బ్రతుకు తెరువు | Brathuku Theruvu | Telugu Shot Story | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com episode artwork

EPISODE · Oct 27, 2022 · 15 MIN

బ్రతుకు తెరువు | Brathuku Theruvu | Telugu Shot Story | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) బ్రతుకు తెరువు రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము దిల్‌షుక్‌నగర్‌ చౌరస్తాలో రాబోయే దసరా, దీపావళి పండుగల హడావుడి కోలాహలంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా బట్టలషాపువాళ్ళు రకరకాల ఆకర్షణలతో కొనుగొలుదారుల్ని సాదరంగా ఆహ్వనిస్తున్నారు. ప్రముఖంగా నగరంలో పేరొందిన ఒకపెద్ద బట్టల దుకాణం ముందు ఒకపెద్ద జోకర్‌ బొమ్మ డెక్‌లో వస్తున్న మ్యూజిక్‌ కి అనుగుణంగా చక్కని డాన్స్‌ చేస్తూ జనాన్ని ఆనందపరుస్తోంది. అది చూసిన జనం చప్పట్లుకొడుతూ ఆనందిస్తూ వుంటారు. పిల్లలు ఆ జోకర్‌ బొమ్మతో ఆడుకుంటూ పకపకా నవ్వుతున్నారు. కొందరు ఆ బొమ్మతో సెల్ఫీలు దిగుతున్నారు. ఆ జోకర్‌ బొమ్మ ఆహ్వానాన్ని నవ్వుతూ అందుకున్న కొందరు, ఆ దుకాణానికి వెళ్ళి బట్టలు కొనుగోలు చేస్తున్నారు. ఆ దుకాణం యజమాని, ఆ జోకర్‌ బొమ్మ మాస్క్‌ తగిలించుకున్న వ్యక్తి డ్యాన్స్‌కి, సమయస్ఫూర్తికి మనసులో అభినందించాడు. "మేరా నామ్‌ జోకర్‌, మేరా నామ్‌ జోకర్‌" - జోకర్‌ నండి బాబు, జోకర్‌ నండిబాబు” అని స్టెప్పు లు వేస్తున్నాడు. దుకాణంలో బట్టలు కొని వస్తున్న దంపతుల చేతిలోంచి పిల్లవాడిని లాక్కొని, ఎత్తుకుని డాన్స్‌ చేస్తోంది. ఈ హాఠాత్సంఘటనకు ఆశ్చర్యపోయిన బాబు తల్లిదండ్రులు బొమ్మ డాన్స్‌ చూస్తూ తమాయించుకున్నారు. జనం జోకర్‌ బొమ్మ చేస్తున్న డాన్స్‌ కి చప్పట్లతో తాళం వేస్తూ సంతోషిస్తూ ఉన్నారు. సమయం చాలా సేపు గడిచినా బొమ్మ, వాళ్ళ బాబుని వారికి ఇవ్వడములేదు. బాబు తల్లి తన భర్తతో " బాబుని తీసుకోండి. ఎంత సేపు ఇక్కడ. వెళదాం" అని కోపంగా అంది. కాని జోకర్‌ బొమ్మ, బాబుకు ముద్దులు పెడుతూ , గట్టిగా పట్టుకుని ఇవ్వకుండా మారాం చేస్తోంది. బాబు తండ్రి నవ్వుతాడు. అది చూసి తల్లి, ఒక్క ఉదుటున బాబుని లాక్కుని "చాల్లెండి సంబరం, రండిక" అని అతని చేయి పట్టుకుని లాక్కెళ్ళింది. ఆ జోకర్‌బొమ్మ లో వున్న వ్యక్తి గుండెలనెవరో గట్టిగా పిండినట్లయింది. ప్రజలకు కనిపించని ఆ వ్యక్తి కళ్ళనీళ్ళు ధారావాహికంగా ప్రవహించాయి. ఆ బాబు వెళ్ళిన వైపే చెయ్యిచాచి ప్రేమగా చూస్తూ ఉంది. బాబు కనుమరుగైపోవడంతో , జోకర్‌ బొమ్మ మాస్క్‌ తీసి , కన్నీళ్ళు తుడుచుకుని , మళ్ళా ఆ మాస్క్‌ తగిలించుకుని డాన్స్‌లో నిమగ్నమైపోయాడా వ్యక్తి. ప్రతిమనిషి లో బాహ్యరూపం ఒక మాస్క్‌. " దాని వెనక కష్టాలు, కన్నీళ్ళు, వేదనలు,ఆవేదనలు, శోధనలు"- అనేక సమస్యలు దాచుకుని , ఈ లోకమనే రంగస్థలం మీద పాత్రోచితంగా నటిస్తుంటారు. ఆ మాస్క్‌ తొలగించితే వాస్తవం బయట పడుతుంది. ఈ సారి జోకర్‌ బొమ్మ, తెల్లటి ఉంగరాల జుట్టు, కళ్ళజోడు పెట్టుకుని సన్నగా వుండే వ్యక్తిని దుకాణం లోంచి వస్తూండగా చెయ్యి పట్టుకుని ఆపి నిలబెట్టింది. ఆ వ్యక్తి విషయం అర్థం కాక అచేతనంగా నిలబడి ఆశ్చర్యంగా జోకర్‌ బొమ్మను చూస్తూ వుండిపోయాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/0TkQEro7I_E

Episode metadata supplied by the publisher feed · Published Oct 27, 2022

Embed this episode

NOW PLAYING

బ్రతుకు తెరువు | Brathuku Theruvu | Telugu Shot Story | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com

0:00 15:03

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 15 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on October 27, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!