EPISODE · Nov 29, 2022 · 12 MIN
అరుంధతి | Arundhathi | Telugu Short Story | Ch. C. S. Sarma | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) అరుంధతి రచన: సిహెచ్. సీ. ఎస్. శర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) "నాన్నగారూ!... పరమేశ్వర మామయ్య, విశ్వం వాళ్ళు ఎలా వున్నారు?..." అడిగాడు శ్రీనివాస్. శ్రీనివాస్ తండ్రి నారాయణమూర్తి. తల్లి సావిత్రి. యీ దంపతుల ప్రథమ సంతానం శ్రీనివాస్. ఐదేళ్ళు అమెరికాలో వుండి స్వదేశానికి వచ్చి చెన్నై లో యల్&టి కంపెనీలో జి.యం గా పని చేస్తున్నారు. పది రోజుల శలవు మీద తల్లిదండ్రులను చూడాలని, భార్య రేవతి, ఐదేళ్ళ కొడుకు రఘురామ్, రెండేళ్ళ కూతురు స్వాతితో ఆంధ్రాలోని సొంత వూరికి వచ్చాడు. అతనికి ఒక చెల్లెలు, పేరు కుసుమ, ఆమె వివాహం, ఇతని వివాహానికి ముందు మూడేళ్ళ క్రితం జరిగింది. ఆమె భర్త విజయవాడలో ఆంధ్రా బ్యాక్ మేనేజర్గా పనిచేస్తున్నారు. వీరికి ఒక పాప... శశి, ఒక బాబు కార్తీక్. వయస్సు ఎనిమిది, ఏడు... కాన్వెంట్ స్కూల్లో చదువుతున్నారు. మహాశివరాత్రి నాడు అంటే ... మాఘమాసపు కృష్ణ పక్షంలో వచ్చే మహాశివరాత్రి నాడు, వీరి కుటుంబం ఆవూరి శివాలయంలో, నమక చమక రుద్రాభిషేకం... రాత్రి శివపార్వతుల కళ్యాణ మహోత్సవం జరిపించడం ఆనవాయితీ, ఆకారణంగా చెల్లెలు కుమమ... భర్త, పిల్లలతో అమ్మ గారింటికి వచ్చింది. డెబ్బై ఐదేళ్ళ పరమేశ్వర శాస్త్రి, నారాయణ మూర్తి బావగారు... అన్నీ కార్యక్రమాలనూ జరిపిస్తారు. సిద్ధాంతి "వారికేం తక్కువ ఆ పార్వతీపరమేశ్వరుల కటాక్షంతో మీరు హాయిగా వున్నారు. పెద్దవాడు సోము డాక్టరాయె. చిన్న వాడు విశ్వం మామయ్య దగ్గర అన్నీ నేర్చుకొని శాస్తుర్లు అయినాడు. మంచి వాక్ శుద్ధి వున్నవాడు. యీ చుట్టుప్రక్కల గ్రామవాసులు అందరూ వచ్చి, ముహూర్తాలు, శంకుస్థాపనలు, వివాహాలు వీరిచేత జరిపించుకొంటారు. వీరి మాట అంటే అందరికీ గురి... మంచి నమ్మకం. మన సనాతన ధర్మాన్ని నమ్మి... దానికి సంబందించిన విద్వత్తును తండ్రి దగ్గర అభ్యసించి, ఆచరిస్తూ యీ నవనాగరికతకు అతీతంగా... బ్రాహ్మణ జన్మ ఎత్తినందుకు... జన్మను సార్థకతను చేసికొనే దిశలో పయనిస్తున్నాడు విశ్వం. యిలాంటి వారు కొంతమందన్నా లేకపోతే... నీలాంటి వారికి మన సంస్కృతి, సాంప్రదాయాలను గురించి చెప్పేవారెవరు?... వాడి యిల్లాలు కుసుమ వాడికి అన్నివిధాలా తగింది. వీరికి ఒక కొడుకు ఐదేళ్ళ వాడు బాలసుబ్రహ్మణ్యం. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/iuUwevm3KCA
Embed this episode
NOW PLAYING
అరుంధతి | Arundhathi | Telugu Short Story | Ch. C. S. Sarma | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.