EPISODE · May 26, 2023 · 13 MIN
అణువణువున జ్వలించిన ఓ హృదయాన - 7 | Anuvanuvuna Jwalinchina O Hrudayana - 7 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Anuvanuvuna Jwalinchina O Hrudayana - 7' New Telugu Web Series Written By Pandranki Subramani 'అణువణువున జ్వలించిన ఓ హృదయాన - 7' తెలుగు ధారావాహిక రచన : పాండ్రంకి సుబ్రమణి (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఇంటివాకిట సూటుకేసునీ ట్రావెలింగ్ బ్యాగునీ రెండుచేతులా పట్టుకుని ఆటోరిక్షానుండి దిగుతూన్న కూతుర్ని చూసి, ముంగిట కసవు ఊడుస్తూన్న ఊర్మిళాదేవి అశ్చర్యంగా- “ఆ వచ్చేది మంగళేనా!” అన్నట్టు కళ్ళు పెద్దవి చేసుకుని చూసింది. రిక్షా అతనికి చార్జీ చెల్లించి వాకిట వరకూ వచ్చి నిల్చున్న కూతుర్ని చూసి ”మంగళాదేవే!” అని తేల్చుకుంటూ ఎదురెళ్ళి చేతినుండి సూటుకేసుని అందుకుని- “అదేంవిటే అలా చెప్పాచెయ్యకుండా వేడి నీళ్లు పోసుకున్నట్టు వచ్చేసావు! కబురంపితే మీ నాన్న బస్టేషనుకి వచ్చి తీసుకురారూ?” అని అడిగింది. ఆమె పైకి యథాలాపంగా మామూలు వ్యవహారంలా ముఖం పెట్టి అడిగిందే గాని, లోలోన గొంతు ముడి వద్ద గజి బిజి ఊహలు ఒక్క పెట్టున చెలరేగుతూనే ఉన్నాయి. స్వతస్సిధ్ధంగా కూతురుది యెంతటి మృదు స్వభావమో;విషయం ఏదైనా బెడిసి కొడితే అంతే మోతాదున హృదయావేశమూ చూపిస్తుంది. అంతు తేల్చుకోనిదే ఒక పట్టాన విడిచి పెట్టదు. వియ్యంకురాలి గురించి తనకు తెలుసు. మంగళకు భరతమ్మ అత్తకాదు-స్వంత తల్లే. మరి నేడు ముందస్తు కబురు కూడా లేకుండా-యుధ్దం కాని యుధ్ధం వంటి సరిహద్దు ఫిరంగి మోతలా పుట్టింట్లో దిగిందంటే మెట్టింట పుట్టి మునిగిందన్న మాటేనేమో! ఎక్కడో ఏదో ఎడారి సుడిగుండమే చెలరేగి ఉంటుంది. పుట్టిల్లు ఎంతదగ్గ రైతే మటుకు భర్తతో చేతులు జోడించి వచ్చి ఉంటే అది వేరే విషయంగా ఉండదూ! కనుల పండువుగా కనిపించదూ! మంగళ పెదవి విప్పలేదు. బదులివ్వ లేదు. కుడిచేతనున్నట్రావిలింగ్ బ్యాగుని ఇంట్లోపల ఉంచి, మళ్ళీ గడప దాటి బైటకొచ్చి తీరుబడిగా రెండుచేతుల్నీ నడుం పైన ల్యాండింగ్ చేసి కుదురుగా చూపులు నిలిపి స్పందించింది- “ఏం?నేను నా పుట్టింటికి రావాలంటే జయభేరి మ్రోగిస్తూ బుచ్చెర పాలెం బూర ఊదుకుంటూ యేతెంచాలా!పెళ్లయినంత మాత్రాన మేకు కొట్టి దిగేసిన అమ్మవారి పటంలా మెట్టింట్లోనే పడి ఉండాలా? మీ అల్లుడిగారికున్నట్లే నాకు మాత్రం స్వంత పనులేవీ ఉండకూడ దంటారా?“ ఈసారి ఊర్మిళాదేవి గుండెల్లో నిజంగానే ఏదో కలుక్కుమన్నట్లయింది. కూతురు అంత నిదానంగా హుం దాగా చెక్కుచెదరని ముఖ భావంతో స్పందిస్తుంటే- చెరువు నీళ్ల పైన కనిపించేంత ప్రశాంతత కూతురు లోలోన లేదేమో! తల్లి కళ్లలోని అనుమానపు చూపులు- ముఖాన తాండవించిన సందిగ్ధాస్థ చూసి మంగళ చల్లబడింది. కూతుళ్ళ కాపు రాల గురించి తల్లులందరూ చూపించే వ్యాకులత మామూలేగా! ”అలా బెంబేలు పడిపోయి చూడకమ్మా అదేదో అప్రకటిత పోరు ఆరంభమైనట్టు! నీ కూతుర్ని. నీ కడుపున పుట్టిన దానిని. నేనెలా తొందరపడి వచ్చేస్తాననుకుంటున్నావు? మా అత్తమ్మ నాకు బాగా దోస్త్. ఆమెతో నేనెందుకు పేచీ పూచీ పెట్టుకుని వస్తాను? ఆయన ప్రోత్సాహంతోనే నేను యాక్టివ్ సర్వీస్-లీగల్ సర్వీస్ చే యడానికి పూనుకున్నాను. ఆ మాటకొస్తే, నా “లా” పుస్తకాలన్నీ ఇంట్లోనేగా పడున్నాయి. చదివిన లీగల్ కేసులన్నిటినీ రివైజ్ చేసుకొని, ప్రొసిడ్యరల్ “లా” ని రిఫ్రెష్ చేసుకోవాలి. ఇవన్నీ స్వంతంగా నాకు నేనుగా చేసుకునే పనులు కావు. నేను చదివిన కాలే జీలోనే ఫ్రొఫెసర్ గా ఉండి రిటైరయిన పిదప స్వంతంగా ‘లా’ ఫాం పెట్టుకుని లీగల్ కన్ సల్టేషన్ సర్వీసు చేస్తూన్న మా గురువు గారి వద్ద ట్రైనీ -కమ్-అసిస్టెంటుగా చేరబోతున్నాను. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/Sn2y5TzGfCU
Embed this episode
Ready to play
అణువణువున జ్వలించిన ఓ హృదయాన - 7 | Anuvanuvuna Jwalinchina O Hrudayana - 7 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.