భారతీయం | Bharathiyam | Telugu Short Story | Bhagavathula Bharathi | manatelugukathalu.com episode artwork

EPISODE · Aug 26, 2022 · 11 MIN

భారతీయం | Bharathiyam | Telugu Short Story | Bhagavathula Bharathi | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'భారతీ'యం రచన: భాగవతుల భారతి ఆంధ్రా యూనివర్శిటీ ముందు ఆటో దిగి, నిదానంగా లోపలికి నడిచారు శంకరశర్మ గారు, భార్య, తన మనుమల సహాయంతో. దర్వాజా పక్కనున్న సరస్వతీ మాత నిలువెత్తు ఫొటో వంక వణుకుతున్న చేతులతో నమస్కరిస్తూ, గతంలోకి జారిపోయారు . //////////// "నాకు తెలుగు లెక్చరర్ గా పదోన్నతి వచ్చిందండీ. అంతా మీ ఆశీర్వాదమే మాష్టారూ! " అంటూ పాదాలకు నమస్కారించిన ప్రకాష్ ని ఆశీర్వదించి, "ఇంత మంది నా దగ్గర తెలుగు యమ్. ఎ  చదివి చక్కటి ఉపాధ్యాయులయ్యారు. మీలో ఒకరైనా ఓ పద్యం గానీ, చక్కని వచన కవిత గానీ వ్రాస్తే చూడాలనీ విందామనీ, ఎంత ఆశో నాకు. ఎబ్బే.. ఏంటి లాభం...  జీవనోపాధి కి ఉపయోగపడింది చదువు. పోనీలే ...యశస్వీ భవ " అంటూ గోడకి వేలాడుతున్న సరస్వతీ మాత ఫోటో ను రెండు క్షణాలు తదేకంగా చూసారు. ప్రకాష్ కి తెలుసు,మాష్టారి మదిలో మెదిలే అసంతృప్తికి కారణం. అలాంటప్పుడే ఆయన ఆ ఫొటో వంక చూస్తారనీనూ. మౌనంగానే మాష్టారి ఙ్ఞాపకాలలో మమేకమౌతాడు ప్రకాష్ అప్పుడప్పుడూ. శంకర శర్మగారు ,ఉభయభాషా ప్రవీణ. తెలుగులో మాష్టర్ డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. తెలుగులో ఆయన పాండిత్యం అపారం. భాషమీద మక్కువా ఎక్కువే. కాదంబరి వర్ణనలన్నీ ఆశువుగా చెప్పేసేవారు . ప్రబంధాలూ, కావ్యాలన్నీ కరతలా మలకమే. శతకాలు రాసి గుళ్ళో రామలింగేశ్వర స్వామికి అంకితమిచ్చారు. ఆయనకి ఇద్దరూ ఆడపిల్లలే. ఆయన సంబరపడిపోతూ భారతి, వాణి అని సరస్వతీ దేవి పేర్లు పెట్టి, పిల్లల మీద శార్దూలపద్యం రాసుకుని అందరికీ వినిపించి మురిసిపోతుండేవారు. ఇలా.. శార్దూలం.. నీ పేరే యిడుకుంటి పిల్లలకు వాణీభారతీరా రే ప్రేయోరస మూర్తులార యనుచున్ ప్రేపుల్ నివేదించు త ల్లీ పారాయణమాయె కల్పసుమవల్లీ నీదు నామంబె రా వే పైతామహ వాక్చతస్ర రసనావిర్భూత హల్లీసకా! పిల్లలను తెలుగు సాహిత్యంలో, తనంత వారిని చేయాలనుకున్నారు. కానీ నిరాశే ఎదురైంది. తల్లీ పిల్లలూ ఇంగ్లీష్ భాషవైపే మెుగ్గుచూపారు. ఇంజనీర్లు అయ్యారు. వారి చదువుల్లో వారు ప్రవీణులే.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/Jk999EGQwv8

Episode metadata supplied by the publisher feed · Published Aug 26, 2022

Embed this episode

NOW PLAYING

భారతీయం | Bharathiyam | Telugu Short Story | Bhagavathula Bharathi | manatelugukathalu.com

0:00 11:45

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 11 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on August 26, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!