బెడిసికొట్టిన ఉపాయం | Bedisikottina Upayam | Telugu Short Story | D V D Prasad | manatelugukathalu.com episode artwork

EPISODE · Jun 22, 2023 · 9 MIN

బెడిసికొట్టిన ఉపాయం | Bedisikottina Upayam | Telugu Short Story | D V D Prasad | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Bedisikottina Upayam' - New Telugu Story Written By D V D Prasad 'బెడిసికొట్టిన ఉపాయం' తెలుగు కథ రచన: డి వి డి ప్రసాద్ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) "ఏమండోయ్! సూపర్బజార్కెళ్ళి ఈ సామాన్లు తెండి!" అంటూ చేంతాడంత లిస్ట్ తన చేతికందించిన తాయారు వైపు గుర్రుగా చూసాడు గుర్నాధం. "నీకెన్ని సార్లు చెప్పాలి తాయారూ, నేను కథలు రాసేటప్పుడు డిస్టర్బ్ చెయ్యొద్దని! సాయంకాలం తెస్తానులే!" విసుగ్గా అన్నాడు గుర్నాధం. "అదేం కుదరదు. ఇప్పుడే కావాలి! అయినా మీరు కథలు రాసి ఇక్కడ ఉద్ధరించేదెవరిని? ఇవాళారేపు కథలు చదివేదెవరు? వెళ్ళిన ప్రతీ కథా గోడకి కొట్టిన బంతిలా తిరిగి రావడమే కదా! కాగితాలు, పోస్టేజి కోసం బోలెడంత డబ్బులు దండుగ!" అంది తాయారు ఈసడింపుగా. "ఇప్పుడు అవేవీ లేవే! కథ మెయిల్ చేస్తే చాలు. అయినా నా కథల జోలికి రావద్దని నీకెన్ని సార్లు చెప్పాను? అసలు నీ దిష్టి తగిలే నా కథలన్నీ తిరిగి వస్తున్నాయని నా అనుమానం. ఇప్పుడు మంచి మూడ్ వచ్చి రాస్తూంటే చెడగొడ్తున్నావు నువ్వు." అన్నాడు గుర్నాధం భార్యవైపు కోపంగా చూసి. "కావాలంటే బజారునుండి ఈ సామన్లు తెచ్చిన తర్వాత తీరుబడిగా రాసుకోండి, మీ జోలికి రానేరాను, సరేనా! సాయంకాలం మా తమ్ముడు, మరదలు వస్తున్నారు! వాడికి నేను చేసే స్వీట్స్, కారంపూస, పకోడీలు అంటే చాలా ఇష్టం. వెంటనే బయలుదేరండి!" ఆర్డర్ పాస్ చేసిందామె. 'ఓ…తిండిపోతు రామన్న, బకాసుర బామ్మర్ది వస్తున్నాడనమాట!' అని మనసులో అనుకొని, పైకి అంటే భార్య తన భరతం పడుతుందని, తను మరేం చెప్పినా ఆమె వినిపించుకునే స్థితిలో ఉండదని ఆ లిస్ట్ చేతబుచ్చుకొని కాళ్ళీడ్చుకుంటూ వీధిలోకి బయలుదేరాడు గుర్నాధం. గుర్నాధం ఈ మధ్యే కొత్తగా కథలు రాయడం ప్రారంభించాడు. ఎప్పుడు కథ రాద్దామని కూర్చున్నా ఆమె ఏదో రాద్ధాంతం చేసి గుర్నాధాన్ని కుదురుగా కూర్చోనివ్వదు. రాసిన కథలు డబుల్ సెంచూరీ దాటినా, ప్రచురించబడిన కథలు ఒక్క బౌండరీ కూడా (అంటే నాలుగు) దాటలేదు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా పెన్ను పట్టుకొని కాగితంపైన దున్నుతూనే ఉన్నాడు గుర్నాధం. అందుకే ఆమెకి మరీ లోకువైపోతున్నాడు ఈ మధ్య. భర్త కథలు రాయడం ఆమెకి కిట్టదో, లేక మరే కారణమో కాని, గుర్నాధం కథలు రాయడానికి కూర్చోగానే అకారణంగా ఏదో ఒక పని అప్పచెప్తుంది. అమెతో వేగలేక పాపం సతమత మవుతున్నాడు గుర్నాధం. ఎలా ఈ పనులనుండి తప్పించుకోవడమా అని ఆలోచిస్తూనే ఇంటికి కిలోమీటర్ దూరంలో ఉన్నసూపర్బజార్కెళ్ళాడు. అసలే శనివారం, సెలవు రోజే కాకుండా నెలలో మొదటి వారం కూడా అవడంవల్ల సూపర్ బజార్ కిటకిటలాడుతోంది. తాయారు రాసిచ్చిన లిస్ట్ పట్టుకొని సామానంతా తీసుకునేసరికి అరగంట పట్టింది. తీరా డబ్బులు చెల్లించడానికి బిల్ కౌంటర్ దగ్గరకు వెళ్ళేసరికి అక్కడ చాంతాడంత క్యూ ఉంది. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/rYtLz_TsXyI

Episode metadata supplied by the publisher feed · Published Jun 22, 2023

Embed this episode

NOW PLAYING

బెడిసికొట్టిన ఉపాయం | Bedisikottina Upayam | Telugu Short Story | D V D Prasad | manatelugukathalu.com

0:00 9:47

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 9 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on June 22, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!