Anuvanuvuna Jwalinchina O hrudayana 3 | అణువణువున జ్వలించిన ఓ హృదయాన 3 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com episode artwork

EPISODE · May 2, 2023 · 12 MIN

Anuvanuvuna Jwalinchina O hrudayana 3 | అణువణువున జ్వలించిన ఓ హృదయాన 3 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

అణువణువున జ్వలించిన ఓ హృదయాన- ఎపిసోడ్ 3 రచన : పాండ్రంకి సుబ్రమణి (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) అప్పుడతను కాళ్ళకు ఇనుప గొలుసులు పడ్డట్టు ఆగిపోయాడు. ఆమ ముఖంలోకి ఓపారి నిదానంగా చూసి- మౌన నివేదన సమర్పించుకున్నట్టు కళ్ళను అల్లార్చాడు. ”మీరిక్కడేం చేస్తున్నారు పవన్? మీ కోసం మీ ఉనికి కోసం నేనెంతగా వెతికానో తెలుసా? ” ఉద్వేగాన్ని ఆపుకోవడానికి తీవ్ర ప్రయత్నం చేస్తూ అడిగిందామె. ఇంకా కాసేపు అలా మిటకరించి చూస్తూనే ఎట్టకేలకు గొంతు విప్పాడు “ఖైదీలు ఎక్కడెలాగుండాలో అలాగే ఉన్నాను మంగళ గారూ! “ “మీరిక్కడ జైలు ఖైదీనా! ఎలా? ఎలా?” ఆమె కంఠస్వరం హెచ్చించి అడిగింది. అప్పుడు నరాల బిగింపుని అణచుకుంటూ ఎర్ర బడ్డ ముఖాన్ని దాచుకునందుకు ప్రయత్నిస్తూ- పేలవంగా నవ్వుతూ బదులిచ్చాడతడు- “నేను వేసుకున్న యూనిఫాం చూస్తుంటే తెలియటం లేదూ నేనూ ఒక ఖైదీనేనని! మీరు గొప్పింటి స్త్రీ. ఇక్కడి సీనియర్ ఆఫీసరుగారి భార్యగా వచ్చినట్టు న్నారు. నేరారోపణ ఎదుర్కుంటూన్న ఖైదీతో అంతలావు ఉద్వేగంతో మాట్లాడటం చూసేవారికి బాగుండదు. నేర చరితను మూటగట్టుకుని అయినవాళ్ల వద్దా-- కాని వాళ్ల వద్దా దుష్టుడినన్న పేరుని సంపాదించుకున్నాను. చెరగని నలుపు ముద్ర వేసుకున్నాను. గుడ్డిలో మెల్లలా ఇక్కడ కొంచెం మెరుగే. అప్పటికి సరైన స్థాయిన సత్ప్రవర్తన గల ఖైదీల కొరత వల్ల నాకు ప్రమోషన్ వంటి ఈ స్థానాన్ని ఇచ్చారు. దినభత్యం కూడా కాస్త ఎక్కువగానే నా పద్దులో కూడుతుంటుంది. మొదట-- సారీ చెప్తాను మిమ్మల్ని ఓసారి కలవకుండా చెప్పకుండా ఊరికి వెళ్లిపోయినందుకు-- ఇక అసలు విషయానికి వస్తే మనుషులెప్పుడూ ఒకేలా ఉండరు- ఉండలేరు కూడా-- అదే కదా మంగళా- సారీ- మేడమ్ గారూ! ఋతురాగాలను మంద్ర స్థాయిలో ఉంచాలంటే- రాగద్వేషాలకు అతీతంగా సాగాలంటే ప్రకృతితో మనిషి నిత్యమూ ధ్యానాత్మక స్థితిలో నిలవాలి. అలా నిరంతరంగా అధ్యాపనం చేస్తుండాలి. మరైతే- ఇవన్నీ నావంటి సగటు మనిషికి అసాధ్యాలేగా! “ “ఆ ఉపోద్ఘాతాల మాటకేం గాని, యిప్పుడిప్పుడు మీరన్నారుగా నన్నిక్కడ ఎవరైనా చూస్తే బాగుండదని. చూస్తే చూడని. ఇప్పుడు దీనికి బదులివ్వండి. బృందావనంలో కృష్ణుడిలా ఉండాల్సిన మీరు ఇక్కడ శ్రీ కృష్ణ జన్మస్థానానికి ఎలా వచ్చారు? ” “విడి విడిగా చెప్తాను. మొదటిది- ఎవరైనా చూస్తే బాగుండదని చెప్పానే- అది మీ కోసం మాత్రమే కాదు. నా కోసమూ చెప్పాను. ఇక నేను యెదుర్కుంటూన్న నేరారోపణ గురించి చెప్తే- ఈ ప్రపంచంలో ఎవరెలా స్పందిస్తారో నాకు తెలియదు గాని- మీరు మా త్రం తప్పకుండా విపరీతమైన విస్మయానికి లోనవుతారు. అయినా తక్కువలో తక్కువగా మీకు షాక్ తగలకుండా చెప్పడానికి ప్రయత్నిస్తాను. నిదానంగా చెప్తాను. అవసరం కలిగింది కదానని నేను పరుల బ్యాంకు ఖాతాలో ఫ్రాడ్ చేసి డబ్బు దోచుకున్నానంటే నమ్ముతారా మంగళా!” దానికి ఏమనాలో ఎలా స్పందించాలో తెలియక కళ్ళు అల్లార్చుతూ ఉండిపోయిందామె. “నమ్మశక్యం కాకుండా ఉంది కదూ! ” Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video linkhttps://youtu.be/-U9bxHAnB1Q

Episode metadata supplied by the publisher feed · Published May 2, 2023

Embed this episode

NOW PLAYING

Anuvanuvuna Jwalinchina O hrudayana 3 | అణువణువున జ్వలించిన ఓ హృదయాన 3 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com

0:00 12:12

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 12 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on May 2, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!