EPISODE · Dec 8, 2022 · 18 MIN
భలే మొగుడు... భలే పెళ్ళాం | Bhale Mogudu Bhale Pellam | Telugu short Story | Nallabati Raghavendra Rao | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) భలే మొగుడు... భలే పెళ్ళాం రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) లంబోదరం బీకాం భోజన ప్రియుడు. తీయ తీయని లడ్డూలు, హాట్ హాట్ పకోడీలు జిహ్వకు చంచలం పుట్టించే ఏ జీడి పాకం శాల్తీ నయనా చొంగలు కార్చుకుంటూ లాగించేస్తాడు. ఖచ్చి తంగా చెప్పాలంటే కారుతున్న చొంగని సైతం చూపుడు వేలుతో అందిపుచ్చుకొని మరీ జుర్రే స్తాడు. అంతా బాగానే ఉంది అదృష్టమే కలిసి రాలేదన్నట్లు అతని ఒక్కగా నొక్క భార్యామణి పేరు… అనుకూలవతి అతనికి అననుకూలంగా తయారైంది! సమస్యల్లా ఏమిటంటే పెళ్లి అయిన తర్వాత ఈ ఆరు సంవత్సరాల కాలంలో అనుకూలవతి భర్తకి ఇష్టమయ్యేలా ఏ వంట చేసి పెట్టలేకపో యింది. ఇంకా పిల్లలు పుట్టలేదు కదా బోల్డంత ఖాళీ సమయం.. వంటలు భలే భలే పసందుగా.. మసాలావిందుగా.. తీపి గుమగుమలతో ఎందుకు వండలేకపోతుంది.. ఇదీ భార్య విషయంలో లంబోదరం సమస్య. భార్య అనుకూలవతి బెల్లం గారెలు చాలా బాగా చేస్తుంది కానీ బెల్లం మాత్రం ఏబులానికి బదులు 50 గ్రాములే వేస్తుంది.. ఇక కూరల విషయాని కొస్తే కోడి మాంసం కూర సూపర్ గా వండేస్తుంది… అందులో కారం మాత్రం ఆరు స్పూనులకు బదులు అర స్పూనే వేస్తుంది. గుత్తి వంకాయ కూర అదరహో వండేస్తుంది. కానీ అందులో ఉప్పు మాత్రం మూడు స్పూనులకు బదులు ముప్పావు స్పూనుడే వేస్తుంది... ఇక రుచి ఎక్కడ ఏడుస్తుంది? పెళ్లయిన కొత్తలో లంబోదరం పెళ్ళానికి కొత్త కదా.. అని ఇవేవో సరికొత్త వంటకాలేమోనని సరిపెట్టు కున్నాడు.. కొత్త మోజుతో. కానీ బయట హోటల్ తిండికి, తన ఇంట్లో తిండికి ఏదో తేడా కొట్టొచ్చినట్లు కనపడడమే కాకుండా.. ఈమధ్య తినలేక తినలేక తిన్నప్పటికి అరగక ఒకవేళ అరిగిన.. మళ్లీ పెళుక్కున భళక్కున వాంతులు కూడా అయిపోతున్నాయి. ఒకరోజు భార్యను దగ్గరగా పిలిచి.. '' ఏమోయ్ అనుకూలవతి.. పెళ్లికి ముందు నీ పేరు విని మోసపోయానోయ్. ధర్మారావు అంటారు ధర్మా లు చేయడు.. శ్రీరామచంద్రమూర్తి అంటారు అతగాడేమో కృష్ణుడిలా శృంగారపు పురుషుడు అవుతాడు. సరే సతి అనసూయ అన్న పేరు పెడితే సూర్యకాంతంలా దడదడ లాడించేస్తుంది. అక్కడికి నీ సంబంధం కుదుర్చుకోపోయే ముందు మా అమ్మతో అన్నాను.. 'అమ్మా! పెళ్లి కూతురు పేరు అనుకూలవతి అట. అందుకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తుందేమో అని.. దానికి మా అమ్మ ఏమందో తెలుసా.. ‘నీకు అనుకూలంగా లేకపోయినా పర్వా లేదురా భడవా! మాకు అనుకూలంగా ఉంటే చాలు’ అంటూ నా మెడలు వంచి ఒప్పించేశారు. నేనే వేసానో ఇంకెవరైనా వేశారో తెలియదు కానీ మొత్తానికి మూడు ముళ్ళు పడిపోయాయి నీ మెడలో. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/oJqHvFuqwG8
Embed this episode
Ready to play
భలే మొగుడు... భలే పెళ్ళాం | Bhale Mogudu Bhale Pellam | Telugu short Story | Nallabati Raghavendra Rao | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.