EPISODE · May 22, 2023 · 11 MIN
Anuvanuvuna Jwalinchina O hrudayana 6 | అణువణువున జ్వలించిన ఓ హృదయాన 6 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) అణువణువున జ్వలించిన ఓ హృదయాన - 6 రచన : పాండ్రంకి సుబ్రమణి (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఖైదీ నెంబర్- 203 పవన్ కుమార్ విషయమై భార్య తెచ్చిన ప్రస్తావన అనాసక్తంగా అదేదో అంటీ అంటనట్టు వింటున్నట్టు కనిపించాడే గాని, మనసున మాత్రం ఎర్రసిరాతో గీత గీసి గుర్తుపెట్టుకున్నాడు. డిప్యుటీ జైలు సూపరింటెండెంట్ అశ్వథ్. గురి తప్పని బుల్లెట్ లా పనిచేయడం అతడికి అలవాటు. అంచేత తను ఆఫీసు రూముకి వెళ్ళీ వెళ్ళిన వెంటనే తన పర్సనల్ అసిస్టెంటు ద్వారా పవన్ కుమార్ ప్రొఫైల్ దస్త్రం తెప్పించుకున్నాడు. మంగళ అంతగా స్పందించి చెప్పినప్పుడు తను మాత్రం ఎలా నిమ్మకుండిపోతాడు! తనకున్న విధుల ప్రకారం జైలు చుట్టూ రౌండ్సుకి వెళ్లి వచ్చి, అప్పుడే లీవునుండి డ్యూటీలో చేరిన సూప రింటెండెంట్ గారిని ఒక భారీ సెల్యూట్ తో పలకరించి రాష్ట్ర ప్రభుత్వ జైలు శాఖనుండి వచ్చిన కొన్ని ముఖ్యమైన ఆదేశాలను వివరించి కాఫీటైముకి తీరుబడిగా వచ్చి తన చేంబర్ లో కూర్చున్నాడు. ఒక వేపు కాఫీ సేవిస్తూనే మరొక వేపు దస్త్రంలో పొందుపర్చబడ్డ అనుబంధ పత్రాలను కూడా చూసాడు. కేసు ఫైలులోని కొన్ని ముఖ్యమైన విషయ వివరాలను గుర్చుంచు కోవడం మరచిపో లేదు. కాని—పనిలోపనిగా మరొకటి కూడా తలపోసాడు. తను అకారణమైన ఆరాటానికి లోనవుతు న్నాడే మో! తన మాటల సాంరాశాన్ని మెల్లమెల్లగా అర్థం చేసుకుని జీర్ణం చేసుకుని ఓ అభిప్రాయానికి వచ్చే లోపల ఖైదీ నెంబర్- 203 పట్ల కనబరచిన మునుపటి ఆసక్తి తగ్గి ఆ ప్రస్తావన ఇక తేకుండానే ఉండిపోతుందేమో మంగళ! అలాగ్గాని జరిగితే అది తనకు బోనస్ పాయింటే కదా! అయితే—అతడనుకున్నట్టు అలా జరగలేదు. మంగళ మూడవరోజు సాయంత్రం పవన్ కుమార్ కేసు సంగతి మరచిపోకుండా ప్రస్తావించింది. ఒక మామూలు రిమాండ్ ఖైదీ పట్ల అంతటి అక్కర చూపిస్తూన్న భార్య పట్ల అతడికి అసహనం వంటిది కలిగింది. ఇంగితంతో దానిని అణచుకుని ప్రతిస్పం దించడానికి కొన్ని క్షణాలు పట్టాయతడికి. ముక్కూ మొహం ఎరగని మూడో వ్యక్తి కోసం- అదీను సీరియస్ నేరారోపణ సూచించే సెక్షన్ ల క్రింద శ్రీకృష్ణ జన్మస్థలానికి వచ్చిన వ్యక్తి పట్ల ఇంతటి ఆరాటం ఎఁదుకు చూపిస్తుందో మంగళ! ఇక పొల్లుపోనివ్వకుండా విషయ వ్యవహారాల రెక్కల్న విప్పి చూస్తే అతడు మంగళకు నిజంగానే మూడో మనిషేనా? ఆ తలంపు నిప్పుకణికై తాకింది. ఖైదీ పూర్తి పేరు- పోకల పవన్ కుమార్. కాలేజీ డ్రాప్ అవుట్. స్వస్థలం భీమవరం ప్రక్కనున్న దిబ్బల పాలెం. వయసు ఇరవై ఎనిమిది. కమిట్ చేసింది సీరయస్ క్రైమ్. అప్పటికి మైనారిటీ తీరని అమ్మాయిపైన అత్యాచారం చేసాడు. అదీను ఆమెను బెదిరించి మెంటల్ టార్చర్ ఇస్తూ వరసగా ఆరునెల్లపాటు అత్యాచారం చేసాడు. కేసు ఫైనల్ స్టేజీ లో నిరూపించబడితే ప్రాత సెక్షన్ ల ప్రకారమయితే తక్కువలో తక్కువ పది సంవత్సరాలు. ఇప్పటి నిర్భయ్ శాసనానుసారం- కోర్టువారు వివిధ కేసు ల్లో ఇచ్చిన చట్టపూర్వక నిర్వచనాల ప్రకారమైతే శిక్షాకాలం ఇంకెన్నేళ్ళో! జీవితకాల కారాగార శిక్ష కూడా పడవచ్చు. అలా తగినంత తీవ్ర దశన శిక్షపడకపోతే విమన్ రైట్స్ యాక్టివిస్టులు ఊరుకోరు. వివిధ కోర్టుల కోరిడార్లను అదరగొడ్తారు. వివరణంతా విన్న తరవాత మంగళ కనురెప్పల్ని అల్లార్చి చూస్తూ ఉండిపోయి, రవంత విరామం ఇచ్చిన తరవాత భర్త ముఖంలోకి కళ్ళెత్తి చూసింది. “అంతటి ఘోర అకృత్యం చేసాడా! ఇంపాజిబుల్! ” “ఎన్నో కొత్త కొత్త అకృత్యాలు చోటుచేసుకుంటూన్న ఈ రోజుల్లో అది మాత్రం ఎందుకు ఇంపాజిబుల్? ” “ఎందుకంటే- ముఖం చూస్తే కళ్లల్లోని కాంతుల్ని చూస్తుంటే అలా అనిపించదని చెప్పాకదండీ! ” “ముఖాన్ని బట్టి వేషాన్ని బట్టి వ్యక్తి గుణగణాలను అంచనావేయడం మానుకొమ్మని హెచ్చరించాను కదా మంగళా! ”“ఓకే ఓకే! అతడికి అనుకూలంగా వెళ్ళేలా ప్రాసిక్యూషన్ వాదనల్లో గ్యాప్స్ వంటివేవీ గోచరించలేదా? ”అంటే- అన్నట్టు విస్మ యంగా చూసాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/Bt_k23Z9fh8
Embed this episode
Ready to play
Anuvanuvuna Jwalinchina O hrudayana 6 | అణువణువున జ్వలించిన ఓ హృదయాన 6 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.