అశ్వ మేధం - ఎపిసోడ్ - 4 | Aswamedham - Episode - 4 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com episode artwork

EPISODE · May 17, 2023 · 19 MIN

అశ్వ మేధం - ఎపిసోడ్ - 4 | Aswamedham - Episode - 4 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)  అశ్వ మేధం ఎపిసోడ్ 4 రచన : గన్నవరపు నరసింహ మూర్తి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) విహరితో పరిచయం గురించి ఇలా వివరిస్తాడు చరణ్. "నేను ఇంటర్లో చేరగానే మొదటి రోజు పరిచయమయ్యాడు విహారి. మొదట్లో ఆ పేరును చూసి వింతగా ఉందే అనుకున్నాను. అతనిదే మాజిల్లాయే కావడంతో మా ఇద్దరికీ స్నేహం బాగా కుదిరింది. ప్రతీ శలవులకు ఇద్దరం ఒకే బస్సు ఎక్కి స్వంత ఊళ్ళకు బయలుదేరే వాళ్ళం. మొదటి వాళ్ళ ఊరు కృష్ణాపురం వచ్చేది, ఇంకో గంటన్నర ప్రయాణం తరువాత మాఊరు వశిష్ట పురం వచ్చేది. మొదటి సంవత్సరం దసరా శలవులకి నేను వాళ్ళ ఊరు వెళ్ళాను. వాళ్ళ నాన్నగారు పాతికెకరాల భూస్వామి; ఆ ఊరికి పంట కాలవ ఉండటంతో పంటలు బాగా పండుతాయి. ఇద్దరం సాయంత్రం పూట పంట కాలువకి వెళ్లి ఈత కొట్టేవాళ్ళం. సాయంకాలాలు ఆఊరి ఏటిగట్టు దగ్గర చాలామంది వాలీబాల్ ఆట ఆడేవారు . నాకు కూడా ఆ ఆట ఆడాలని ఉండేది. కానీ విహారి మాత్రం వాళ్ళతో ఆడొద్దనేవాడు. విహారి ముందు నుంచి కమ్యూనిష్ట్ భావాలు కలవాడు. ఎప్పుడూ సమ సమాజం, పేదవాళ్ళు, పీడిత ప్రజలు, భూస్వాములు, విప్లవం.. ఇలాంటి మాటలు ఎక్కువగా వాడి నోటంట వస్తుండేవి. శ్రీశ్రీ సాహిత్యాన్ని ఎక్కువగా చదువుతుండేవాడు. విరసం సభలకు వెళ్తూ ఉండేవాడు. సిందూరం రక్త చందనంబంధూకం, సంధ్యారాగంపులిచంపిన లేడి నెత్తురు అన్న కవిత ప్రతీ సభలో గానం చేసేవాడు. డిగ్రీ తరువాత నేను లా చదువుకునేందుకు యూనివర్సిటీకి వెళ్ళిపోయాను. విహారి ఇంటి దగ్గర ఉన్నపుడు ఎక్కువగా వ్యవసాయం పనులు చూసేవాడు. ఆ వేసవి శలవుల్లో ఆ ఊళ్ళో వారికి ఒక సమస్య బాక్సైట్ ఖనిజ రూపంలో వచ్చింది. తూర్పున ఏటి కవతల పెద్ద కొండలున్నాయి. పదిహేనేళ్ళ క్రితం జియాలిజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు సర్వే చేసి ఆ కొండల్లో భారీగా బాక్సైట్, మైకా గనులున్నాయనీ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది. ఆ తరువాత రాష్ట్ర మైనింగ్ శాఖ మరిన్ని సర్వేలు జరిపి కొన్ని వేల టన్నుల బాక్సైట్ ఆకొండల్లో నిక్షిప్తమై ఉందనీ, దానిని తవ్వి తీస్తే కొన్ని లక్షల కోట్లు రాష్ట్రానికి ఆదాయం వస్తుందనీ ప్రకటించింది. మరో రెండు నెలలకి ప్రభుత్వం రెండు పెద్ద కంపెనీలకు ఆ బాక్సైట్, మైకా గనుల్ని తవ్వితీయడానికి, కాంట్రాక్ట్ లిచ్చింది. ఆసమయంలో కొన్ని వందలకోట్లు అధికారపార్టీకి ఆ కంపెనీలు ముట్టచెప్పాయని పత్రికల్లో వార్త లొచ్చాయి. వెంటనే ఆ కంపెనీలు వందలు ఎక్సవేటర్స్, టిప్పర్స్ ని తీసుకొచ్చి బ్లాస్టింగ్ చేసి తవ్వడం మొదలు పెట్టాయి. అంతే! ఒక నెలలోనే ఆఊరి స్వభావమే మారిపోయింది. ఎక్కడ చూసిన ధూళి, దుమ్ము.. పొలాలమీద ఎర్రటి మట్టి, పచ్చటి చేలన్నీ ఎర్రగా మారిపోవడం మొదలైంది. నిర్మలంగా ఉండే నీలాకాశం కాస్తా ఎర్రగా మారిపోయింది. చెట్లన్నీ ఆ దుమ్ము, ధూళికి చని పోవడం , పక్షులు ఉక్కిరిబిక్కిరి అవడం మొదలైంది. తోటలన్నీ మోడు లయ్యాయి;. నెలరోజుల తరువాత ఆ ఊరితోపాటు చుట్టుప్రక్కల పది ఊళ్ళకు ఆ దుమ్ము, ధూళి వ్యాపించింది. వాతావరణ కాలుష్యం కోరల్లో ఆచుట్టు పక్కల గ్రామాలన్నీ చిక్కుకు న్నాయి. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/Ou2kyEtuAoI

Episode metadata supplied by the publisher feed · Published May 17, 2023

Embed this episode

NOW PLAYING

అశ్వ మేధం - ఎపిసోడ్ - 4 | Aswamedham - Episode - 4 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com

0:00 19:13

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 19 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on May 17, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!