EPISODE · Jun 4, 2023 · 17 MIN
అశ్వ మేధం - ఎపిసోడ్ - 8 | Aswamedham - Episode - 8 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Aswamedham - Episode - 8' - New Telugu Web Series Written By Gannavarapu Narasimha Murthy 'అశ్వ మేధం - ఎపిసోడ్ - 8' తెలుగు ధారావాహిక రచన : గన్నవరపు నరసింహ మూర్తి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) చరణ్ కి వారంరోజులు తరువాత రాఘవన్ హత్యకేసు సెషన్స్ కి రాబోతున్నట్లు కోర్టు నుండి ఉ త్తరం వచ్చింది. ఇదవరకే దీప తరపున లాయర్ గా కోర్టుకి ఎఫిడవిట్ ఇవ్వడంతో ఆరోజు అతనిని దీపతో సహా హాజరు కమ్మని అందులో ఉంది. చరణ్ పోలీసు స్టేషన్ కి వెళ్ళి రాజారాంని కలిస్తే కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసినట్లు తెలిపాడు. ఏవన్ ముద్దాయిగా విక్రంసింగ్, ఏ2 గా రాంసింగ్ లను నిర్ధారిస్తూ ఛార్జి షీట్లో పొందుపరిచారు. సాక్షిగా దీపని పేర్కొన్నారు. ఆ ఛార్జ్ షీట్ తో పాటు కొన్ని రిపోర్టులను కూడా పొందుపరిచారు; అందులో డాక్టర్ ఇచ్చిన పోస్ట్ మార్టెమ్ రిపోర్ట్ ముఖ్యమైనది; అందులో రాఘవన్ ది హత్యేనని , ప్రమాదం కాదన్న వివరాలున్నాయి అనీ రాజారాం చెప్పాడు. ఈ కేసు సెషన్ కి రాబోతోంది కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇంకా అఫిడవిట్ దాఖలు చేయలేదని తెలిసింది. ఇంకా గ్రీన్ ట్రిబ్యునల్ కూడా తన జవాబుని కోర్టుకి సమర్పించలేదు. చరణ్ కు మొత్తం సమయమంతా ఈ రెండు కేసుల పరిశోధనతో నే సమయం గడిచి పోతోంది; రాజారాం గారు "ముద్దాయి లిద్దరూ దొరకలేదనీ, వారిని పట్టుకునేందుకు మరింత సమయం కావాలనీ కోర్టుని కోరుతాము" అని చెప్పాడు. సౌదామిని ఢిల్లీ వెళ్ళి వారం రోజులైంది. రేపు తను వస్తున్నట్లు ఫోన్ చేసి చెప్పింది . ఆసమయంలో చరణ్ కి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే సౌదామిని కి ఫోన్ చేసి " మీరు పాట్నా వెళ్ళి అక్కడ డీజీపీ ఆఫీసులో విక్రమ్ సింగ్ , రామ్ సింగ్ ల వివరాలు కనుక్కొని రండి. అది మనకు కేసులో బాగా ఉపయోగపడుతుంది. ” అని చెప్పాడు.. ఆమె పాట్నా వెళ్ళి డీజీపీ ఆఫీసుకి వెళ్లి వాళ్ళ వివరాలు సేకరించడానికి నాలుగు రోజులు పట్టింది. అదృష్టవశాత్తు ఆమె స్నేహితురాలి అన్నయ్య అక్కడ ఎస్సీగా పనిచేస్తుండడంతో పని సులువైంది. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/sEYzSkit3QM
Embed this episode
NOW PLAYING
అశ్వ మేధం - ఎపిసోడ్ - 8 | Aswamedham - Episode - 8 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.