EPISODE · Jun 9, 2022 · 3 MIN
బుడుగు సీగానపెసూనాంబ స్వగతం | Budugu Ceeganapesunamba Swagatham | Telugu Short Story |Avadhanula Vijayalakshmi | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) బుడుగు/సీగానపెసూనాంబ స్వగతం.... రచన: అవధానుల విజయలక్ష్మి అసలు నాకు ఒక్కటి అర్ధం కాదు... ఈ పెద్దోళ్లందరూ బాల్యం... బాల్యం అని ఎందుకంత కొట్టుకుపోతూ ఉంటారోనని.... అప్పుడప్పుడు మళ్ళా ఆ బాల్యం తిరిగివస్తే బాగుంటుంది అంటారు... బంగారు బాల్యం అంటారు... నా మొహం ఈ పెద్దవాళ్ళకి అస్సలు ఏమీ తెలియదు... మేమేమీ చిన్నవాళ్ళం చితక వాళ్ళం కాదు కదా మాకు అన్నీ తెలిసిపోతున్నాయి... అసలు బాల్యంలో జరిగినన్ని మోసాలు ఇంకెప్పుడూ జరగవు అంటాను నేను... అదిగో అక్కడ చూడండి.... మా అమ్మ తమ్ముడిని చంకలో పెట్టుకొని గోరుముద్దలు తినిపిస్తోంది... "పిలు... చందమామని పిలు.... దాయ్ దాయ్ చంద మామా" అంటోంది... వాడికేమో పాపం జరుగుతున్న మోసం తెలియదు కదా అందుకే నోరుతెరుచుకొని చందమామని చూస్తూ "దాయ్ దాయ్" అంటున్నాడు... వాడి తెరిచిన నోట్లో అమ్మ గబుక్కున ఇంత ముద్ద పెట్టేసింది... ఎంత మోసం కదూ?... చందమామ ఎక్కడైనా దిగి వస్తాడా? మేమేమీ చిన్నవాళ్ళం చితకవాళ్ళం కాదుకదా... మా అక్కలూ అన్నలూ ఆ ఫోన్లో ఎవో... అవి చూసినప్పుడల్లా మేమూ పక్కన కూర్చునీ అన్నీ చూస్తాము కదా... చంద్రుడు ఎక్కడో దూరంగా ఉన్న ఫేధ్ధ బంతి అని మాకు తెలియదూ? ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/shapw6IQe1o
Embed this episode
Ready to play
బుడుగు సీగానపెసూనాంబ స్వగతం | Budugu Ceeganapesunamba Swagatham | Telugu Short Story |Avadhanula Vijayalakshmi | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.