EPISODE · Feb 9, 2023 · 4 MIN
Badhyatha | బాధ్యత | Telugu Short Story | Hanumantha T | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) బాధ్యత రచన: T హనుమంత (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) “గుడ్ మార్నింగ్ వదినా” అంది రాధ. “హాయ్ రాధా! ఏమిటి ఈ మద్యన నువ్వు వాకింగ్ రావడం లేదు, ఏమైనా సమస్యనా?” అడిగింది సుధ. “ఏమని చెబుతానులే వదినా! స్కూల్ కి పిల్లలను రెడీ చేయాలి. తర్వాత టిఫిన్లు, మావయ్య గారికి ట్యాబ్లెట్లు, సౌకర్యాలు..ఇవన్నీ చేసేటప్పటికే పూర్తిగా అలసిపోతాను. ఇంకెక్కడి వాకింగ్ వదినా!” తన బాధ చెప్పుకుంది రాధ. “మరి మీ ఆయన సాయం తీసుకోకూడదా రాధా” అంది సుధ. “ఆయన పొద్దున 7 గంటలకు పోయినోడు రాత్రి 8 గంటలైనా ఇంటికి రాడు. పైగా హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోషన్ కూడా వచ్చింది” చెప్పింది రాధ. “సరే రాధా! ఈ రోజైనా నాతో పాటు వాకింగ్ వచ్చావు. సంతోషం”. “నిన్నటి నుండి పని మనిషి పనిలో చేరింది, ఇక అన్నీ ఆమే చూసుకుంటుంది. చాలా విసిగిపోయాను వదినా.. ఇటు పిల్లలు, అటు ఇంటిపనులు, పోటి పరీక్షలకు చదువు కొందామన్నా సమయమే దొరికేది కాదు. అన్నట్లు అక్కడ బెంచ్ పైన కూర్చొన్నది నిర్మల కదా!” అంది రాధ. ““అవును రాధా. తను కూడా డైలీ వస్తుంది పార్క్ కి. కానీ తొందరగా వెళ్తుంది. ఎందుకో నాక్కూడా తెలీదు” అంది సుధ. “తను భారత్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో టీచర్ గా పనిచేస్తుంది వదిన, ఆమె భర్త R.M.P doctor. బాగా సంపాదిస్తారు ఇద్దరూ” చెప్పింది రాధ. “అవునా! కానీ నా ఫ్రెండ్ రాజు ఇంటికి పని చేయడానికి వెళ్తుంది అని విన్నానే” అంది సుధ. “ఏమో.. ఏ పుట్టలో ఏ పాముందో.. ఎందుకోసం వెళ్తుందో.. ఎవరికి తెలుసూ…” అంది రాధ. “ఈ రోజుకి ఇక చాలు. ఇంటికి వెళ్దాము పద, అలాగే నిర్మల గురించి కూడా ఆరా తీస్తాను రాధ”. ** “ఏమిటి వదినా అంత దిగులుగా ఉన్నావు?” అడిగింది రాధ. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/q865VCwPmbE
Embed this episode
NOW PLAYING
Badhyatha | బాధ్యత | Telugu Short Story | Hanumantha T | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.