Anuvanuvuna Jwalinchina O hrudayana 1 | అణువణువున జ్వలించిన ఓ హృదయాన 1 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com episode artwork

EPISODE · Apr 23, 2023 · 17 MIN

Anuvanuvuna Jwalinchina O hrudayana 1 | అణువణువున జ్వలించిన ఓ హృదయాన 1 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) అణువణువున జ్వలించిన ఓ హృదయాన-1 రచన : పాండ్రంకి సుబ్రమణి (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత) కొత్తగా పదోన్నతి పొందిన డిప్యూటీ జైలు సూపరింటెండెంట్ అశ్వథ్ జీపులో ఇంటిముందు దిగి, రేపటి డ్యూటీ టైమింగ్సు విషయమై డ్రైవింగు ఆర్డర్లీకి సూచనలిచ్చి యింట్లోకి నడిచాడు. అతడిల్లు మరెక్కడో కాదు, జైలు ఆవరణకు ఆవల దక్షిణానికి కడపటి వేపే స్టాప్ క్వార్టర్సు. అతణ్ణి చూసి సెంట్రీలిద్దరూ ఫుల్ ఫోర్సుతో సెల్యూట్ చేసి ప్రక్కలకు తప్పుకున్నారు. హాలు గడపవద్దాగిన అశ్వథ్ తనొచ్చిన అలికిడి చేరలేదేమోననుకుని బూట్లు విప్పి లోపలకు నడిచాడు; సతీమణి సుందర రూప దర్శనార్థం-- తల్లి భరతమ్మ జాడ దరిదాపున కనిపించలేదు. యూనిఫాం పై షర్టు గుండీలు వదులు చేసి గదిలోపలకు ప్రవేశించాడు. ఏదో కారణం లేకుండా తన భార్య- ఆ మాటకొస్తే రసవాహిని- మందగమని అయిన ఏ స్త్రీ అయినా- బెట్టు చూపించదని ప్రేమ మందిరానికి మరొక రూపమైన తన రసిక హృదయానికి తెలుసు. హాలు నలువైపులా సుమధుర సుమదళ కుసుమాల సువాసనలు-- “ఇది మల్లియలు విరిసే కాలం, మగువలు విరబూసి నవ్వే తరుణం! “మరి మంగళకు-- అందాలు ఆరబోసే మృదువైన సాయం సమయం! విల్లులాంటి నడుముని వయ్యారంగా వంచి, సుకుమార విగ్రహాన్ని విపంచిలా విప్పార్చి నిలువుటద్దం ముందు నిల్చుని తలంటుపోసుకున్న ఇరుల కురులను వదులుగా జారవిడిచి- చిక్కు ముడుల్ని బ్రష్ తో సుతారంగా విడదీసుకుంటూ కనిపించింది. మొగుడి రాకే తెలియని భామామణిలా కాసేపాగి, నుదుట బొట్టు దిద్దుకుని తీరిగ్గా నవ్వే చిలిపి కళ్ళతో తలతిప్పి చూసింది. భార్య అందానికి డంగైపోయిన అశ్వథ్- “వావ్! ”అనబోయి ఆపుకున్నాడు. కొందరి అందచందాలు అటువంటివి మరి. తినగ తినగ వేము తీయగనున్నట్టు చూడగా చూడగా సొగసులు ఊరిస్తుంటాయి. ఇనుమడిస్తుంటాయి. “అదేమిటి పెళ్ళాన్ని కొత్తగా చూస్తున్నట్టు అలా ఒలిచి ఒలిచి చూస్తున్నారు? అంతటి వేడి చూపులు భరించలేను బాబూ! కొవ్వొత్తినై కరిగిపోతాను. నిలువెత్తు మైనపు బొమ్మనై ఒరిగిపోతాను“అతడికి తెలుసు- అది తనను సుతారంగా రెచ్చగొడ్డటానికి విసిరిన మొదటి వలపు హొయల బ్యూమ్ రాంగ్- అని. ఆ తరవాత యెగుర వేస్తుంది విరహ దాహపు నిస్సవ్వడి నిట్టూర్పుల విహంగాన్ని. కనురెప్పల్ని అల్లార్చకుండా మంగళను తేరిచూసాడు అశ్వథ్. తాకీ తాకని వెస్ట్రెన్ మేకోవర్ డ్రెస్సులో కళ్ళను జిగేలు మనిపిస్తూంది, ప్రవరాఖ్యుడి మనసుని గజిబిజి చేసిన గాంధర్వకన్య వరూధినిలా-- తాజాగా అరవిచ్చిన సంపెంగి పూవులా వికసించి మగడి మగటిమిని ఇముడ్చుకోవడానికి తహతహ లాడుతూంది మంగళ. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video linkhttps://youtu.be/5_F-5oCi2Is

Episode metadata supplied by the publisher feed · Published Apr 23, 2023

Embed this episode

Ready to play

Anuvanuvuna Jwalinchina O hrudayana 1 | అణువణువున జ్వలించిన ఓ హృదయాన 1 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com

0:00 17:33

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 17 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on April 23, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!