EPISODE · Jul 13, 2023 · 14 MIN
బంధాలు అనుబంధాలు 1 | Bandhalu Anubandhalu 1 | Telugu Short Story | Parupalli Ajay Kumar | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Bandhalu Anubandhalu 1/2' - New Telugu Story Written By Parupalli Ajay Kumar 'బంధాలు అనుబంధాలు 1/2' పెద్ద కథ మొదటి భాగం రచన: పారుపల్లి అజయ్ కుమార్ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) "ఎంత టైమ్ పడుతుంది, ఖమ్మం చేరుకోటానికి ?" వెనుక సీటు లో ఉన్న అరవింద్ డ్రైవర్ ని అడిగాడు. "మూడున్నర లేదా నాలుగు గంటలు పడుతుంది. ట్రాఫిక్ ను బట్టి ఒక్కోసారి లేట్ అవుతుంది." డ్రైవరు తలతిప్పకుండానే బదులిచ్చాడు. అరవింద్ టైం చూసాడు. సాయంత్రం అయిదు. తొమ్మిదిలోపే ఖమ్మం చేరుకోవచ్చు అనుకున్నాడు. అక్కడినుండి వెంకటాయపాలెం 15 నిమిషాలు.. ట్రాఫిక్ తో లేట్ అయినా మొత్తం మీద పదింటికల్లా చేరుకోవచ్చు అనుకున్నాడు అరవింద్. క్యాబ్ ORR మీద వేగంగా పరుగెడుతోంది. అరవింద్ సీటు వెనక్కు వాలి కళ్లు మూసుకున్నాడు. తన రాకను తాతయ్య వాళ్లు ఎలా రిసీవ్ చేసుకుంటారోనని మనసంతా అదుర్దాగా వుంది. తను ఇండియా రావటం తల్లి కి అసలు ఇష్టం లేదు. కానీ ఇది నాన్న కోరిక.. చివరి కోరిక.. పుట్టినప్పటినుండి మొన్నమొన్నటివరకు నాన్న వైపు బంధువుల గురించి ఏమి తెలియదు. అమ్మమ్మ, తాతయ్య అమెరికాలో స్థిరపడిన తెలుగువారు. అమ్మ శశికళ అమెరికాలోనే పుట్టిపెరిగింది. నాన్న కృష్ణమూర్తి ఇండియా నుండి MS చేయటానికి అమెరికా వచ్చాడు. చదువు అయ్యాక మంచి జాబ్ వచ్చింది. అప్పుడే నాన్నకి అమ్మతో పరిచయం అయింది. ఇద్దరూ ప్రేమించుకొని పెళ్ళి చేసుకున్నారు. అయితే అమ్మ పెళ్లికి ఒక కండిషన్ పెట్టిందట. నాన్న ఇండియా కు వెళ్లరాదని, అక్కడి వాళ్ళతో సంబంధాలూ ఉండకూడదని. నాన్న ఒప్పుకున్నాడు. ఈ సంగతులన్నీ తను పెద్దయ్యాక నాన్న చెపితేనే తెలిసాయి. అమ్మమ్మ, తాతయ్య పెళ్లికి అభ్యంతరం చెప్పలేదు. అమ్మా, నాన్నలు ఇద్దరూ మంచి జాబ్స్ తో బాగానే సంపాదించారు. తను, చెల్లి అలక చదువులు అయిపోయి జాబ్స్ చేస్తున్నారు. తను అమెరికా లో పుట్టిపెరిగినా తనకు అమెరికా కల్చర్ అంతగా నచ్చలేదు. చెల్లెలు మాత్రం అమెరికా కల్చర్ బాగా వంటబట్టించుకొంది. అప్పటికే ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ తో డేటింగ్ చేసి నచ్చక వారిని వదిలి ఒక నీగ్రోను పెళ్ళి చేసుకుంటానని చెప్పింది. నాన్న వద్దన్నాడు. కానీ అలక వినలేదు. ఇద్దరూ అరుచుకున్నారు. అప్పుడే నాన్నకు మొదటిసారిగా మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది. హాస్పిటల్ లో జాయిన్ చేసారు. వాల్వ్ లు మూసుకుపోయాయని స్టంట్ వేయాలని అన్నారు డాక్టర్లు. నాన్న ముఖం లో ఏదో చెప్పలేని బాధ. ఎందుకో బాగా ఆందోళనగా ఉన్నాడు. తెల్లవారి హాస్పిటల్ కు వెళ్ళినప్పుడు నాన్న రెండు లెటర్స్ నాచేతిలో ఉంచి చెప్పాడు. 'తనకేమన్నా అయితే ఆ లెటర్స్ పోస్టు చేయమన్నాడు ' ఒక్క క్షణం ఆగి 'అమ్మకు చెప్పవద్దు ' అని చిన్నగా అన్నాడు. నాన్నను ఆపరేషన్ రూం లోకి తీసుకెళ్లాక ఆ లెటర్స్ పై అడ్రస్ చూసాను. ఇండియా అడ్రసు.. ఆ లెటర్స్ ను నా బాగ్ లో వుంచాను. నాలుగు రోజుల తరువాత నాన్న క్షేమంగా ఇంటికి వచ్చాడు. ఆ రోజు రాత్రి నాన్న నా గదికి వచ్చాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/-t56SBVx6jA
Embed this episode
NOW PLAYING
బంధాలు అనుబంధాలు 1 | Bandhalu Anubandhalu 1 | Telugu Short Story | Parupalli Ajay Kumar | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.