EPISODE · May 31, 2023 · 15 MIN
అణువణువున జ్వలించిన ఓ హృదయాన - 8 | Anuvanuvuna Jwalinchina O Hrudayana - 8 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Anuvanuvuna Jwalinchina O Hrudayana - 8' New Telugu Web Series Written By Pandranki Subramani 'అణువణువున జ్వలించిన ఓ హృదయాన - 8' తెలుగు ధారావాహిక రచన : పాండ్రంకి సుబ్రమణి (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) అశ్వథ్ ఆ రోజంతా జైలు వ్వవహారాలలో గొంతు ముడివరకూ మునిగిపోయాడు. అతడి పరిస్థితి ఎంత రద్దీగా తయా రయిందంటే; శరీరమంతటా అలసి సొలసిపోయి చివరి బొట్టు వరకూ ప్రాణసారాన్ని కోల్పోయి ఒరిగి పోయిన ఎడారి మొక్కలా- నిర్వీర్యంగా తయారయాడు. అక్కడ జరిగిందేమంటే-- స్పెషల్ సెక్యూరిటీ జోన్ లోని కొందరు హార్డ్ కోర్ ఖైదీలకు ఎవరో ఆగంత కులు అసాంఘిక శక్తులతో కలసి అడ్డదారిన సెక్యూరిటీ సెంట్రీల కనుగప్పి జైలు మాన్యువల్ కి విరుధ్దంగా సెల్ ఫోన్లు అందిచ్చి వెళ్ళిపోయారు. అలా అక్రమంగా సెల్ ఫోన్లు అందిచ్చి హార్డ్ కోర్ నేర వ్యవస్థల గొలుసుకట్టుని పునరుధ్ధ రించడానికి బహుళార్థ పధక రచన చేసారు. దానికంటే సీరియస్ విషయం- టెర్రర్ సంస్థలతో సంబంధాలున్నాయన్న ఆరోపణలు ఎదుర్కుంటూన్న నిందుతుల వద్ద రికార్డడ్ మెసేజ్ లతో అత్యాధునిక స్మార్ట్ సెల్ ఫోన్లు దొరకడం.. ఆ వార్త పొక్కిన వెంటనే జైలు వాతావరణ మంతా ఉడకబెట్టిన బంగాళా దుంపలా వేడెక్కి పోయింది. అధికార గణమంతా బిర్రబిగుసుకు పోయింది. వార్త సోకిన నగరం ఉలిక్కిపడి లేచి నిల్చుంది. స్టేట్ క్రైం బ్రాంచీ సీనియర్ ఆఫీసర్లతో బాటు యాంటీ టెర్రరిస్ట్ టాస్క్ ఫోర్సువాళ్లు- తెరలు తెరలుగా వచ్చి అలలు అలలుగా క్వరీలు లేవదీసి జైలు సూపరింటెండెంట్ చేంబర్ని దుర్బేధ్య చీకటి గుహలా మార్చేసారు. నలువైపులా కుమ్మేసారు. వాళ్ల హడావిడికి అశ్వథ్ కి తీవ్రమైన అసహనం కలగక పోలేదు. కాని- నిభాయించుకున్నాడు. అది వాళ్ల కర్తవ్యం. వాళ్లు దానికోసమేగా ఉన్నారు. తను కూడా వాళ్ల స్థానంలో ఉంటే అదేగా చేసేవాడు! Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/V-cSbnMAJmw
Embed this episode
Ready to play
అణువణువున జ్వలించిన ఓ హృదయాన - 8 | Anuvanuvuna Jwalinchina O Hrudayana - 8 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.