అత్తా ఒక అమ్మే | Attha Oka Amme | Telugu Short Story | Sumathi Thaduri | manatelugukathalu.com  episode artwork

EPISODE · Jul 14, 2023 · 3 MIN

అత్తా ఒక అమ్మే | Attha Oka Amme | Telugu Short Story | Sumathi Thaduri | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)  'Attha Oka Amme' - New Telugu Story Written By Sumathi Thaduri 'అత్తా ఒక అమ్మే' తెలుగు కథ రచన: సుమతి తాడూరి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) పొద్దున్నే లేచి చలి మంట వేసుకొని కూచున్నాడు రామయ్య. “సంక్రాంతి వెళ్లి రెండు మాసాలు అయింది. అయినా కూడా చలి ఏమాత్రం తగ్గలేదు, వెన్నులో వణుకు పుడుతుంది కదే” అంటూ తన ఇంటావిడ కమలమ్మ తో చెప్తున్నాడు. కాని తన మాట వినకుండా , ఎదో సొంచాయిస్తోంది కమలమ్మ. “ఏటైనాదే నీకు? నా పాటికి నీను ఎదో సెప్తుంటే , నీవు ఏమి వినకుండా ఏటి సెత్తున్నావే?” అంటూ కమలమ్మని తట్టాడు. “ఏమి లేదయ్యా, మనకున్నది ఒక్కతే ఆడపిల్ల. ఎంతో కష్టపడి బిడ్డ పెళ్లి చేశాము. పెళ్లి అయ్యాక వస్తున్న మొదటి పండుగ ఈ ఉగాది పండుగ. కానీ ఇది చేదు పండుగ కదా.. కొత్త అల్లుడు ఇంటికి రావద్దు అంటారు కదా.. మొదటి పండుగ కి బిడ్డ పుట్టింటికి రాకుంట అయ్యింది కదా! అక్కడ ఎలా ఉందో ఏమో, వాళ్ళ అత్త మామ దానిని ఎలా చూసుకుంటున్నారో అని ఆలోసిత్తన అయ్యా” అంది కమలమ్మ. “ఎందుకే అలా బాధ పడతావు? ఈ పండుగకి రాకపోతే ఏంటి.. ఇంకో పండగకి మనింటికి తీసుకొద్దాము. అయినా.... అక్కడ పద్ధతులు కూడా అలవాటు చేసుకోవాలి కదా! అత్త మామ అందరితో ఎలా కలసి పోవాలో, ఎలా ఉండాలో అన్ని నేర్చుకుంటుంది కదే! అయినా ఇప్పుడు మన బిడ్డ కి వాళ్లే అమ్మ అయ్యా అవుతారు. అక్కడే నూరేళ్లు కాపురం చేసుకోవాలె. మన ఇంటికి చుట్టం లెక్క ఏ ఏడాదికో వచ్చి పోతాది. నువ్విలా బాధ పడుతూ కూచుంటే , అక్కడ అది బాధపడతాది. నువ్వు మాత్రం నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు మీ అమ్మ, అయ్యా వదిలి రాలేదా? నాతో సంతోషం ఉందాలేదా? అయినా అత్త కూడా ఒక్కపుడు అమ్మే కదా , మన బిడ్డ నీ తన బిడ్డ లా చూసుకుంటూది” అన్నాడు రామయ్య. “అవునయ్యా” అంటూ లేచి, “అన్నం తిందాము రా అయ్యా” అని చేతులు కడుక్కుంది కమ్మలమ్మ. ఈలోపు ""రామయ్యా.. రామయ్యా! " అంటూ పిలుస్తూ వచ్చాడు ఉత్తరాలు వేసే సాంబయ్య బాబాయి. “రా సాంబయ్యా! ఇలా వచ్చావు..? కుసో” అంటూ ముక్కాల పీట వేసాడు. “అది.. నీ కూతురు దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది, అది ఇద్దాము అని వచ్చాను” అంటూ ఉత్తరం చూయించాడు, ఆ ఉత్తరాన్ని చూడగానే రామయ్య, కమలమ్మల మొఖం సంతోషముతో నిండిపోయింది. “ఏంటి సాంబయ్య బాబాయి.. మాకు చదువు రాదని తెలుసుకదా, నువ్వు చదివి చెప్పు బాబాయి” అని రామయ్య అన్నాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/BoJatYPfeBw

Episode metadata supplied by the publisher feed · Published Jul 14, 2023

Embed this episode

NOW PLAYING

అత్తా ఒక అమ్మే | Attha Oka Amme | Telugu Short Story | Sumathi Thaduri | manatelugukathalu.com

0:00 3:57

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 3 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on July 14, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!