EPISODE · Apr 4, 2023 · 8 MIN
అర్థాంగి | Arthangi | Telugu Short Story | Padmavathi Divakarla | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) అర్థాంగి రచన: పద్మావతి దివాకర్ల (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) పండుక్కి తన అక్క ఇంటికి వెళ్ళిన వెళ్ళిన విష్ణుమూర్తి పల్లెటూరి అమ్మాయైన మహాలక్ష్మి మీద మనసు పారేసుకున్నాడు. ముందునుండీ విష్ణుమూర్తికి పల్లెటూరి అమ్మాయిని చేసుకోవాలనే ఉంది. పట్నం అమ్మాయిలైతే తనతో ఓ ఆట ఆడుకుంటారని, వంటపని, ఇంటిపని ఏమాత్రం తెలియదని, వంటపనంతా తనపైనే పడుతుందని విష్ణుమూర్తికో బలమైన అభిప్రాయం ఉంది. అందుకే అందమైన, అమాయకమైన మహాలక్షి నవ్వుకి పడిపోయిన విష్ణుమూర్తి ఆమెని చూడగానే మనసు పారేసుకున్నాడు. అక్క సుబ్బలక్ష్మినడిగి ఆమె గురించి అంతా వివరంగా తెలుసుకున్నాడు. తమ్ముడి గురించి పూర్తిగా తెలిసిన సుబ్బలక్ష్మి రెండువైపులా నరుక్కొచ్చి ఆ పెళ్ళి సంబంధం కుదిర్చింది. అమాయకమైన అమ్మాయి భార్యగా లభించబోతున్నందుకు విష్ణుమూర్తి చాలా సంతోషించాడు. బాజాభజంత్రీలు మోగగా ఆమె మెళ్ళో తాళికట్టేసి బెంగుళూరులో కాపురం పెట్టాడు. అమాయకమైన మహాలక్ష్మి అంటే విష్ణుమూర్తికి ప్రాణం. ఆమె అమాయకత్వం వల్ల తనెన్ని ఇబ్బందుల పాలైనా ఆమెంటే వల్లమాలిన అభిమానం. మహాలక్ష్మికి బెంగుళూరులో అన్నీ వింతవింతగా కనిపించాయి. పెద్దపెద్ద ఫ్లాట్లు, మాల్స్ ఆమె మతి పోగొట్టాయి. “ఏమండీ! ఇవాళ బజారుకి వెళ్దామండీ, నేను కొన్ని చీరలు కొనుక్కోవాలండీ. నా వద్ద అన్నీ డెస్స్లే ఉన్నాయి, కానీ సరైన చీరలు లేవు." అని మహాలక్ష్మి అడిగేసరికి సరేనన్నాడు. "డ్రెస్లు ఈ ఊళ్ళో సౌకర్యంగా ఉంటాయి. పైగా నువ్వీ ఆకుపచ్చ డ్రెస్స్లో చాలా అందంగా ఉన్నావు. అయినా నువ్వు కోరుతున్నావు కనుక మంచి చీరలు కొందాం సరేనా!" అన్నాడు విష్ణుమూర్తి ఆమె వైపు మెచ్చుకోలుగా చూస్తూ. ఆ చూపులకి సిగ్గుపడింది మహాలక్షి."మరి, డ్రెస్లకి కొంగు ఉండదు కదండీ!" అంది మహాలక్ష్మి. "కొంగేంటీ?" అడిగాడు ఏమీ అర్థం కానట్లు. "మా అమ్మమ్మ చెప్పిందండీ, పెళ్ళైన తర్వాత భర్తని కొంగున కట్టుకోని తిప్పుకోవాలిట. లేకపోతే భర్తని అదుపులో ఉంచుకోవడం కష్టమట." అంది మహాలక్షి అమాయకంగా భర్త వైపు చూస్తూ. ఆమె అమాయకత్వానికి అబ్బుర పడ్డాడు విష్ణుమూర్తి. ఆమె అమాయకత్వం గురించి విష్ణుమూర్తికి ఏమైనా అనుమానముంటే ఈ దెబ్బతో అన్నీ పటాపంచలు అయిపోయాయి.