EPISODE · Jul 1, 2023 · 14 MIN
అణువణువున జ్వలించిన ఓ హృదయాన - 13 | Anuvanuvuna Jwalinchina O Hrudayana - 13 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Anuvanuvuna Jwalinchina O Hrudayana - 13' New Telugu Web Series Written By Pandranki Subramani 'అణువణువున జ్వలించిన ఓ హృదయాన - 13' తెలుగు ధారావాహిక రచన : పాండ్రంకి సుబ్రమణి (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) మూడవ రోజు ఊరు చేరి డ్యూటీలో చేరిన అశ్వథ్ చేసిన మొదటి పని ఖైదీ నెంబర్-టూ జీరో త్రీని తనుంటూన్న స్టాఫ్ క్వార్టర్సుకి పిలిపించుకు రమ్మని అడ్మినిస్ట్రేటివ్ వింగ్ ద్వారా కబురందించడం. కాని పవన్ కుమార్ బ్యారెక్సు లో లేడని అతడికి సుస్తీగా ఉందని మెడనరాలు బాగా పట్టేయడం వల్ల కదల్లేని స్థితిలో ఉన్నాడని, క్లీనిక్ నుంచి వచ్చింతర్వాత యింటికి పంపిస్తానని, కావాలంటే మరొకరిని పంపిస్తానని సెంట్రీల ద్వారా చీఫ్ వార్డెర్ బదులు పంపించాడు. పవన్ కుమార్ ఆరోగ్య పరిస్థితి నయంగా ఉంటే మరునాడు అతణ్ణి మాత్రమే ఇంటికి పంపించమని ఆదేశాలందించాడు డిప్యూటీ జైలు సూపరింటెండెంటు అశ్వథ్. పవన్ కుమార్ మరునాడు కూడా రాలేకపోయాడు. మెడ నరాలు పట్టడం మాటలు కాదు కదా! అంచేత రెండవ రోజు వస్తానని కబురు అందించాడు; సమయానికి రాలేకపోయినందుకు క్షమాపణలు కోరుతూ--పెరట్లోని తోట పని చూసుకోవడానికి ఎయిర్ ఓపెన్ జైలు నుండి ఎవరో జైలు ఖైదీని కొడుకు సరాసరి ఇంటకి పిలిపిస్తున్నాడని తెలుసుకున్న భరతమ్మ రుసరుస లాడింది. “కొరివితో తల గోక్కోవడం కాకపోతే ఎప్పుడూ లేని ఈ కొత్త వ్యవహారమేమిటిరా అశ్వథ్! “తల్లి మనసులో తారట్లాడుతూన్న సందేహాన్ని గ్రహించిన అశ్వథ్ దగ్గరకు వచ్చి వివరించాడు-“ఆ టూ జీరో త్రీ ఉన్నాడే-అతడు అందరివంటి వాడు కాదమ్మా! అతడు గాని డేంజర్ మనిషయితే అతణ్ణి అసలు ఓపెన్ జైలుకు రప్పించే వాళ్లమే కాదుగా! బాగా పధ్ధతుల నిర్వహణలో ఫిల్టర్ చేయబడి సెలెక్ట్ చేయబడ్డ వ్యక్తి. చదువుకున్నవాడు కూడాను. అతడికి హార్టి కల్చర్ కోర్సులో ప్రవేశం ఉంది. తోట పని పచ్చగా కళాత్మకంగా చేస్తాడు. పాదులు వేయడం బాగా వచ్చు. మునుపేమో-మంగళ దగ్గరుండి పూల చెట్లూ పండ్ల చెట్లూ చూసుకునేది. కొమ్మల ట్రిమ్ముంగ్ కూడా చేసుకునేది. ఇప్పుడు మంగళ తన గురువుగారి ఆధ్వర్యంలో లీగల్ ట్రైనింగులో పుట్ట మునిగి ఉందిగా! నేనేమో-పని రద్దీలో పడ్డానాయె--పెరడులో కాలు మోపి వారాలు దాటుతూంది. మొన్నవాళ్లింటికి వెళ్తే ఇంటి తోట చూసుకొమ్మని పదే పదే చెప్పింది మంగళ. మొన్నేమో-మా కొలీగ్ ఒకతను నాకు ప్రత్యేకంగా ఫుట్ బాట్ లిల్లీ అనే పూలమొక్కను కానుకగా ఇచ్చాడు. దానికి కుదురుగా పాదులు వేసి నాటకపోతే-అది వాడి నేల కొరిగిపోతుంది. అది గాని తెలిస్తే మంగళ తెగ నొచ్చు కుంటుంది. అంతే కాదు. ఖైదీల దినసరి భత్యాలలో కూడా వ్యత్యాసం ఉంటుంది. మామూలు కామాటి పనులు చేసేవాళ్ళకు ఇరవై ఇస్తే ఓపెన్ జైలు ఖైదీలకు ఇరవై ఐదు, ఎందుకంటే వీళ్లు పనితనం గల ఖైదీలమ్మా! జైలు నిర్వహణకు రాబటి తెచ్చే నిపుణులమ్మా-- ” Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/TwcCqVmuUrA
Embed this episode
Ready to play
అణువణువున జ్వలించిన ఓ హృదయాన - 13 | Anuvanuvuna Jwalinchina O Hrudayana - 13 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.