EPISODE · Jun 20, 2022 · 7 MIN
అంతర్మథనంలో సంధి కాలం | Antharmathanamlo Sandhi Kalam | Telugu Short Story | P Dinakar Reddy | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) అంతర్మథనంలో సంధి కాలం పి. దినకర్ రెడ్డి ఇందులో తన తప్పేముంది మేడమ్? వీణను ఓదారుస్తూ అడిగింది శైలజ. ప్రిన్సిపల్ మేడమ్ కళ్ళజోడు సరి చేసుకుని చుట్టూ చూసింది. ఆ కిషోర్ ఒక మొండి వెధవ. పైగా ఇది ర్యాగింగ్ అని కూడా చెప్పలేం శైలజా అంది. మళ్లీ ఒక్కసారి చూడండి మేడమ్. క్లాసులో ఉండగానే వీణ ఫోటో తీసి, వాళ్ళు తన శరీరాన్ని ఎలా అనుభవించాలి అనే తమ కోరికల్ని సిగ్గు లేకుండా డిస్కస్ చేస్తున్నారో చూడండి అంటూ ఒక వాట్సాప్ గ్రూప్ లో జరిగిన చాటింగ్ స్క్రీన్ షాట్ చూపించింది శైలజ. గట్టిగా అరిచి ఆ అమ్మాయిని ఇంకా అల్లరి చెయ్యడం సబబా. వాళ్ళ పర్సనల్ వాట్సాప్ గ్రూపులో మాట్లాడుకున్న విషయాల గురించి సీరియస్గా తీసుకోకపోవడం మంచిది. అమ్మాయ్! ముందు నువ్వు క్లాసుకు వెళ్ళు అంటూ వీణను పంపించింది ప్రిన్సిపల్ మేడమ్. శైలజా! కిషోర్ చేసిన పనిని నేను సమర్థించడం లేదు. కానీ కొన్ని విషయాలు మనం చూసీ చూడనట్టు వదిలేయాలి. లేదంటే అవి అందరినీ ఇబ్బంది పెడతాయి అని చెప్పి లెక్చరర్ శైలజను కూడా పంపించింది. ప్రిన్సిపల్ మేడమ్ కళ్ళల్లో తడి చూసాక శైలజ ఏమీ మాట్లాడలేదు. ఆ కళ్ళలో అశక్తత.. శైలజకి కారిడార్లో కనిపించాడు కిషోర్ మిడిగుడ్లు వేసుకుని. నువ్వు నన్ను ఏమీ చేయలేకపోయావు అనే గర్వం వాడి కళ్ళల్లో కనిపించింది. ప్రిన్సిపల్ మేడమ్ భయపడ్డారు అంటే ఆ కిషోర్ తండ్రికి రాజకీయ పార్టీ అండ దండలు ఉన్నాయి అనే కదా. అశక్తత.. ఇంటర్మీడియెట్, డిగ్రీ చదివే ఈ పిల్లలు అమ్మాయిని ఆట వస్తువుగా చూడడం ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నారు? ఇంటి నుంచా? సమాజం నుంచా? తనేమీ చెయ్యలేక తల దించుకుంది. అశక్తత. అంతర్మథనం చేసుకున్న ప్రతీసారీ అశక్తత పలకరిస్తుంది. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/ys1KBQLcAZ4
Embed this episode
NOW PLAYING
అంతర్మథనంలో సంధి కాలం | Antharmathanamlo Sandhi Kalam | Telugu Short Story | P Dinakar Reddy | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.