EPISODE · Jan 29, 2023 · 15 MIN
బుజ్జిబాబు పెళ్లిపందిరి గారెముక్కలు | Bujjibabu Pellipandiri Garemukkalu | Telugu short Story | Nallabati Raghavendra Rao | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) బుజ్జిబాబు.. పెళ్లిపందిరి.. గారెముక్కలు రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) బుజ్జిబాబుకు పెళ్లి కాలేదు. సంబంధాలు వస్తున్నాయి. అందుకు ఏమీ లోటు లేదు. బుజ్జిబాబు అనాకారి కాదు. పెద్ద అందగాడు కాకపోయినా ఓ పిసరంత అందగాడే ! అయితే అతను ఏ అమ్మాయి నైనా హ్యాపీగా పెళ్లి చేసుకోవడం విషయంలో అతనికి ఓ పెద్ద సమస్య వచ్చి పడింది.... అది సమస్య కాదు ధర్మసందేహం.... ధర్మసందేహమూ కాదు... అనుమానం... అనుమానము కూడా కాదు... ఆవకాయ జాడీలో అరటిపండు లాంటి ఆదోరకమైన సమస్య. సరే... ఆ సమస్యను పరిష్కరించుకోవడం కోసం ఆ రోజు ఉదయం బుజ్జిబాబు... ఆయాసపడుతూ తన గురువు త్రిలోకచంద్రంగారి ఇంటికి వచ్చాడు. విషయం అంతా ఆయనకు చెప్పి అక్కడున్న గ్లాసుడు నీళ్ళు గబగబా తాగేశాడు. గురువుగారు పకపకా నవ్వేశారు. "ఒరేయ్ బుజ్జిబాబు... ప్రపంచంలో అందరూ... నీలాగే ఆలోచిస్తే... ఈ సృష్టి చక్రం తిరగదురా. నీది అనవసరపు భయం. పనికిరాని ఆందోళన. ఏదైనా సమస్య గురించి.. ఎక్కువగా ఆలోచిస్తే ఇట్లాగే ఉంటుంది. మరీ ఇంత పిరికి తనం పనికి రాదు సుమీ.. సరే.. వచ్చి.. ' గురువుగారు ఈ విషయంలో మీ సలహా ఇవ్వండి.. నాకు ధైర్యం చెప్పండి '.. అని అడిగావు కనుక... నాకు తోచిన సలహా ఇవ్వాలి. కానీ నీ మనసును బట్టి నీకు సలహా ఇవ్వకూడదు. ప్రాక్టికల్ గా చూపించాలి. అప్పుడే నీకు ధైర్యం వస్తుంది. సరే బయలు దేరు మనం ఇద్దరం నా మోపెడ్ మీద నాలుగు చోట్లకి వెళ్ళాలి..." అంటూ శిష్యుడు బుజ్జిబాబుని వెనుక సీటు మీద కూర్చోబెట్టుకుని తనే డ్రైవ్ చేస్తూ బయలు దేరారు.. గురువు త్రిలోకచంద్రoగారు. శిష్యుడిని ముందుగా తన అన్నగారు కొడుకు చక్రి ఇంటికి తీసుకెళ్లారు... చక్రి ఇద్దర్నీ లోపలకు ఆహ్వానించి కూర్చోమని మంచి నీళ్ళు తెచ్చి ఇచ్చాడు. వెంటనే తన భార్య మండోదరి ని బయటకు పిలిచి.. 'వచ్చిన వాళ్లను పలకరించడం నీకు చాతకరాదా.. బుద్ధిజ్ఞానం లేదా.. గడ్డి తింటున్నావా?? మంచి నీళ్లు ఇవ్వడం తెలియదా' అంటూ గట్టిగా అరిచాడు. ఆమె భయపడి ప్రశాంతంగా తల కిందకు దించి మౌనంగా ఎందుకన్నా ఉండిపోయింది. చక్రి మళ్లీ ఆమెను తిట్టడం మొదలెట్టాడు.. ''ఆ మౌనం ఏమిటి.. కాపురం చేయడం రాకపోతే ఎందులో అయినా దూకి చావు.. ఛీ ఎదవ పెళ్ళాం... ఎదవ పెళ్లి చేసుకున్నాను..." Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/1nDY5w2wJa0
Embed this episode
Ready to play
బుజ్జిబాబు పెళ్లిపందిరి గారెముక్కలు | Bujjibabu Pellipandiri Garemukkalu | Telugu short Story | Nallabati Raghavendra Rao | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.