EPISODE · Jan 17, 2023 · 21 MIN
అంతర్ముఖం | Antharmukham | New Telugu story | Indira Veldi | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) అంతర్ముఖం రచన: ఇందిర వెల్ది (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) నేను వృద్ధాశ్రమంలో చేరి రేపటికి మూడు సంవత్సరాలవుతుంది. నా పేరు ఎల్లయ్య బాబు. రెవెన్యూ డివిజనల్ అధికారిగా పని చేసి రిటైర్డ్ అయ్యాను. నాకు ఇద్దరమ్మాయిలు. ఇద్దరికీ పెళ్ళిళ్ళు చేశాను. నా భార్య నాలుగు సంవత్సరాల క్రితం గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ తో చనిపోయింది. నాకూ బిపి, షుగర్. పైగా ఎయిడ్స్ తో బాధపడుతూ ఒంటరిగా ఉంటే కష్టమని తలచి ఇదిగో ఈ ఓల్డేజ్ హోమ్ లో జాయిన్ అయ్యాను. నా పిల్లలు అప్పుడప్పుడూ వచ్చి చూసి వెళుతుంటారు. ఎప్పుడు పోతానో తెల్వదు. ఇంత కాలం బ్రతికానంటే కారణం? నేను ప్రతిరోజూ ఎక్సర్ సైజులు, యోగా చేయబట్టేనేమో! నాకు వ్యక్తిగత సహాయకునిగా గిరిధర్ ను నియమించారు ఆశ్రమం వాళ్ళు. అతడు ఏ పనైనా పద్ధతిగా చేస్తాడు. చాలా తెలివిగలవాడు. ఆశ్రమంలోని ప్రతి మొక్కను, చెట్టునూ వర్ణించి చెబుతాడు, ఏవి ఎప్పుడు పూస్తాయో, ఎప్పుడు వాడుతాయో వివరిస్తాడు. కానీ ప్రతి రోజూ రాత్రి తన గదిలోకి వెళ్ళి గొల్లుమని అరగంటైనా ఏడుస్తాడు. ఆ సమయంలో ఎవ్వరు ఆగబట్టినా ఆగడు. ఇదే నేను వచ్చినప్పటి నుండి గమనిస్తున్న విషయం. ఈ వేళ నేనూ, తనూ కలిసి ఉదయాన్నే దగ్గరలో ఉన్న పార్కుకు వెళ్ళాము. చాలా ముభావంగా కనిపించాడు. ఇవ్వాళ తన పెళ్ళి రోజట. ఏమనుకున్నాడో ఏమో కానీ నేను అడగకముందే తన కథ చెప్పడం ప్రారంభించాడు. తన తల్లిదండ్రులకు తాము పదిమంది సంతానమట. తనే ఆఖరివాడట. పెద్ద వాళ్ళందరూ తలో పని చేసుకుని బ్రతుకుతున్నారట. తనేమో! మొక్కల పెంపకాన్నే వృత్తిగా పెట్టుకుని నర్సరీ నడుపుతుండేవాడట. అతని భార్య కూడా ఇంటర్ చదివిందట. చాలా తెలివికలదట. తనకు కాస్త ఎక్కువగా డబ్బు, నగలు, బంగళాలు, వాహనాల మీద మోజట. ఏదో భగవంతుని దయ వలన ఏదో ప్రభుత్వ శాఖలో అటెండర్ గా ఆమెకు ఉద్యోగం వచ్చిందట. గిరిధర్ ఏమీ అందగాడు, ఆజానుబాహుడు కాదు, కురచనైన, చిన్న దేహం. పైగా ఇరవైనాలుగు గంటలూ పనిలోనే ఉండి సరిగ్గా తినేవాడు కాదట, ఫలితంగా కృషించిన శరీరంతో ఉంటాడు. మొత్తానికి తన కష్టం వలన ఓ ఇల్లు కట్టుకోగలిగాడు. ఇక అటెండర్ గా చేరిన అతని భార్య ఆఫీసులో హోదా, దర్పంతో వెలిగిపోతున్న అధికారులకు కొందరికి అన్నీ సమర్పించుకుని ఆనందం పొందటం మొదలు పెట్టిందట. అంతటితో ఆగితే బాగుండేది. రాజును చూసిన కళ్ళతో మొగున్ని చూసి మొత్తుకున్నట్లుగా డాబు, దర్పంతో వెలిగిపోయే అధికారులను చూసిన కళ్ళతో మట్టి పిసుక్కుంటూ, మాసిన బట్టలతో కనిపించే మొగుడు, మొగునిగా కనిపించలేదట ఆమెకు. సంసారం చేయడం పూర్తిగా మానేసిందట. భర్త బట్టలు ఉతకడం, భర్తకు అన్నం పెట్టడం, ఆలనాపాలనా చూడటం పూర్తిగా మానేసిందట. పిల్లలూ తనవైపే, ఎందుకంటే? Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/sjXRWG5c_b0
Embed this episode
NOW PLAYING
అంతర్ముఖం | Antharmukham | New Telugu story | Indira Veldi | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.