అణువణువున జ్వలించిన ఓ హృదయాన - 14 | Anuvanuvuna Jwalinchina O Hrudayana - 14 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com episode artwork

EPISODE · Jul 6, 2023 · 15 MIN

అణువణువున జ్వలించిన ఓ హృదయాన - 14 | Anuvanuvuna Jwalinchina O Hrudayana - 14 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Anuvanuvuna Jwalinchina O Hrudayana - 14' - New Telugu Web Series Written By Pandranki Subramani 'అణువణువున జ్వలించిన ఓ హృదయాన - 14' తెలుగు ధారావాహిక చివరి భాగం రచన : పాండ్రంకి సుబ్రమణి (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఎట్టకేలకు దించిన తలను పైకెత్తి చూసాడు పవన్ కుమార్. అశ్వథ్ నవ్వు ముఖం కనిపించిందతడకి. “అంతేకాదు. మీ పైన ప్రయోగించిన కఠినమైన ఐ. పి. సి. సెక్షన్లనూ మంగళ స్వీకరించలేక పోతూంది. సెక్షన్ 376 సెక్షన్ ప్రకారం మీరు మైనారిటీ తీరని బాలికపై అత్యా చారం చేసారు. ఐ. పీ. సీ. 363 అండ్ 373 సెక్షన్ల ప్రకారం కిడ్నాప్ చేసారు. అబ్డక్షన్ చేసారు. సెక్షన్ 498 ప్రకారం మానసిక శారీరక వేధింపులకు పాల్పడ్డారు. వీటిలో కొన్ని అతిగా లేక ఉద్దేశ్య పూర్వకంగా బనాయించి ఉండవచ్చు. కాని- అన్నీ తప్పుడు కేసులని వాదించడం సబబు కానేరదూ కదా!" అశ్వథ్ ఇంకా నవ్వుతూనే తానుగా వివరించాడు. పవన్ కుమార్ కాసాపాగి మాటల్ని కూడదీసుకుని స్పందించాడు- “మీరడిగారు కాబట్టి చెప్తున్నాను సార్! ఇటువంటి కేసులు మన దేశం మొత్తం మీద- 3515 ఉన్నాయి సార్. కాని ఇటువంటి కేసులతో నాకు ఎటువంటి సంబంధమూ లేదండి. - ఒక్కటి తప్ప- శ్రీనిత్యతో శారీరకంగా సంపర్కించడం తప్ప-- ఇక గ్రహపాటో మరేమిటో నాకు తెలియదు గాని- అంతా నా యిష్టం ప్రకారమే జరగలేదండి“ “అంటే- ఆడదాని పట్ల నీకు వాంఛ కలగదంటావు. ఋషి పుంగవుడి మల్లే విషయ వాంఛలనుండి తొలగి పోగలనంటావు. అంతేనా!" “నో సార్! నేనలా అనడం లేదు. శ్రీనిత్యలోని స్త్రీత్వం నిండుగా వికసించి ఉండటాన ఆమె మైనర్ గార్ల్ అన్న ఆలోచన నాకెప్పుడూ కలగలేదు. లేత వయసులో మైనారిటీ తీరకముందే ఒక అమ్మాయికి అంతటి పొంగులూరే అంగసౌష్ఠవం కలగాలంటే రెండే కారణాలుంటా యి సార్. ఒకటి- అనువంశిక శరీరతత్వం- శ్రీనిత్య తల్లి విదేశీ స్త్రీ- రెండవది- బొటాక్స్ వంటి హార్మోన్ ఇంజెక్షన్ ప్రభావం. మరొక వాస్తవం కూడా ఉందిసార్. దయచేసి గుర్తించడానికి ప్రయత్నించండి.!" “చెప్పు పవన్. వాస్తవాలను గుర్తించడానికి నేనెన్నడూ వెనుకాడను" “ థేంక్స్ సార్. ఉన్నదున్నట్లు చెప్తున్నాను. మంగళాదేవి గారి భర్తగా మీముందుంచుతున్నాను. నేనుగా నేనెప్పుడూ శ్రీనిత్యకు చేరువు కావడానికి ప్రయత్నించలేదు. ఆమె ఉంటున్నదేమో ఎదురు కట్టిడంలో. కాని నాతో మాటలు పెంచుకోవడానికి ఏదో ఒక నెపంతో నా రూము వైపు వచ్చి పలకరించేది. పుస్తకాలు అడిగి తీసుకు వెళ్ళేది. వాలు చూపులతో కాటేసేది. దాదాపు నేను శారీరకంగానే కాక ఎమోషనల్ గా ప్రవోక్ చేయబడ్డాననే చెప్పాలి” Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/S8nqTO5OCcI

Episode metadata supplied by the publisher feed · Published Jul 6, 2023

Embed this episode

Ready to play

అణువణువున జ్వలించిన ఓ హృదయాన - 14 | Anuvanuvuna Jwalinchina O Hrudayana - 14 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com

0:00 15:15

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 15 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on July 6, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!