EPISODE · Dec 30, 2022 · 16 MIN
బాధ్యత | Badhyatha | Telugu short Story | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) బాధ్యత రచన : జీడిగుంట శ్రీనివాసరావు (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) “ఇదిగో సీతా, రెండు లవంగాలు యిస్తావా, దగ్గు చంపేస్తోంది” అన్నాడు భార్య తో కామేశం. “మీకు కనిపించే విధంగా గూట్లో పెట్టానని చెప్పాను, అయినా మంచం మీద పడుకుని లవంగాలు యిస్తావా అని అంటారు. ఉదయం నుంచి నడుం నొప్పి వున్నా అన్నీ పనులు చేసుకుంటున్నాను. మీకు జాలి కూడా లేదు” అంటూ రెండు లవంగాలు తెచ్చి పడేసింది. “నాకోసం చేసింది ఏముంది? నీకు వండుకుంటూ నాకు పెడుతున్నావు. వెధవది రెండు లవంగాలు యివ్వడానికి ఎందుకు గొడవ” అన్నాడు చిరాకు పడుతూ. “అవును లెండి! నా కోసమే యిన్ని వంటలు! వంటంతా అయిన తరువాత ‘ఈ కూర నేను తినను, రెండు బంగాళాదుంపలు వేయించు’ అని చెప్పి దగ్గుకుంటూ తిన్నది ఎవ్వరుటా? ఏదన్నా అంటే అన్నాను అంటారు” అంది సీత లైట్ తీసేస్తో. ఆంజనేయ దండకం చదువుకొని పడుకోబోతో, కుడివైపుకి తిరిగి పడుకుని దగ్గుతున్న భర్తని చూసి, పాపం నాలుగు లవంగాలు అడిగినందుకు అనవసరంగా తిండి గురించి మాట్లాడాను, మాలాగా పూరిలో మామిడికాయ పప్పు నంచుకుని తిన్న వాళ్ళు కాదు,, మొదటి నుంచి మా అత్తగారు నాలుగు రకాల కూరలతో పిల్లలకి అన్నం పెట్టే వారుటా, ఆ అలవాటు మనలేక ఏదో ఒకటి స్పెషల్ గా వండమంటారు పాపం అనుకుంది సీత. ఈ తతంగం యిప్పటిది కాదు పెళ్లి అయి నలభై సంవత్సరాలనుండి జరుగుతోనే వుంటుంది ఈ మొగుడు పెళ్ళాల మధ్య. కామేశం గవర్నమెంట్ ఆఫీసులో, సీత ప్రైవేట్ ఆఫీస్ లో మంచి జీతం మీద ఉద్యోగం చేస్తున్నారు. వీళ్ళకి ఇద్దరు పిల్లలు. అమ్మాయి, అబ్బాయి. యిద్దరు పిల్లలకి మంచి ఉద్యోగాలు, పెళ్లిళ్లు అయిపోయి తలో సిటీ లో వుంటున్నారు. ఈ యిద్దరు ముసలాళ్ళు స్వంత వూరిని, యింటిని వదలలేక యిక్కడే వుండిపోయారు. కామేశానికి దగ్గు ఎక్కువ అవడం తోపాటు కొద్దిగా జ్వరం కూడా రావడం మొదలైంది. యింట్లో వున్న యాంటీ బయోటిక్ క్యాప్సూల్స్ వేసుకుంటున్నాడు. వారం రోజులైనా దగ్గు తగ్గకపోగా కొద్దిగా మనిషి చిక్కినట్టు అనిపించింది సీతకి. “మీరు రెడీ అవ్వండి, నేను క్యాబ్ లో మిమ్మల్ని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తాను. మీ స్వంత వైద్యం లాభం లేదు” అంటూ తను కూడా రెడీ అయిపొయింది. నిజమే ఎందుకైనా మంచిది ఒకసారి డాక్టర్ కి చూపించుకోవడం అనుకుని లేచి రెడీ అయ్యాడు. అది పేరున్న హాస్పిటల్. వచ్చిన వాళ్ళని వచ్చినట్టు అడ్మిట్ చేసుకుంటారు. డిశ్చార్జ్ ఏ రూపంలో చేస్తారో భగవంతుడికి కూడా తెలియదు. అరగంట ఆగిన తరువాత కామేశానికి అవకాశం వచ్చింది డాక్టర్ ని చూడటానికి. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/zi8Jdzppyto
Embed this episode
NOW PLAYING
బాధ్యత | Badhyatha | Telugu short Story | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.