EPISODE · Apr 27, 2023 · 17 MIN
Anuvanuvuna Jwalinchina O hrudayana 2 | అణువణువున జ్వలించిన ఓ హృదయాన 2 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) అణువణువున జ్వలించిన ఓ హృదయాన-2 తెలుగు ధారావాహిక రచన : పాండ్రంకి సుబ్రమణి (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) అశ్వథ్ మాట్లాడుతూ ”యు ఆర్ రైట్. రైట్! నీది బ్రిలియంట్ అకాడమిక్ రికార్డ్. దీనికి తోడు సైకలాజీ కూడా చదివావు. ఇంతే కాదు. నీకు మరొక అడిషనల్ క్వాలిఫికేషన్ కూడా ఉంది. స్వార్ధచింతన తక్కువగా ఉన్న సెన్సిటివ్ నెస్. మీ సీనియర్ వద్ద మరి కొంత ట్రైనింగు పూర్తిచేసుకుని - హైరోడ్డున సింగిల్ రూము అపార్టుమెంటొకటి తీసుకుని దానిని ఒక లీగల్ ఆఫీసుగా మలచుకున్నావంటే- అనుభవానికి అనుభవమూ వస్తుంది- రాబడికి రాబడీ కలిసొస్తుంది. ఆ తరువాత నీవద్దకు కూడా ఇద్దరు ముగ్గురు జూనియర్లు చేరకపోరు. నీకు మీ గురువుగారి ఆశీర్వాదం ఎటూ ఉందిగా! నిన్ను నిరుత్సాహపర్చడానికి కాదు గాని, నువ్వూ మీ మిత్రబృందమూ పరిసరాలను గమనించకుండా జంతుజాలం గురించే ఆలోచిస్తూ ఉండిపోతున్నారేమో ననిపిస్తుంది. ఊరకుక్కల్ని చంపకూడదని- వాటి ఉనికి వల్ల ర్యాభీస్ వ్యాపిస్తున్నాయని తోస్తే, వాటిని చంపకుండా ఇంజెక్షన్ల ద్వారానో అపరేషన్ల ద్వారానో వాటి సంతతి పెరుగుదలను అరికట్టాలని ఉద్యమాలు లేవదీస్తున్నారు. ఈ మధ్య మా కొలీగ్ ఒకతను చెప్పగా మరొకటి కూడా విన్నాను. వట్టిపోయిన ఆవులకు, అచ్చొత్తిన ఆబోతులకూ ప్రభుత్వ ఖర్చుతో వాటి ఆలనా పాలనా చూడాలని, వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ కబేళాలకు తరలించ కూడదని- ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ టు యానిమల్స్ చట్టం క్రింద ప్రజాక్షేమ వ్యాజ్యాలు కూడా వేస్తున్నారట. ఇందులో నాకేమీ ఆక్షేపణ లేదు. వాటికి మానవీయ కోణాలు లేవని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. కాని- అట్టడుగున అలమటిస్తున్న మానవాత్మల పైనా కొంచెం దృష్టి సారించమంటున్నాను”. అంటే?- అని అడుగుతూ సావధానంగా సర్దుకుని కూర్చుంది మంగళాదేవి. భర్త తను చేస్తూన్న సామాజిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపించడం ఆమెకు ఎనలేని సంతోషాన్ని కలుగ జేసింది. ఎవరో ఎక్కడో కాదు. తనతో ఏడడుగులు నడిచి తనను సహధర్మిణిగా స్వంతం చేసుకున్న మగాడు తనను మెచ్చుకోలుతో ముంచెత్తితేనే కదా- తనకూ తమ సామాజిక సమితికీ సార్థకత ఉన్నట్లు! అప్పుడు అశ్వథ్ మళ్లీ చెప్పనా రంభించాడు- “అత్యాచారాలకు లోనవుతూన్న స్త్రీల కోసం- గృహ హింస వల్ల అగచాట్లు పడుతూన్న అభాగినుల కోసం.. తదితర చట్టాలను ప్రయోగించేలా చూడమంటున్నాను. కొడుకుల అనాదరణకు, కూతుళ్ల అలక్ష్యానికి గురవుతూ వీధి పాలవుతూన్న వయోవృధ్దుల బాగోగుల కోసం సమయాన్ని వెచ్చించమంటున్నాను. అంటే- అది చేస్తే దీనిని మానేయమని కాదు నా ఉద్దేశ్యం. అందరికీ సమపాళ్లలో సహాయం అందించ మంటున్నాను. నీకున్న లీగల్ బ్యాక్ గ్రౌండు క్రిమినల్ లాకి సంబంధించి ఉండొచ్చు. కాని మొత్తానికి తరచి చూస్తే, దాదాపు అన్నీ వాటికవి జమిలిగానే ఉంటాయి. మరి కొన్ని రాజ్యాంగ పరమమైన అంశాలను పుణికి పుచ్చుకొని ఉంటాయి. ఏది ఎలా వున్నా వాటిని పరిష్కరించే తీరాలిగా! ” అని చెప్పడం ముగించి నవ్వుతూ ఉండిపోయాడు అశ్వథ్. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video linkhttps://youtu.be/2Bq87tv1XT0
Embed this episode
Ready to play
Anuvanuvuna Jwalinchina O hrudayana 2 | అణువణువున జ్వలించిన ఓ హృదయాన 2 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.