EPISODE · May 17, 2023 · 14 MIN
Anuvanuvuna Jwalinchina O hrudayana 5 | అణువణువున జ్వలించిన ఓ హృదయాన 5 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) అణువణువున జ్వలించిన ఓ హృదయాన- ఎపిసోడ్ 5 రచన : పాండ్రంకి సుబ్రమణి (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) “అబ్బ! మళ్ళీ మొదలు పెట్టారూ! పూర్తిగా వినండి. విన్నతరవాత స్పందించండి. అప్పుడు అనుకోకుండా ఆ ‘టూ జీరో త్రీ’ తో మా ట్లాడాను. నాకెలా అనిపించిందంటే- అతడి ముఖవర్ఛస్సు చూస్తే అతడు నేరస్థుడిలా తోచ లేదండి. అతడు కళ్ళు పరిపూర్ణమైన నిశ్చలత్వంతో సజీవ చైతన్యంతో వెలగడం చూసానండి. నేరం చేసిన ఖైదీ కళ్ళు అంత ప్రశాంతంగా ఉండవండీ! ” “మనోతత్వ విశ్లేషనన్నమాట! ఇక ముందుకెళ్ళి చెప్పండి మేడమ్- వింటాను“ “అసలా ఖైదీ డ్రెస్సు ఆ మనిషికేమాత్రమూ కుదరదనిపించింది. ముఖ్యంగా అతడి చూపుల్లో ఎక్కడా ఎప్పుడూ చూడలేని నిబ్బ రం కనిపించింది. అతడి కళ్ళల్లోని కాంతి చూస్తే- ‘మీరు నన్నేమి చేసుకుంటారో చేసుకోండి!’ అని అడుగుతున్నట్లు ఉంది. నేనిప్పుడు చెప్పొచ్చేదేమంటే, ఒకసారి అతడి కేసు ఫైలు తిరగదోడితే అసలు విషయం పైకి పొక్కవచ్చేమో! జస్ట్—యాజ్ యే మాటర్ ఆఫ్ అకాడమిక్ ఇంట్రెస్టు-- ”. అది విన్న అశ్వథ్ వెంటనే బదులివ్వలేదు. విస్ఫారిత నేత్రాలతో చూస్తూండి పోయాడు. భార్య కళ్ళల్లో కానవచ్చే ఆర్ద్రత, దీర్ఘ భావ స్రవంతిలో ద్విగుణీకృ తమవుతూన్న ఉద్విగ్నత అతణ్ణి ఆలోచింపచేసింది. అంతేకాక, తననింత వరకూ నిశ్శబ్ద ఢమరుకంలా అలజడికి లోనుచేస్తున్న విషయం తననుకున్నంత ఆషా మాషీ వ్యవహారం కాదనిపించింది. అసందర్భంగా ప్రేలకుండా, అకారణంగా ఆవేశానికి లోనుకాకుండా- తొందరపడి ‘మంగళ మనసుని గాయపర్చకుండా చూడు సుమా’! - అని అతడిలోని సిక్స్తు సెన్స్ హెచ్చరించింది. కొన్ని చిన్నచిన్న తడబాటులే, చిటపటి చినుకుల్లా యెదురు కావచ్చు-- కాని కాల ఘట్టాన యెదురు చూడని రీతిన అవి భారీ ఖరీదు కట్టమంటాయి! అశ్వథ్ నిదానంగా స్పందించాడు-- “అతడెవరో చూసుంటాను మంగళా! నెంబర్ని బట్టి అతడెవరో.. అతడెటువంటి వాడో.. ఇప్పటికిప్పుడు చెప్పడం కష్టం. వాళ్ళందరూ సాధారణంగా డిప్యుటీ జైలర్ల అదుపాజ్ఞలలో ఉంటారు. అయితే- నేనిప్పుడు ఒకటి చెప్తాను. వింటావా మంగళా?” ఆమె నిదానంగా తలూపింది. ”నాకు తెలుసు, నువ్వు మంచి క్వాలిఫికేషన్స్ ఉన్న స్త్రీవని. ట్రైనింగ్ పీరియడ్ ని సగంలో ఆపేయకుండా పూర్తి చేసుకుని లీగల్ ప్రొఫెషన్ లోకి వెళ్ళి ఉంటే ఒక ప్రముఖ లేడీ లాయర్ గా ఓ సోషియల్ యాక్టవిస్టుగా ఓవెలుగు వెలిగుండేదానివని. గొప్ప ఆలోచనలు హృదయవైశాల్యం గల వాళ్ళకే వస్తాయన్నది నాకు బాగా తెలుసు. అందుకేగా ఇన్ స్టీన్ మహాశయుడు అన్నాడు- ‘నాకు వచ్చే గొప్ప ఆలోచలన్నీ భవగవంతుడి వద్దనుండే వస్తాయి‘ అని. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/tBNzZ_N-ADQ
Embed this episode
Ready to play
Anuvanuvuna Jwalinchina O hrudayana 5 | అణువణువున జ్వలించిన ఓ హృదయాన 5 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.