ఆదివారం మహలక్ష్మిని సినిమాకి మల్టీప్లెక్స్కి తీసుకెళ్ళాడు. అక్కడ ఎస్కలేటర్ని చూసి భయపడిందామె. విష్ణుమూర్తి చిన్నగా నవ్వుకొని ఆమెని లిఫ్ట్ వద్దకు తీసుకెళ్ళాడు. అందులోకి వెళ్ళిన మహాలక్ష్మి ఆశ్చర్యంగా, "ఇదేమిటండీ ఇదో చిన్న గదిలా ఉంది." అంది. "దీన్ని లిఫ్ట్ అని అంటారు. సినిమా హాలు నాలుగవ అంతస్థులో ఉంది. మెట్లెక్కకుండా మనం ఇలా వెళ్ళిపోవచ్చు." అని ఆమెకి వివరించి మీట నొక్కాడు. లిఫ్ట్ అలా మీదకి వెళ్ళడం ఆమెకి ఆశ్చర్యం కలిగించింది. ఆ హాల్లో విష్ణుమూర్తి అభిమాన హీరో సినిమా 'రాజమండ్రి రాజయ్య' సినిమా అడుతోంది. హాల్లోకి వెళ్ళబోతూ పాప్కార్న్, రెండు కోకాకోలాలు తీసుకొని వెయ్యి రూపాయిలు ఇచ్చాడు. వెయ్యి రూపాయలు పుచ్చుకొని ఆ షాప్వాడు ఓ యాభై రూపాయలు చేతిలో పెట్టడం చూసి ఆశ్చర్యపోయింది మహాలక్ష్మి. "ఏమిటండీ! ఇంత డబ్బులు తీసుకున్నాడా ఈ జొన్నగింజల కోసం. మా ఊళ్ళో ఇరవై రూపాయలు ఇస్తే ఇంతకు రెండు రెట్లు వస్తుంది కదండీ!" అందామె విస్మయంగా. ఆమె అమాయకత్వానికి నవ్వాడు విష్ణుమూర్తి."ఇది బెంగుళూరు మహాలక్ష్మీ, ప్రతి విషయానికీ బెంగ పెట్టుకోకూడదు. సినిమా హాల్లో ధరలు ఇలాగే ఉంటాయి." అన్నాడు హాల్లోకి వెళ్తూ. సినిమాలో హీరో తెర మీద కనిపించినప్పుడల్లా ప్రేక్షకులు వేసే ఈలలు, చేసే గొల్లు చూసి ఆమె విస్తుపోయింది. ఇక్కడ సినిమా హాల్లో కూడా మన పల్లెటూళ్ళోలాగే ప్రవర్తించడం ఆమెకి చాలా వింతనిపించి భర్తతో ఆ విషయమే చెప్పింది. "మన తెలుగు సినిమా అభిమానులు ఎక్కడున్నా ఒకటే మహలక్ష్మీ, అది అమెరికా అయినా ఆస్ట్రేలియా అయినా కూడా!" చెప్పాడు విష్ణుమూర్తి నవ్వుతూ. అతనికీ హీరో ఫైట్సు చేసినప్పుడల్లా ఈల వెయ్యాలని ఉన్నా సంస్కారం అడ్డువచ్చింది.సినిమా చూసిన తర్వాత విష్ణుమూర్తి ఆమెని డొమినోస్కి తీసుకెళ్ళి పిజ్జా ఆర్డరిచ్చాడు. ఓ అరగంట తర్వాత తన ముందు ఉన్న పదార్థం చూసి మహాలక్ష్మి ఆశ్చర్యానికి అంతులేదు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/N38_GLZNB9E
Embed this episode
NOW PLAYING
అర్థాంగి | Arthangi | Telugu Short Story | Padmavathi Divakarla | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.