను చేతులు కడుక్కుని వచ్చేటప్పటికి నా కోసం పెట్టిన పండ్ల రసంలో మత్తుగొల్పేదేదో కలిపారు. నేనేమి బ్రహ్మజ్ఞానం గల మునికన్యను కాను కదా! అది మత్తు మందు కలిపిన పానీయమని తెలియకుండా అంతా తాగేసి ఆ తరవాత దొరికింది కతికి వాళ్లతో బాటు చేరి కాసేపు జోకులు వేసుకుని లేచి కాంతి సరిగ్గా ఆనని నడవలోకి వచ్చేటప్పటికి ముఖం తిరగనారంభించింది. చూపు మసక బారనారింభించింది. నా కోసం మాటు వేసిన మేల్ స్టూడంట్సు కొందరు నన్ను ఫాలో చేస్తున్నారన్నది నాకు తెలియనే లేదు. నేను గాలిలో తేలుతూ నేలపైన పడటానికీ---వాళ్లు నన్ను ప్రక్కనున్న పొదల్లోకి యెత్తుకుపోవడానకీ అట్టేసేపు లేదు. గిర్రున తిరుగుతూన్న బుర్రను రెండు చేతులతోనూ పట్టుకుని కన్నూ మిన్నూ తెలియని పరిస్థితిలో ఒరిగి పోతున్నప్పుడు-- తన గదివేపు నడచి అటు వెళ్లిపోతూన్న పవన్ కు కుమార్ అక్కడికి చేరుకుని నన్ను పొదవి పట్టుకుని లేవనెత్తాడు. అటుతరవాత యేమయిందో నాకు కొంచెం కూడా గుర్తుకు రాలేదు. అయితే పవన్ కుమార్ రూపం మాత్రం కనురెప్పలమధ్య చిక్కుకుపోయింది. తెల్లారి కళ్లు విప్పి చూస్తే మసక వెలుతురులో గది అంతా గిర్రున తిరుగుతున్న ట్లనిపించింది. తల భారం ఇంకా తగ్గనట్లే ఉంది. అంటే ఆ ధూర్తులు నా కన్నెతనాన్ని దోచుకోవడానికి నా పండ్ల రసంలో కలిపింది మామూలు లిక్కర్ చుక్కలు కాదన్నమాట! ఇంకేదో తీక్షణమైనదేదో కలిపుంటారు. ఆ వేకువ మసక కాంతిలో నాకు అప్పుడు గాని గ్రాహ్యం కాలేదు-- నేను మరొకరి గదిలో ఉన్నానని. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/vMZbHcJRIZA
Embed this episode
Ready to play
అణువణువున జ్వలించిన ఓ హృదయాన - 12 | Anuvanuvuna Jwalinchina O Hrudayana - 12 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.