అశ్వ మేధం - ఎపిసోడ్ - 5 | Aswamedham - Episode - 5 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com episode artwork

EPISODE · May 22, 2023 · 18 MIN

అశ్వ మేధం - ఎపిసోడ్ - 5 | Aswamedham - Episode - 5 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)  అశ్వ మేధం ఎపిసోడ్ 5 రచన : గన్నవరపు నరసింహ మూర్తి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) చరణ్ ఇంటికి వచ్చి వ్యవసాయ పనుల్లో మునిగిపోయాడు. వారం రోజుల తరువాత ఒకరోజు అతనికి సౌదామిని నుంచి ఫోన్ వచ్చింది. తాను ఫ్లైట్ కి రాజమండ్రి వచ్చి అక్కడి నుంచి కోనసీమకి బయలుదేరుతున్నానీ, మీరు కూడా బయలుదేరి రావాలనీ చెప్పడంతో చరణ్ ఆలోచనలో పడ్డాడు. మొదట్లో వెళ్ళాలా వద్దా అనీ సంశయించినా ఆమె అంతగా చెప్పడంతో కాదనలేక వెళ్ళాలని నిర్ణయించు కున్నాడు. విశాఖ దాకా స్కార్పియోలో వచ్చిన తరువాత అతనికో ఆలోచనవచ్చింది. మళ్ళీ బస్సుకి బయలుదేరడం, అక్కడనుండి ఇంకెన్నో మారి ఆఊరుకి వెళ్ళడంకన్నా జీపులోనే వెళ్లిపోతే తిన్నగా ఆ ఊరెళ్ళిపోవచ్చు. మళ్ళీ పని అయ్యాక తిరిగి వచ్చేయవచ్చు అని జీపు లోనే బయలు దేరాడు; ఆ విషయాన్ని సౌదామిని కి ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే ఆమె తను రాజమండ్రిలో ఎదురుచూస్తూ ఉంటాననీ, కలిసి వెళ్లిపోవచ్చనీ చెప్పింది. విశాఖ నుంచి రెండున్నర గంటల్లో రాజమండ్రి చేరుకున్నాడు. ఆమె చెప్పిన ప్రకారం వెళ్ళి ఆమెని ఎక్కించుకొని మళ్ళీ బయలుదేరింది స్కార్పియో.. "సౌదామిని గారూ! ఆమె అంటే మీ స్నేహితురాలు; ఆమె పెళ్ళికి మీరు వెళ్ళడం సహజం. కానీ మీతో పాటు నేను వస్తే వాళ్ళేమనుకుంటారో? మీకు ఇబ్బందికాదా? మన గురించి ఎవరు తప్పుగా అనుకున్నా బాధపడాలి” అన్నాడు చరణ్; "మనం ఎలా ఉన్నా సమాజం ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటుంది. దానిగురించి మీరు పెద్దగా ఆలోచించకండి. అయినా వరూధినితో నేను అన్నీ చెప్పాను. మీరు నాకు తోడుగా వస్తున్నారనీ, ఈప్రదేశం నాకు కొత్త అనీ దానితో చెప్పాను. కాబట్టి అదేమి సమస్యకాదు. దానిగురించి మీరు ఎక్కువగా ఆలోచించకండి" అని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నాడు చరణ్; ఆ తరువాత ఆమె చెప్పిన ప్రకారం ప్రయాణం కొనసాగింది. ముందుగా కోనసీమ ముఖద్వారమైన రావులపాలెం చేరుకుంది. అక్కడనుంచి అమలాపురం దారిపట్టింది. పచ్చటి కొబ్బరి తోటల మధ్యలోంచి, కాలవగట్టుమీదనుంచి వెళుతుంటే అతనికి చాలా ఆనందం కలగసాగింది. ఇంక సౌదామిని కైతే ఆపచ్చటి ప్రకృతిని చూసి మనస్సు పులకించిపోసాగింది. ద్రాక్షారామం గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నారు. అక్కడ శివుడిలింగం చాలా పొడవుగా ఉంది. ఆగుడికూడా చాలా పురాతనంగా ఉంది. చాలా సేపు ఆగుడి సౌందర్యాన్ని చూసిన తరువాత కోటిపల్లి రేవుకి చేరుకున్నారు. అది గోదావరి ఒకపాయ గౌతమి; .. ఒడ్డుని రాసుకుంటూ ప్రవహిస్తోంది; గట్టంతా పచ్చటి కొబ్బరిచెట్లు.. కనుచూపు మేరంతా సముద్రంలా గోదావరి; దూరంగా తెరచాపలతో పడవులు రేవువైపు వస్తున్నాయి. సూర్యుడి కిరణాలు గోదావరి తరగలపైపడి పరావర్తనం చెందుతున్న దృశ్యం సౌదామినికి చాలా నచ్చింది. కోటిపల్లి రేవంటే ఆమెకి చాలా ఇష్టం. చాలా సినిమాల్లో ముఖ్యంగా బాపు సినిమాల్లో ఎక్కువగా చూసింది; ఎత్తైన గోదావరి ఒడ్డు, ఒడ్డు మీదనే విశాలమైన వటవృక్షం, దాని కింద కాంక్రీటు చవటా.. నిర్మలంగా పారే గౌతమి; కోనసీమకి గోదావరంటే ప్రేమ. వాళ్ళకి అది జీవనాధారం.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/QLxswShOWww

Episode metadata supplied by the publisher feed · Published May 22, 2023

Embed this episode

NOW PLAYING

అశ్వ మేధం - ఎపిసోడ్ - 5 | Aswamedham - Episode - 5 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com

0:00 18:00

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 18 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on May 22, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!